బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో టాస్కులకు బ్రేక్ పడింది. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఇల్లు భావోద్వేగాల నిలయంగా మారింది. ఇప్పటివరకు తనూజ, సుమన్, పవన్, దివ్య, సంజనల కుటుంబ సభ్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. ఈరోజు భరణి ఫ్యామిలీ ఇంట్లోకి రానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అందులో భరణి (Bharani Shankar) కూతురు ఇంట్లోకి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చింది.
కూతుర్ని చూడగానే భరణికి కళ్లలో నీళ్లు తిరిగాయి. నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆమె భరణిని పట్టుకుని ఏడ్చేసింది. నిన్ను చూస్తే గర్వంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ వారం కెప్టెన్‌గా చూడాలని మనసులోని కోరిక బయటపెట్టింది. మరి కూతురి కోరిక భరణి నెరవేరుస్తాడా? లేదా? చూడాలి!


