సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మిట్‌ను పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ పేర్కొన్న ముఖ్య విషయాలు.. సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లు హాజరయ్యే అవకాశం ఉంది. పలు దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొననున్నారు. విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ప్రొఫెషనల్‌గా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.
పాస్‌లతో ఉన్న అధికారులకు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలి. సమ్మిట్‌కు సంబంధం లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు. శాఖల వారీగా పకడ్బందీగా ఎంట్రీ సిస్టమ్ అమలు చేయాలని సూచించారు. సమ్మిట్ ప్రాంగణం, రూట్ మ్యాప్‌లపై పోలీస్‌లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పార్కింగ్ సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.


