'బిగ్‌బాస్‌' చరిత్రలో కంటెస్టెంట్స్‌ నీచమైన పని.. ఇద్దరిపై రెడ్‌ కార్డ్‌ | Bigg Boss Tamil 9, First Time In BB History Host Vijay Sethupathi Issues Red Card To Parvathy And Kamruddin, Video Viral | Sakshi
Sakshi News home page

'బిగ్‌బాస్‌' చరిత్రలో కంటెస్టెంట్స్‌ నీచమైన పని.. ఇద్దరిపై రెడ్‌ కార్డ్‌

Jan 4 2026 2:36 PM | Updated on Jan 4 2026 4:09 PM

Bigg boss tamil 9 host vijay sethupathi red card issue on parvathy and kamruddin

బిగ్బాస్చరిత్రలో తొలిసారి ఇద్దరు కంటెస్టెంట్స్ఒకేసారి రెడ్కార్డ్‌ జారీ చేశారు. దీంతో తక్షణమే వారు హౌస్‌ను విడిచి వెళ్లాల్సి వచ్చింది. తమిళ బిగ్బాస్‌-9లో జరిగిన ఘటన పెద్ద సంచలనంగా మారింది. హౌస్ట్విజయ్సేతుపతి వారిద్దరిపై విరుచుకుపడ్డారు. రెడ్కార్డ్ఇస్తున్నట్లు ప్రకటించగానే ఇతర కంటెస్టెంట్స్తో పాటు ప్రేక్షకులు కూడా సంబరాలు చేసుకున్నారు. బిగ్బాస్చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం

బిగ్బాస్తమిళ్ఇప్పటికే 90రోజులు పూర్తి చేసుకుంది. మరో వారంలో ఫైనల్జరగనుంది. క్రమంలో టికెట్ టు ఫినాలే ఏపిసోడ్జరిగింది. కార్ టాస్క్లో భాగంగా నటి సాండ్రాను బలవంతంగా బయటకు నెట్టినందుకు పార్వతి, కమ్రుదిన్‌లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారిద్దరూ కలిసి సాండ్రాను కాలితో తన్నారు. దీంతో ఆమె కారు నుంచి దూరంగా పడిపోయింది. ఆ తర్వాత కూడా సాండ్రా కాలు కారు డోర్ మధ్య ఇరుక్కుపోయింది. అప్పుడు కూడా వారు కనికరం చూపలేదు. దీంతో ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. దాడి తర్వాత సాండ్ర చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తీవ్రమైన ఆందోళన తనలో కనిపించింది

దీంతో ప్రేక్షకులు కూడా పార్వతి, కమ్రుదిన్ తీరుపై విరుచుకుపడ్డారు. ఇక ఇతర హౌస్మెట్స్అయితే, ఏకంగా వారి మొఖంపై ఉమ్మేసినంత పనిచేశారు. టైటిల్రేసులో ఉన్న వినోథ్‌, దివ్యలు కలిసి వారిని కడిగిపారేశారు. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్లో హౌస్ట్విజయ్సేతుపతి వారికి రెడ్కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఏకంగా సంబరాలు జరుపుకున్నారు. కోందరైతే ఏకంగా కేకులు కట్‌ చేశారు. బిగ్‌బాస్‌ షో చాలా భాషలలో టెలికాస్ట్‌ అవుతుంది. కానీ, ఇప్పటి వరకు మహిళా కంటెస్టెంట్‌ ఎవరూ కూడా రెడ్‌ కార్డ్‌ అందుకోలేదు.  తొలిసారి పార్వతిపై బిగ్‌బాస్‌ జారీ చేశాడు.

క్రమంలో ఇతర కంటెస్టెంట్స్ఎవరూ వారిద్దరికీ సెండాఫ్ఇవ్వలేదు. హౌస్ట్విజయ్సేతుపతి కూడా వారిని స్టేజీపైకి పిలిచి కనీసం ఒక్కమాట కూడా మాట్లడలేదు. హౌస్నుంచి డైరెక్ట్గా ఇంటికి పంపించేశారు. బిగ్బాస్చరిత్రలో ఇంతటి అవమానకరమైన రీతిలో ఎవరూ కూడా ఎదుర్కోలేదు. గేమ్కోసం ఒక స్త్రీని ఇలా బయటకు లాగి, కాళ్ళతో తన్నడం ఏంటి అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బిగ్బాస్ప్రేక్షకులు మాత్రం వారికి తగినశాస్తి జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement