కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. సెన్సార్ బోర్డ్ నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే, ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే 'బుక్ మై షో'(BookMyShow) ద్వారా లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్‌లో అయితే ఈ సంక్రాంతికి ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా 'జన నాయగన్'(Jana Nayagan) రికార్డ్ క్రియేట్ చేసింది.
బుక్ మై షోలో రికార్డ్
'జన నాయగన్' వాయిదా పడటంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి 'బుక్‌మైషో' రీఫండ్ చేస్తుంది. టికెట్‌కు సంబంధించిన డబ్బులను ఎలా రీఫండ్ చేసుకోవాలో కూడా మెయిల్ ద్వారా పంపింది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద రీఫండ్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విషయంలో జన నాయగన్ కొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 5 లక్షలకు పైగా టిక్కెట్లను రీఫండ్ బుక్ మై షో చేస్తోంది. సుమారు రూ. 20 కోట్ల మేరకు ఆ సంస్ధ తిరిగి తన యూజర్స్‌కు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయ్ కోసం 'కమల్‌హాసన్' మేనల్లుడు
జన నాయగన్ సెన్సార్ విషయంలో కమిటీలోని నలుగురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, కమిటీలోని ఒక సభ్యుడు భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు CBFC ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ జారీ ఆగిపోయింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను నిలిపివేయాలన్న సిబిఎఫ్‌సి నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే, విజయ్ సినిమా తరుఫున కమల్‌హాసన్ మేనల్లుడు సతీశ్ పరాశరణ్ వాదిస్తున్నారు.


