హీరోయిన్‌ కోసం ప్రభాస్‌ స్పెషల్‌ ట్రీట్‌ | Prabhas Gives Food Treat to Fauzi Movie Actress Imanvi | Sakshi
Sakshi News home page

Prabhas: ఫుడ్డుతో చంపేస్తున్న ప్రభాస్‌.. ఈసారి ఎవరికంటే?

Feb 23 2026 11:22 AM | Updated on Feb 23 2026 11:32 AM

Prabhas Gives Food Treat to Fauzi Movie Actress Imanvi

డార్లింగ్‌ ప్రభాస్‌ భోజనప్రియుడు. ఇంటి భోజనాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. తను తినడమే కాదు చుట్టూ ఉన్నవారికి సైతం ఫుడ్డు పెట్టి చంపేస్తాడు. ఎక్కడ షూటింగ్‌ ఉన్నా సరే ఇంటి నుంచి తెప్పించి మరీ తోటి నటీనటులకు, చిత్రయూనిట్‌కు భోజనం తినిపిస్తాడు. కొన్నిసార్లు అందరి కోసం ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుంటాడు. అలా ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఏకంగా చెన్నై నుంచి ముంబైకి భోజనం తెప్పించాడు.

హీరోయిన్‌ కోసం స్పెషల్‌ ఫుడ్‌
తాజాగా ఫౌజీ హీరోయిన్‌ ఇమాన్వికి ఇలాగే ఫుడ్‌ ట్రీట్‌ ఇచ్చాడు. స్టార్టర్‌ దగ్గరినుంచి బిర్యానీ, స్వీట్స్‌ వరకు.. అన్నింటినీ పార్శిల్‌ చేసి పంపించాడు. వాటిన్నింటినీ టేబుల్‌ ముందు పెట్టుకున్న ఇమాన్వి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇంత రుచికరమైన భోజనం పంపింనందుకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెప్పింది.

సినిమా
ఫౌజీ విషయానికి వస్తే.. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. సీతారామం ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మిథున్‌ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 దసరాకి విడుదల కానుంది.

చదవండి: బాఫ్టా అవార్డులు.. తొలిసారి భారత్‌ మూవీకి అవార్డ్‌

Advertisement
 
Advertisement
Advertisement