సినిమాలు తక్కువ.. ఇంటర్వ్యూలు ఎక్కువ! | Sandeep Reddy Vanga Doing Another Movie Promotions | Sakshi
Sakshi News home page

ప్రమోషన్స్‌ కోసం సందీప్‌ రెడ్డి వంగాను వాడేస్తున్నారుగా!

Jan 8 2026 2:32 PM | Updated on Jan 8 2026 3:12 PM

Sandeep Reddy Vanga Doing Another Movie Promotions

సినిమాకు ప్రమోషన్స్‌ కచ్చితంగా కావాల్సిందే! కంటెంట్‌ సంగతి పక్కనపెడితే.. ఫలానా మూవీ థియేటర్లలో వస్తుందని తెలిసేది ప్రమోషన్స్‌ వల్లే! కాబట్టి రిలీజయ్యేవరకు గట్టిగా ప్రమోషన్స్‌ చేయాల్సిందే.. తర్వాత టాక్‌ బాగుంటే సినిమా దానంతటదే పుంజుకుంటుంది! అందుకే ఈ మధ్య రకరకాలుగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు.

సినిమాల కన్నా ఇంటర్వ్యూలే ఎక్కువ
అయితే పాన్‌ ఇండియా డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాను కూడా ఈ ప్రమోషన్స్‌లోకి లాగుతున్నారు. సందీప్‌ రెడ్డి ఇప్పటివరకు మూడే మూడు సినిమాలు తీశాడు. 2017లో అర్జున్‌ రెడ్డితో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. దాన్నే హిందీలో కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ చేసి అక్కడా విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం యానిమల్‌ మూవీతో మరోసారి రికార్డులు తిరగరాశాడు. తొమ్మిదేళ్లలో మూడు సినిమాలు తీస్తే.. ఇంటర్వ్యూలు మాత్రం అందుకు రెట్టింపు సంఖ్యలో చేశాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి..
ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్‌ సమయంలో దర్శకధీరుడు రాజమౌళితో ఇంటర్వ్యూ, దేవర సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో, కింగ్డమ్‌ అప్పుడు విజయ్‌ దేవరకొండ, దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో, శివ రీరిలీజ్‌ సమయంలో రాంగోపాల్‌ వర్మతో.. ఇలా వరుసగా ఇంటర్వ్యూలు చేశాడు. హాయ్‌ నాన్న రిలీజ్‌ సమయంలో నానిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు ది రాజా సాబ్‌ కోసం రంగంలోకి దిగాడు. రాజాసాబ్‌ హీరోహీరోయిన్లు ప్రభాస్‌, మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌లను ఇంటర్వ్యూ చేశాడు. 

బుల్లెట్‌ పాయింట్‌ ప్రశ్నలు
అందరూ సందీప్‌నే యాంకర్‌గా ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. జనాల్లో అతడికున్న క్రేజ్‌.. అలాగే తన ఇంటర్వ్యూలో సాగదీత అనేది ఉండదు. బుల్లెట్‌ పాయింట్స్‌లా ప్రశ్నలడుగుతాడు. ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా బోర్‌ కొట్టకుండా జనాలు మైమరచిపోయి చూస్తుండిపోయేలా చేయగలడు. అతడి అభిప్రాయాలు చాలామంది సినీప్రేక్షకులకు కనెక్ట్‌ అవడం మరో విశేషం. పైగా పాన్‌ ఇండియా డైరెక్టర్‌ కాబట్టి బాలీవుడ్‌లోనూ బజ్‌ క్రియేట్‌ అవుతుందన్న ఆశ కూడా ఉండొచ్చు! అందుకే వంగాతో ఇంటర్వ్యూ అంటే అటు చిత్రయూనిట్‌కు, ఇటు సినీప్రియులకు ఎంతో ఇష్టం!

 

చదవండి: 23 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement