56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ఇఫి మూడో రోజు పణజీలోని ఐనాక్స్ వేదిక భారతీయ సాంప్రదాయ కళలతో కళకళలాడింది.
తెరపై చూపించే కథలకు ధీటుగా బయట నడిచిన ఈవెంట్లు భారతదేశపు బహురూపాల సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించింది.
దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, ముఖ్యంగా సీబీసీ ప్రత్యేక పీఆర్టీలు, తమ జానపద నృత్యాలు, నాట్యరూపాలు, కథా ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
తరతరాలుగా సంక్రమించిన సంప్రదాయాలను, భారతీయ సంస్కృతి యొక్క హృదయ స్పందనను ఈ కార్యక్రమం అద్భుతంగా ప్రతిబింబించింది.
సినిమా ప్రేమికులను భారతీయ భూభాగం మొత్తం వెంబడి ఉన్న కళాసంపదతో అనుసంధానించే పనిని ఈ ప్రదర్శనలు సమర్ధవంతంగా నిర్వర్తించాయి.


