టాలీవుడ్ మరో పెళ్లి సంబురం మొదలు కానుంది. రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిన వెంటనే మరో టాలీవుడ్ హీరో పెళ్లికి అంతా సిద్ధమైంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల దుబాయ్‌లో శిరీష్- నయనిక గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.
తాజాగా అల్లు శిరీష్ తన పెళ్లి వేడుకకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. అల్లు స్టూడియోస్‌లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయని వెల్లడించారు. మా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నామని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు.
కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది.
Nayanika & I are having an intimate wedding with family & friends on 6th March.
We are excited to celebrate our Pre Wedding Celebrations with the Telugu film industry prestigiously at Allu Studios on the 2nd March.— Allu Sirish (@AlluSirish) February 26, 2026


