విజయవాడ : కళకు ఎల్లలు లేవని ఆ నృత్య ప్రదర్శనలు రుజువు చేశాయి. విభిన్న సంస్కృతుల మేళవింపుగా ఆయా జాతుల జీవన విధానాల్ని కళ్లకు కట్టాయి. ప్రాంతాలు, భాషలు వేరైనా జాతీయ సమైక్యతను చాటాయి.
శనివారం రాత్రి విజయవాడలో నిర్వహించిన జానపద కళా ప్రదర్శనలు నయన మనోహరంగా సాగాయి. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్యర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు ఆద్యంతం ప్రేక్షకుల మదిని దోచాయి.


