కొందరు బిగ్‌బాస్ సెలబ్రిటీలు బయటకు రాగానే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినా, ఫంక్షన్‌కు వెళ్లినా చుట్టూ బాడీగార్డులను వెంటేసుకుని వెళ్తుంటారు. గతంలో బిగ్‌బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. సోనియా-యష్ పెళ్లికి కూడా బాడీగార్డులను వెంటేసుకునే పోయాడు. నిన్నగాక మొన్న బిగ్‌బాస్ 9 విన్నర్ పవన్ కల్యాణ్ పడాల పదిమంది బాడీగార్డులతో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు.
150 మంది బాడీగార్డులా?
అయితే ఓ హిందీ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా 150 మంది బాడీగార్డులను పెట్టుకుందంటూ ఓ వార్త వైరలవుతోంది. తను మరెవరో కాదు, తాన్య మిట్టల్. గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందీ లేడీ కంటెస్టెంట్. పూటకో చీర కడతానని బిగ్‌బాస్ హౌస్‌కు దాదాపు 800 చీరలు తీసుకెళ్లింది. అలాగే 50 కిలోల నగలు కూడా పట్టుకెళ్లింది. లగ్జరీకి పెద్ద పీట వేసే ఈ బ్యూటీ తనకు 150మంది బాడీగార్డులున్నారన్న రూమర్‌పై తాజాగా స్పందించింది.
అందులో నిజం లేదు
తాన్య మిట్టల్ మాట్లాడుతూ.. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని పుట్టించారు. నా కింద 150 మంది సిబ్బంది పనిచేస్తారని మాత్రమే చెప్పాను. దానికి బిగ్‌బాస్ హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ జైషా ఖాద్రి.. వాళ్లందర్నీ నా బాడీగార్డ్స్ అని సరదాగా అన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. అలా అని బాడీగార్డ్స్ లేరని చెప్పను. నాకంటూ కొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంది.
అబద్ధం చెప్పను
ఎందుకంటే నాకు బట్టల పరిశ్రమ, ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేను. కానీ, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధాలాడాల్సిన అవసరం నాకసలే లేదు అని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తాన్య మిట్టల్.. హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్‌లో పాల్గొని మూడో రన్నరప్‌గా నిలిచింది. ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది.
చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్


