ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటి బయటకు వచ్చి అభిమానులను పలకరిస్తుటాడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తనకోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు కనిపించడం, పలకరించడం తన కర్తవ్యం అని భావిస్తాడు. అయితే నిన్న (ఫిబ్రవరి 22) మాత్రం అమితాబ్ ఇంటి నుంచి బయటకే రాలేదు.
కనిపించని అభిమానులు
అందుకు గల కారణాన్ని అమితాబ్ తాజాగా తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు. పనెప్పుడూ ఉత్సాహంతోనే సాగుతుంది. కానీ, అది పూర్తవకముందే రోజు ముగుస్తుంది. ఇంతలోనే విరామం, విశ్రాంతి తీసుకునేందుకు ఆదివారం వస్తుంది. దుదరదృష్టవశాత్తూ ఈ ఆదివారం జల్సా (బిగ్‌బీ ఇంటి పేరు) గేటు ముందు ఎవరూ లేరు. కాబట్టి మీరు కూడా ఎవరూ దూర ప్రయాణాలు పెట్టుకోకండి, మీ శక్తిని ఆదా చేసుకోండి.
అదేంటి?
తర్వాత మనం మళ్లీ కలుద్దాం. అప్పటివరకు ఈ నిశ్శబ్ధపు ఆలోచనల్లోనే ప్రేమను పంచుకుందాం అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. అమితాబ్‌ను చూసేందుకు ఎవరూ రాకపోవడమేంటి? ఆయన చరిష్మా తగ్గిపోయిందా? అని కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా హీరోగా రాణిస్తున్న అమితాబ్.. చివరగా వేట్టైయాన్ సినిమాలో కనిపించాడు. 120 బహదూర్ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే రామాయణ: పార్ట్ 1లో జటాయు పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు.


