ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా! | Bigg Boss 9 Telugu Emmanuel special post about his Girlfriend | Sakshi
Sakshi News home page

Emmanuel: దేవుడిచ్చిన గిఫ్ట్‌ నువ్వు.. నా లైఫ్‌లోకి వచ్చినందుకు థాంక్స్‌

Jan 1 2026 2:04 PM | Updated on Jan 1 2026 2:57 PM

Bigg Boss 9 Telugu Emmanuel special post about his Girlfriend

దగ్గరగా ఉన్నప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడే ప్రేమ విలువ తెలుస్తుందంటారు. జబర్దస్త్‌ కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌ విషయంలోనూ ఇదే నిజమైంది. అతడు కమెడియన్‌గా ‍స్థిరపడటానికి ముందే ఓ అమ్మాయి తనను ప్రేమించింది. ఇమ్మూ కూడా తనతో చాటింగ్‌ చేస్తూ, ఫోన్లు మాట్లాడుతూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. చచ్చినా, బతికినా తనతోనే కలిసుండాలని నిర్ణయించుకున్నాడు.

బిగ్‌బాస్‌ షోలో రియలైజేషన్‌
కానీ ఇమ్మూ కమెడియన్‌గా ఫేమస్‌ అవడంతో షూటింగ్స్‌లో ఎక్కువ బిజీ అయ్యాడు. ఆ సమయంలో ప్రియురాలికి సరిగా టైమ్‌ ఇవ్వకపోగా చిరాకు, అసహనం, కోపం అన్నీ తనపైనే చూపించాడు. తానెంత తప్పు చేశాడన్నది తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌కు వెళ్లాక రియలైజ్‌ అయ్యాడు.

బహుమతిగా బిగ్‌బాస్‌ ట్రోఫీ..
ప్రేయసిని ఎంతో బాధపెట్టానని అర్థం చేసుకుని రోజూ రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకోసం బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలిచి దాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. కానీ, అది కుదర్లేదు. అయితే షో నుంచి బయటకు వచ్చాక మాత్రం తనను కలిసి ప్రేమ కబుర్లు చెప్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

ఎంతో బాధపెట్టా..
వేస్ట్‌ అమ్మా (ఇమ్మూ తన ప్రియురాలిని ప్రేమగా వేస్ట్‌ ఫెలో అని పిలుచుకుంటాడు).. నా జీవితంలోకి వచ్చినందుకు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్యూ.. నిన్ను నేను చాలా బాధపెట్టాను. కానీ, ఈ సంవత్సరం నుంచి మనం ఇంకా స్ట్రాంగ్‌ ఉండి.. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇప్పటినుంచి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నా..! నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన పెద్ద బహుమతి నువ్వే.

త్వరలోనే పరిచయం చేస్తా..
నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నాకు ఎల్లప్పుడూ అండగా నిలబడ్డందుకు, అపారమైన ప్రేమను పంచినందుకు థాంక్యూ సో మచ్‌.. ఐ లవ్యూ సో మచ్‌ నా బుజ్జి ఫెల్లో.. నువ్వే నా సర్వస్వం.. హ్యాపీ న్యూ ఇయర్‌.. అని రాసుకొచ్చాడు. అతడి ప్రియురాలి పేరు రుచి అని తెలుస్తోంది. అయితే ఇమ్మూ షేర్‌ చేసిన ఫోటోలో ఆమె ముఖం దాచుకుంది. ఇది చూసిన అభిమానులు వదినను ఎప్పుడు చూపిస్తావ్‌? అని అడుగుతున్నారు. అందుకు ఇమ్మాన్యుయేల్‌.. త్వరలోనే చూపిస్తానని రిప్లై ఇచ్చాడు.

 

 

చదవండి: మురారి క్లైమాక్స్‌.. పస్తులుండి మరీ ఆరోజు షూటింగ్‌.. దటీజ్‌ మహేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement