ప్రభాస్- సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్ నుంచి తెరకెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’.. కొత్త ఏడాది సందర్భంగా ఆ మూవీ నుంచి అదరిపోయే పోస్టర్‌ను దర్శకుడు సందీప్ రిలీజ్ చేశారు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ లుక్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. బాలీవుడ్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెండితెరపై ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో డార్లింగ్ కనిపించారు. ఒళ్లంతా గాయాలతో తను ఉండగా.. ఆయన ముందు త్రిప్తి దిమ్రీ నిలబడి ఉంది. చేతిలో వైన్ బాటిల్‌తో మరింత ఫైర్‌ను పెంచాడు. అందరినీ మెప్పించిన పోస్టర్‌పై సందీప్, ప్రభాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.
ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి హోస్ట్‌గా ప్రభాస్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్‌లతో ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే వారు స్పిరిట్ ఫస్ట్ లుక్ గురించి ప్రభాస్ ఇలా అన్నారు. 'నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ పోస్టర్.. కల్ట్ పోస్టర్' అంటూ దర్శకుడు సందీప్‌ను మెచ్చుకున్నారు. ఇలాంటి ఆలోచన సందీప్‌కి ఎలా వచ్చిందోగానీ అదిరిపోయిందంటే డార్లింగ్ ప్రశంసించారు. అయితే, సందీప్ రెడ్డి కూడా పోస్టర్ వెనుక జరిగిన కసరత్తు గురించి చెప్పుకొచ్చారు. బాహుబలి తర్వాత అంతే రేంజ్‌లో ప్రభాస్‌ను చూపించాలని ఆలోచించానని.. అందుకే ఆ పోస్టర్‌ను రెడీ చేశానన్నారు. అయితే, సినిమాలో ఒక సీన్ నుంచి ఆ పోస్టర్‌ను తీసుకున్నట్లు ఆయన పేర్కన్నారు.


