ధోతీ-స్టైల్‌లో స్టార్‌ హీరోయిన్‌.. డ్రెస్‌ ధర ఎన్ని లక్షలో తెలుసా? | Priyanka Chopra Wear Dhoti Style dress At The Bluff Press Tour | Sakshi
Sakshi News home page

ధోతీ-స్టైల్‌లో స్టార్‌ హీరోయిన్‌.. డ్రెస్‌ ధర ఎన్ని లక్షలో తెలుసా?

Feb 23 2026 7:34 AM | Updated on Feb 23 2026 9:25 AM

Priyanka Chopra Wear Dhoti Style dress At The Bluff Press Tour

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా  ఫ్యాషన్ మారథాన్‌లో సందడిగా కనిపించింది. ఆపై తన కొత్త సినిమా ది బ్లఫ్ ప్రెస్ టూర్‌లో పాల్గొని అందరి చూపు తనవైపు తిప్పుకుంది. హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ది బ్లప్ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా ఒక  సముద్రపు దొంగ పాత్రలో నటించింది. క్రూరమైన హింసాత్మక గతాన్ని వదిలేసి తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే ఒక మహిళ చేసే  పోరాటమే ఈ సినిమా  అసలు కథ.

ది బ్లఫ్ మూవీ ప్రెస్ టూర్‌లో సరికొత్త డ్రెస్‌లో ప్రియాంక చోప్రా పాల్గొంది. ఖరీదైన ధోతీ-స్టైల్‌ దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది.  ఈ దుస్తులను జిమ్మెర్మాన్ బ్రాండ్ నుండి తయారు చేశారు. లూనా డ్రేప్డ్ హరేమ్ ప్యాంట్స్ ధర రూ. 1.43 లక్షలు, కోఆర్డినేటింగ్ సిల్క్ శాటిన్ షిఫాన్ టాప్ ధర రూ.77వేలు.  మొత్తం ధర సుమారు  రూ. 2.20 లక్షలు అని తెలుస్తోంది. లో-బ్యాక్ డిజైన్‌తో చేసిన ఈ ధోతీ డ్రెస్‌ చాలామందిని ఆకట్టుకుంది.

రాజమౌళి, మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని అనే ప్రధాన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. వారణాసి మూవీతో హాలీవుడ్‌ నుంచి ఆమె తిరిగి ఇండియన్ సినిమాకు వస్తుంది. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రియాంక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement