నటుడు అజిత్ ఇప్పుడు కార్ రేస్‌లపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొన్న ఈయన త్వరలో మరో కార్ రేస్‌లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం దుబాయ్‌లో శిక్షణ తీసుకుంటున్న అజిత్‌ను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మంజువారియర్ అజిత్‌ను కలిశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ మలయాళ సంచలన నటి ధనుష్ హీరోగా నటించిన అసురన్ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత అజిత్ హీరోగా నటించిన తుణివు చిత్రంలో నాయకిగా నటించారు. అదేవిధంగా రజనీకాంత్‌కు జంటగా వేట్టయన్ చిత్రంలోనూ నటించారు. ప్రస్తుతం మిస్టర్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. అజిత్ ఇంతకు ముందు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. త్వరలో తన నూతన చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే విధంగా క్రేజీ స్టార్ శ్రీలీల ఈ చిత్రంలో నటింనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో మంజువారియర్ మరో ముఖ్యపాత్రలో నటించనున్నారా? అనే ప్రశ్నకు తావిచ్చే విధంగా ఆమె అజిత్‌ను కలసిని సంఘటన చెబుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అజిత్ నటించనున్న 64వ చిత్రం ఆయన ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా చాలా ఫ్రెష్‌గా ఉంటుందని దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ పేర్కొన్నారు.


