నటడు శివాజీ ఒక వేదికపై మాట్లాడుతూ హీరోయిన్ల దుస్తుల గురించి కామెంట్ చేశారు. అవి సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు కౌంటర్‌గా యాంకర్, నటి అనసూయ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎవరూ చెప్పాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఏమీ చిన్నపిల్లలం కాదని తెలిపారు. తమ పరిధితో పాటు హక్కులు కూడా తెలుసన్నారు. 'మా ఇష్టానికి మమ్మల్ని బతకనీయండి.' అంటూ శివాజీ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆమెపై నెట్టింటి భారీ ట్రోలింగ్ జరిగింది. బూతులతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆమె ఎక్కడా తగ్గలేదు. తిరిగి అదే రేంజ్‌లో సమాధానం చెప్పారు.
కొద్దిరోజులుగా అనసూయ అభిమాన సంఘం పేరుతో కొందరు మీడియా వేదికగా డిబెట్‌లలో పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఆమె వివరణ ఇచ్చారు. తాజాగా తన అభిమానులతో మాట్లాడేందుకు ఆమై లైవ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ చెప్పుకునే వ్యక్తిపై కామెంట్ చేశారు. ఫ్యాన్స్ అనే పదం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నా పేరుతో కొన్ని సోషల్‌మీడియా పేజీలు, సంఘాలు ఉన్నా.. వారు నన్ను కలిసినప్పుడు మంచిగానే మాట్లాడుతాను. నిజాయితీగా ఉన్నవారితో టచ్‌లో కూడా ఉంటాను.
నాపై కొందరు చాలా కష్టపడి రీల్స్ చేస్తారు.. వాటిని నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాపేరు చెప్పుకుని తెరపైకి వచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతని మాటలను నేను ఏకీభవించను. అతను ఎలా వచ్చారో నాకు తెలియదు. ఈ చర్చలో పాల్గొన్న వారు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్లు ఎప్పుడూ కూడా నన్ను కలవలేదు. నా పేరు ఉపయోగించుకుని వారు బతుకుతున్నారు.' అంటూ అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ డిబేట్స్‌లలో పాల్గొంటున్న వ్యక్తిపై ఆమె కామెంట్ చేశారు.


