మహబూబ్‌నగర్ : జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా కళాశాలలో వారం రోజుల ముందుగానే సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.
ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మంగళవారం ఉత్సాహంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.
పండుగ విశిష్టతను తెలిపే రంగవల్లులు ఆకట్టుకున్నాయి. భోగి మంటలు వేసి, పాలు పొంగించారు. గొబ్బమ్మలు పెట్టి విద్యారి్థనులు ఆడిపాడారు. ఆకర్షణీయంగా ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందజేశారు.


