షణ్ముఖ్ జశ్వంత్.. ఈ పేరు ఒకప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్. పలు వెబ్ సిరీస్‌లతో పాటు కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ ద్వారా బాగా క్లిక్కయ్యాడు. దీంతో టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తున్న సమయంలోనే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న ఇతడు బిగ్‌బాస్‌లో మాత్రం సిరి హన్మంత్‌తో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ రావడంతో లవ్‌కు బ్రేకప్ చెప్పాడు. అయితే, ఇప్పుడు తన కొత్త ప్రేయసిని తన అభిమానులకు పరిచయం చేశాడు.
బిగ్‌బాస్ తర్వాత కూడా షణ్ముఖ్ అనేక వివాదాలు చుట్టూ తిరిగాడు. అతనిపై ఏకంగా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఆపై యాక్సిడెంట్ వంటి వివాదంతో వార్తల్లో నిలిచాడు. అయినప్పటికీ మళ్లీ వెబ్ సిరీస్‌లు, సినిమాలపై దృష్టి పెట్టి తన కెరీర్‌ను గాడిలో పడిలే చేసుకున్నాడు. ఇక తాజాగా కొత్త ఏడాది సందర్భంగా షణ్ముఖ్ తన ప్రేయసిని పరిచయం చేశాడు.

ఈ క్రమంలోనే తన సోషల్ మీడియాలో తన ఫోటోలను పంచుకున్నాడు. కానీ, ఆమె ముఖం కనిపించకుండా తనతో దిగిన పలు ఫోటోలను షేర్ చేశాడు. 'Happy Birthday V… This is Gods plan' అంటూ ఒక అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఆ యువతి పేరు ‘V’ అనే అక్షరంతో ప్రారంభమవుతుందన్న క్లూ ఇచ్చాడు. అయితే, ఆమె ఎవరో అనేది మాత్రం ప్రస్తుతానికి వెళ్లడించలేదు.


