breaking news
IFFI 2025
-
వంద జన్మలైనా నటుడిగానే పుట్టాలనుకుంటున్నాను: రజనీకాంత్
‘‘సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనందరం ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కథలను సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ రోజు ఈ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో ఈ ఫెస్టివల్ ముగినట్లు కాదు... సృజనాత్మక ఆలోచనలు, ప్రపంచవ్యాప్త సినీ కళాకారుల సమ్మేళనానికి ఓ నిదర్శనం. ఇఫీలోని మరో కొత్త అధ్యాయానికి మరో ముందడుగు’’ అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. గోవా వేదికగా ఈ నెల 20న మొదలైన ‘ఇఫీ’ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు శుక్రవారం (నవంబరు 28)తో ముగిశాయి. సినీ పరిశ్రమలో నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు రజనీకాంత్‌ని ఈ వేడుక చివరి రోజున గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సత్కరించారు.ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సత్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ‘ఇఫీ’ వేడుకలను నిర్వహిస్తున్న గోవా ప్రభుత్వానికి శుభాకాంక్షలు. సినిమాల్లో నాకు యాభై సంత్సరాలు పూర్తయ్యాయి. కానీ నాకు మాత్రం పదో–పదిహేనో సంవత్సరాలు పూర్తయినట్లుగా ఉంది. నటనను, సినిమాను ప్రేమిస్తున్నందువల్లే ఇలా అనిపిస్తోంది. నాకు వంద జన్మలున్నా నేను ప్రతి జన్మలోనూ నటుడిగానే, రజనీకాంత్‌గానే పుట్టాలనుకుంటాను. దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, టెక్నిషియన్స్... ఇలా ఇండస్ట్రీతో పాటుగా నా జర్నీలో కూడా భాగమైన వారందరికీ నా ఈ 50 ఏళ్ల సత్కారం దక్కుతుంది’’ అని రజనీకాంత్ అన్నారు. భారత సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్. మురుగన్ మాట్లాడుతూ – ‘‘ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజ్‌కి తీసుకెళ్లడమే ‘ఇఫీ’ లక్ష్యం. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీగారి నేతృత్వంలో ఈ ఏడాది మేలో తొలిసారిగా ‘వేవ్స్ – 2025’ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్ మెంట్ సమ్మిట్) జరిగింది. ఇఫీలో ‘వేవ్స్ బజార్ –2025’ను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది రూ. 1000 కోట్ల బిజినెస్ జరిగిందని గర్వంగా చెప్పగలను. నరేంద్ర మోదీగారు మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తారు. ఈ ఏడాది ‘ఇఫీ’లో మహిళా దర్శకులు తీసిన యాభై సినిమాలు ప్రదర్శితమయ్యాయి’’ అని చెప్పారు. ఈ చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌కి అందించే ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డును వియత్నాం ఫిల్మ్ మేకర్ యాష్ మేఫెయిర్ డైరెక్ట్ చేసిన ‘స్కిన్ ఆఫ్ యూత్’ దక్కించుకుంది. ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు విభాగంలో కరణ్ సింగ్ త్యాగి (‘కేసరి చాప్టర్ 2’)కి దక్కింది. ఇక ‘ఇఫీ’ వేడుక చివరి రోజున ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ఇండియన్ పనోరమా విభాగం) స్క్రీనింగ్ అయింది. ఇందులో భాగంగా చిత్రనిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఇంకా రణ్వీర్ సింగ్, రిషబ్ శెట్టి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
నా కెరీర్లో శివ ప్రత్యేకం: నాగార్జున
‘‘నా కెరీర్లో ‘శివ’ సినిమా చాలా ప్రత్యేకం. అలాగే ‘గీతాంజలి’ చిత్రం కూడా. ‘శివ’ లాంటి సినిమా మళ్లీ ఇప్పుడు వస్తుందా? అంటే చెప్పలేను. అప్పట్లో జరిగిపోయిందంతే’’ అని హీరో నాగార్జున చెప్పారు. గోవా వేదికగా జరుగుతున్న 56వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున హీరోగా నటించిన ‘శివ, గీతాంజలి’ సినిమాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో స్పెషల్ స్క్రీనింగ్ అయ్యాయి. ‘ప్రిజర్వింగ్ ది క్లాసిక్స్: ది జర్నీ ఆఫ్ శివ’ కార్యక్రమంలో భాగంగా నాగార్జున గోవా వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ –‘‘శివ’ 36 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటి సినిమాలానే ఉంటుంది.కేవలం యాక్టింగ్ పరంగానే కాదు.. సౌండ్ డిజైన్ , కెమెరా వర్క్, లైటింగ్ ఫ్యాట్రన్ , డైరెక్షన్ బ్రిలియన్సీ... ఇలాంటి అంశాలు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి. ఇలా టెక్నికల్ పరంగానూ ఈ సినిమా ఇప్పటికీ రిలవెంట్‌గానే ఉంటుంది. ఇది నా ప్రామిస్. ‘శివ 4కె’ వెర్షన్ స్క్రీనింగ్ కోసం వచ్చిన మీ అందరికీ (వీక్షకులను ఉద్దేశిస్తూ...) ధన్యవాదాలు’’ అన్నారు. దివంగత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వైకుంఠ్ బాబ్ శత జయంతి వేడుకలు ‘ఇఫీ’లో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పేరిట ఓపోస్టల్ స్టాంప్‌ని విడుదల చేశారు. -
తరగని ఉత్తేజం తారా లోక విహారం
గోవాలోని పంజిమ్‌లో 56వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నెల 20న ఆరంభమైన ఈ చిత్రోత్సవం మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈ ఉత్సవంలో 81 దేశాల నుంచి 240కి పైగా సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. వీటిలో 13 ప్రపంచ ప్రీమియర్లు, అనేక అంతర్జాతీయ ఆసియా ప్రీమియర్లు ఉన్నాయి. ఈ చిత్రోత్సవానికి జపాన్ కంట్రీ ఆఫ్ ఫోకస్‌గా, స్పెయిన్ ‘భాగస్వామి దేశం’గా ఆస్ట్రేలియా ‘స్పాట్లైట్ దేశం’గా వ్యవహరిస్తున్నాయి.తెలుగు చిత్రాల సందడి... పలు టాలీవుడ్ చిత్రాలకు ఈ చిత్రోత్సవంలో చోటు దక్కింది. నేడు (26వ తేదీ బుధవారం) ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను, 28న ‘సంక్రాంతికి వస్తున్నాం’ను ప్రదర్శించనున్నారు. ప్రారంభ చిత్రాల్లో ఒకటిగా తమిళ చిత్రం ‘అమరన్’ చోటు దక్కించుకోగా, మరికొన్ని తమిళ, మలయాళ చిత్రాలను కూడా ప్రదర్శించారు. పనోరమా విభాగంలో 25 చలన చిత్రాలు, 20 నాన్–ఫీచర్ చిత్రాలు ఉన్నాయి.సినిమా... అంతకు మించి... ఈసారి చిత్రోత్సవంలో సినిమాల ప్రదర్శనతో పాటు మరెన్నో వైవిధ్యభరిత, ఆసక్తికరమైన కార్యక్రమాలకు చోటు కల్పించారు. కొత్త తరాన్నిప్రోత్సహించడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడం వంటి లక్ష్యాలతో వీటిని నిర్వహిస్తున్నారు. క్రియేటివిటీకి క్లాప్... చిత్రోత్సవాల్లో సినిమాల ప్రదర్శనతో పాటు నూతన తరాన్నిప్రోత్సహించడమే లక్ష్యంగా ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో‘ (సీఎమ్ఓటి) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 128 మంది యువతీ యువకులు 48 గంటల చిత్ర నిర్మాణ ΄ోటీలో పాల్గొన్నారు. వీరిని 5 విభాగాలుగా విభజించి ΄ోటీ నిర్వహించారు. దీనిలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఎంపిక అవడం విశేషం. మాస్టర్ క్లాస్... సూపర్ హిట్... చిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మాస్టర్ క్లాస్‌లు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. బాలీవుడ్ సినీ ప్రముఖుడు విధు వినోద్ చోప్రా నిర్వహించిన మాస్టర్ క్లాస్ ఆకట్టుకుంది. అందులో ఆయన పంచుకున్న జీవితానుభవాలు యువతను మేల్కొలిపేలా ఉన్నాయి. అలాగే చిత్రోత్సవాల్లో దాదాపు పూర్తి స్థాయిలో కనిపించిన మరో సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సమర్పించిన మాస్టర్ క్లాస్ సినీరంగంలో రాణించాల్సిన వారికి ఉండాల్సిన ఓర్పు పట్టుదల అవసరాన్ని నొక్కి చెప్పింది. సెషన్స్... లెసన్స్... ‘ఇన్ –కన్వర్జేషన్ ’ పేరిట కీలకమైన అంశాలపై సాగుతున్న పలు చర్చలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సుహాసిని, ఖుష్బూ నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అలాగే సినిమా రంగంలో మహిళల అంశంపై దేశ విదేశీ ప్రముఖులు సాగించిన చర్చ కూడా ఆలోచనలు రేకెత్తించేలా ఉండి, ఆకట్టుకుంది. ఏఐ ఫెస్ట్... రేపటికి మస్ట్... ఇఫీలో తొలిసారిగా ‘సినిమాఏఐ హ్యాకథాన్’ పేరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సినిమాటిక్ సృజనాత్మకథ కలయికలో హ్యాకథాన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన ఫిల్మ్‌లు ప్రదర్శిస్తున్నారు. ఇఫీస్టా... మరోవైపు ప్రధాన ఉత్సవానికి సమాంతరంగా ‘ఇఫెస్టా’ సాంస్కృతిక సంబరం ఏర్పాటైంది. ఇది సంగీతాభిమానులను తనివి తీరా ఆనందింపజేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, జానపద నృత్యాలు.. వంటివి ఉంటున్నాయి. ‘బాటిల్ ఆఫ్ బాండ్స్’ (భారతీయ, అంతర్జాతీయ బ్యాండ్స్) మరో ఆకట్టుకునే కార్యక్రమం. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన కళాబృందాల్లో మన తెలంగాణ నుంచి గుస్సాడీ నృత్య కళాకారుల బృందం కూడా ఒకటి. అలలోత్సవం... వేవ్స్ బజార్... మారియట్ హోటల్ వేదికగా నిర్వహిస్తోన్న వేవ్స్ బజార్ పెద్ద సంఖ్యలో ఆహుతుల్ని ఆకర్షిస్తోంది. ఈప్రాంగణంలో రోజూ పదుల సంఖ్యలో సినిమాల ప్రదర్శనతో పాటు స్టార్టప్స్ వేదికలు, సాంకేతిక పరికరాల ప్రదర్శనలు... ఇంకా మరెన్నింటికో చోటు కల్పించారు. ఎన్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ఈవెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫిల్మ్ + టెక్‌ను కలిపే ఉద్దేశంతో స్టార్ట్–అప్ – ఇన్నోవేషన్‌ను కలుపుతూ వేవ్ ఎక్స్ అనే జోన్ కూడా ఏర్పాటు చేశారు. సెలబ్రిటీకి రైట్ రైట్... రెడ్ కార్పెట్.. సినిమాల ప్రదర్శన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై సినీ సెలబ్రిటీలు వాక్ చేస్తున్నారు. ఆ సందర్భంగా వీరు సందర్శకులు, మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో అతిర«థ మహారధుల వంటి సినిమా ప్రముఖులు కనపడుతుండడంతో ఔత్సాహిక రూపకర్తలకు అభిమానులకు అవధుల్లేని ఆనందం కలుగుతోంది. ప్రత్యేక ఆకర్షణలు...ఇఫీలో ఆహుతులను ఆకట్టుకుంటున్న అనేక ప్రదర్శనల్లో కొన్ని మరింత విశేషంగా అనిపిస్తున్నాయి. వాటిలో.. ∙‘షోలే’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో వినియోగించిన బైక్‌ను ఈ ఈవెంట్లో ప్రదర్శిస్తున్నారు. దాంతో ఆహుతులు ఆ బైక్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ∙కళా అకాడమీలో ఏర్పాటైన కెమెరా ప్రదర్శన ఔరా అనిపిస్తోంది. అక్కడ వందల సంఖ్యలో కొలువుదీరిన అనేక కెమెరాల్లో శతాధిక వయస్సు ఉన్నవి కూడా ఉండడం విశేషం. పలు కెమెరాలు మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. మహారాష్ట్రకు చెందిన సర్వేష్ అనే కెమెరాల సేకర్త ఈ ప్రదర్శనను సమర్పిస్తున్నారు. ఆహుతులు పెద్ద సంఖ్యలో ఈ కెమెరాలను తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు. ⇒ప్రాంగణంలో నెలకొల్పిన అనేక స్టాల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాంకేతిక ప్రగతికి చిహ్నంగా కనిపించే అనేక విశేషాలను ఈ స్టాల్ ప్రదర్శిస్తోంది. పైగా యువతను ఆకట్టుకునేలా అప్పటికప్పుడు గెలు΄ోటముల్ని తేల్చేసే టెక్ గేమ్స్ నిర్వహిస్తుండడంతో యువత పెద్ద సంఖ్యలో గుమి కూడుతోంది. పంజిమ్‌లోని పీబీబి సెంటర్, ఐనాక్స్ థియేటర్ప్రాంగణం, కళా అకాడమీ, మారియట్ హోటల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియం... తదితర ప్రదేశాల్లో ఇఫీ విస్తరించింది. ఈ దఫా ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్స్‌కు కూడా చోటు కల్పించడం మరో విశేషం. వందల సంఖ్యలో ఈవెంట్లు ఆకర్షణలు, విశేషాలతో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది ఆహుతులను ఆకర్షిస్తోంది. మరో 2 రోజుల్లో ముగియనున్న ఇఫీ... మరో ఏటా తన కోసం వేచి చూసేవారి సంఖ్యని ఈ ఏడాది కార్యక్రమాలతో మరింతగా పెంచుకోనున్నదని చెప్పవచ్చు. – సత్యబాబుదక్షిణ కొరియా ఎంపీ జేవాన్ కిమ్ మన వందే మాతరంను అత్యంత శ్రావ్యంగా గానం చేయడం గోవాలో జరిగిన వేవ్స్ ఫిల్మ్ బజార్ప్రారంభ వేడుకలో హర్ష ధ్వానాలు అందుకుంది. ఒక విదేశీయురాలు ఇంత అందంగా పాడగలగడం చూడటం గొప్ప విషయం అని పలువురు అతిథులు అభినందనలు కురిపించారు.భానుమతి శత జయంతుత్సవాలు... ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా దిగ్గజాలు గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్ భూపేన్ హజారికా, సలీల్ చౌదరిలతో పాటు మన తెలుగు సినీరంగానికి చెందిన దివంగత నటి స్వర్గీయ పి. భానుమతి శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఆమె నటించిన సూపర్ హిట్ సినిమా ‘మల్లీశ్వరి’ని చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఇదే ఫెస్టివల్లో భాగంగా గత ఏడాది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకుప్రారంభ వేడుకలో టాలీవుడ్ నటుడు బాలకృష్ణను సన్మానించారు. ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను సన్మానించనున్నారు అలాగే ఆయన సినిమాలు లల్ సలామ్, జైలర్’ లను చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తున్నారు. -
'ఇఫీ'లో ముగిసిన 48 గంటల ఛాలెంజ్
గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (ఇఫీ) ఘనంగా జరుగుతున్నాయి... సినీ ప్రతిభ, యువ దర్శకుల ఉత్సాహం, ప్రేరణాత్మక మాస్టర్క్లాస్లతో గోవా కళకళలాడుతోంది. ఫెస్టివల్లో అత్యంత ఆసక్తికరమైన విభాగమైన క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటి) 48 గంటల ఛాలెంజ్ ముగింపుతో 4వ రోజు ఉద్వేగభరితంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిద్ర మర్చిపోయి పనిచేసిన యువ చిత్రకారులు తమ తుది చిత్రాలను ప్రదర్శించిన వేళ, వారి ముఖాల్లో అలసట, ఉపశమనం, సంతోషం కలగలిపి కనిపించాయి.పి ఐ బి మీడియా సెంటర్ ఫెస్టివల్ ప్రధాన కేంద్రం గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దర్శకులు, నటీ నటులు తమ చిత్రాలపై ప్రేక్షకులతో, మీడియాతో ఆసక్తికరమైన చర్చలు జరిపారు.డే తాల్ పాలో చిత్ర దర్శకులు ఇవాన్ డారియెల్ ఓర్టిజ్ లాండ్రోన్, జోస్ ఫెలిక్స్ గోమెజ్ తమ కథన నిర్మాణం గురించి వివరించారు.న్యూజిలాండ్ చిత్రమైన పైక్ రివర్ భావోద్వేగ కథను ఎలా తెరపైకి తెచ్చారో రాబర్ట్ సార్కీస్ తెలిపారు.ఆసియా చిత్రాలకు ప్రత్యేక స్థానం కల్పించిన సీసైడ్ సేరెండిపిటీ(టోమోమీ యోషిమురా), టైగర్ (అన్షుల్ చౌహాన్, కోసే కుడో, మినా మోటెకీ) బృందాలు తమ సృజనాత్మక అనుభవాలు పంచుకున్నాయి.ప్రముఖ నేచర్ ఫిల్మ్ మేకర్ సందేశ్ కదూర్ (నీల్గిరీస్: ఏ షేర్డ్ వైల్డర్నెస్) మరాఠీ దర్శకుడు పర్ష్ మోకాషి (ముక్కమ్ పోస్ట్ బొంబిళ్వాది), అస్సాం దర్శకుడు దేబంగ్కర్ (బోర్గొహైన్ – సికార్) తమ సినిమాల ప్రత్యేకతలను, తాము తీసుకున్న సాహసోపేత కథల ఎంపికల నేపధ్యాలను వివరించారు.కళా వైవిధ్యానికి ప్రతీకలైన అంతర్జాతీయ దర్శకులు క్రిస్టినా థెరిసా టౌర్నాట్జెస్ (కర్ల), హయాకావా చీ (రినోర్) ఒకే వేదికపై తమ కళా ప్రయాణం, సృజనాత్మక ప్రక్రియపై ప్రేక్షకులతో సంభాషించారు.ప్రత్యేక ఆకర్షణగా అనుపమ్ ఖేర్ మాస్టర్క్లాస్నాలుగో రోజు ప్రధాన హైలైట్‌గా నిలిచింది “గివింగ్ అప్ ఈజ్ నాట్ ఏ ఛాయిస్ ” మాస్టర్‌క్లాస్.కళా అకాడమీ వేదికగా నటుడు, ప్రసంగకుడు అనుపమ్ ఖేర్ ఇచ్చిన ప్రేరణాత్మక ఉపన్యాసం ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. సినీ ప్రయాణాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, ఓటముల్ని ఎలా జయించాలి, సృజనాత్మకతకు పట్టుదల ఎందుకు అవసరం వంటి అంశాలపై ఆయన ప్రసంగం అందరికీ ఉత్తేజాన్నిచ్చింది.సీఎంఓటి 48 గంటల ఛాలెంజ్ ముగింపుఇఫిలో 48 గంటల క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటి) ఛాలెంజ్ ముగింపు వేడుక కళా అకాడమీలో జరిగింది. కొద్ది గంటల్లోనే కథలు, స్క్రిప్ట్‌లు, షూటింగ్, ఎడిటింగ్ పూర్తి చేసిన యువ దర్శకుల ప్రతిభను జ్యూరీ ప్రశంసించింది. ఫెస్టివల్లో ఈ విభాగం యువతకు తెరపైకి వచ్చే అవకాశం కల్పించే ప్రధాన వేదికగా కొనసాగుతోంది. 5వరోజైన సోమవారం దీని ఫలితాలు వెల్లడి కానున్నాయి. View this post on Instagram A post shared by IFFI (@iffigoa) -
IFFI 2025 : తారల సందడి,జానపదాలతో కూడి..చిందేసిన చిత్రోత్సవం (ఫొటోలు)
-
వయసు+మనసు=నా సినిమాలన్న దర్శక దిగ్గజం.. ఇఫీ ఉత్సవాల్లో విశేషాలెన్నో..
తన వయసు, మనసులో వచ్చిన వస్తున్న మార్పులకు అనుగుణంగా తన సినిమాలు రూపుదిద్దుకున్నాయి అన్నారు బాలీవుడ్ దర్శక దిగ్గజం విదు వినోద్ చోప్రా. 56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ఇఫిలో మూడో రోజు ఓ సెషన్ సందర్బంగా అయన అహుతులతో పలు అనుభవాలు పంచుకున్నారు. పరిందా సినిమా తీసినప్పుడు , 1942 ఏ లవ్ స్టోరీ సమయంలో, ఇటీవల 12th ఫెయిల్.. తదితర సినిమాలను తన వయసు భావోద్వేగాలు ఎలా ప్రభావితం చేశాయో అయన వెల్లడించారు. 56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ఇఫి మూడో రోజు పణజీలోని ఐనాక్స్ వేదిక భారతీయ సాంప్రదాయ కళలతో కళకళలాడింది. తెరపై చూపించే కథలకు ధీటుగా బయట నడిచిన ఈవెంట్లు భారతదేశపు బహురూపాల సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, ముఖ్యంగా సీబీసీ ప్రత్యేక పీఆర్టీలు, తమ జానపద నృత్యాలు, నాట్యరూపాలు, కథా ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. తరతరాలుగా సంక్రమించిన సంప్రదాయాలను, భారతీయ సంస్కృతి యొక్క హృదయ స్పందనను ఈ కార్యక్రమం అద్భుతంగా ప్రతిబింబించింది. సినిమా ప్రేమికులను భారతీయ భూభాగం మొత్తం వెంబడి ఉన్న కళాసంపదతో అనుసంధానించే పనిని ఈ ప్రదర్శనలు సమర్ధవంతంగా నిర్వర్తించాయి.ఇఫీలో జరిగిన మాస్టర్‌క్లాస్‌ల శ్రేణి లో బాలీవుడ్ సీనియర్ దర్శకుడు విధు వినోద్ చోప్రా, రచయిత అభిజాత్ జోషి జంట, బెర్లినాలే ఫెస్టివల్ డైరెక్టర్ మిస్ ట్రిషియా టట్ల్, ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్ల మధ్య సంభాషణ, థియేటర్ గురువు వినాయకుమార్ తదితరులు నిర్వహించిన సెషన్లు—సృజనాత్మకత, భావోద్వేగ ప్రదర్శన, సినిమా భవిష్యత్తుపై కొత్త సాంకేతికతల ప్రభావం వంటి కీలక అంశాలను లోతుగా చర్చించాయి. ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు కథన నిర్మాణం, ఫెస్టివల్ కూర్పు మీద ఎలా ప్రభావం చూపుతున్నాయో కూడా పాల్గొన్నవారికి సమగ్రంగా వివరించడం జరిగింది.ఇఫీ అంతర్జాతీయ గాలా ప్రీమియర్ల విభాగంలో ప్రపంచ సినిమా వైభవాన్ని ప్రేక్షకుల ముందుంచింది. మన తెలుగు పాత చిత్రం మల్లీశ్వరి, ఇటాలియన్–స్విస్ చిత్రం మస్కిటోస్, ఇంగ్లీష్ క్లాసిక్ మూరియల్స్ వెడ్డింగ్, ఫ్రెంచ్ చిత్రం రినోర్, వంటి పలు చిత్రాలు ప్రదర్శించారు సమకాలీన కథనాలు కళాత్మక విలువల సమ్మిళితంగా ఈ చిత్రాలు సినీ ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగించాయి.ప్రముఖ ప్రచురణ విభాగపు (డిపిడి) తాజా పుస్తకం ‘లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్’ను పి ఐ బి ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధాన డైరెక్టర్ జనరల్ భూపేంద్ర కైంతోలా, కొంకణి చిత్ర దర్శకుడు రాజేంద్ర తలాక్‌తో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంలో కైంతోలా మాట్లాడుతూ, “భారతీయ సినిమా అత్యున్నత గౌరవం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మహనీయుల ప్రయాణాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. 1969 నుంచి 1991 మధ్య అవార్డు పొందిన దేవికా రాణి, సత్యజిత్ రే, వి. శాంతారం, లతా మంగేష్కర్ తదితర 23 మంది లెజెండ్స్ గురించి ఈ పుస్తకంలో వివరాలు ఉన్నాయి” అని అన్నారు.ఈ గ్రంథంలో 17 మంది రచయితలు రాసిన 23 వ్యాసాలు ఉండగా, సంకలనం సంజిత్ నార్వేకర్ చేశారు. ముఖ్యంగా, రెండు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు—మిథున్ చక్రవర్తి, ఆశా పారేఖ్—ఈ పుస్తకానికి ప్రత్యేక ముందుమాటలు అందించారని ఆయన వివరించారు. పుస్తకం పట్ల ఆసక్తిని పెంచేందుకు వారి ముందుమాటల నుంచి కొన్ని భాగాలను కూడా చదివి వినిపించారు.సినిమా, శిక్షణ, సంస్కృతి, కళ అన్నీ కలిసి ఇఫ్ఫీ 2025ను విభిన్నతతో కూడిన అపురూపమైన చిత్రోత్సవంగా ఇఫీ కొనసాగుతోంది. -
ఇఫీలో అమరన్ సినిమా
గోవాలో జరుగుతున్న 56 ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవ (IFFI–2025) వేడుకల్లో అమరన్ చిత్రం (Amaran Movie) ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్ హీరో కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, టెర్మరిక్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్ చిత్ర యూనిట్‌కు గౌరవ మైలురాయి అయింది.ఇఫీలో అమరన్భారతీయ సినిమాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రశంసలు పొందిన చిత్రాలే ఇండియన్ పనోరమ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికవుతాయి. అలా ఎంపికైన అమరన్ చిత్ర ప్రదర్శన శనివారం నాడు ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలో ప్రదర్శించారు. కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి, శివకార్తికేయన్, సాయిపల్లవి వేడుకలో పాల్గొన్నారు.మేజర్ ముకుంద్ జీవితకథఅశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం అమరన్. దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. మేజర్ ముకుంద్ దేశభక్తిని ,అత్యున్నత సేవలను ప్రదర్శించిన చిత్రం అమరన్. ఇందులో భారత సైనికుల వీరత్వాన్ని, ఘనతను ఆవిష్కరించారు. అలాంటి చిత్రం ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆ చిత్ర యూనిట్ ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా అమరన్ చిత్రం అంతర్జాతీయ గోల్డెన్ పికాక్ చిత్రోత్సవాల్లో నామినేషన్‌కు పంపడం గమనార్హం.చదవండి: ఒక్కరోజే ఇన్ని సినిమాలా? -
అదృష్టం కాదు... అంకితభావం ఉండాలి
గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఓ వర్క్ షాప్ సందేశాత్మక సంభాషణకు వేదికైంది. ప్రముఖ తారలు సుహాసిని–ఖుష్బూ ఈ వర్క్‌షాప్‌లో తమ అనుభవాలు, అబీప్రాయాలు, నటనలో మెళకువలను పంచుకున్నారు. తన ప్రశ్నలు తానే వేసుకుని తానే సమాధానాలు చెప్పడం ద్వారా సుహాసిని ఆసక్తిని పెంచగా, ఖుష్బూ తన అనుభవాలను పంచుతూ, హాజరైనవారిని అలరించారు. సంపూర్ణంగా అంకితం కావాలి... నటన అంటే ఏ కేటగిరీ అయినా సంపూర్ణ అంకితభావం తప్పనిసరి అని వీరిద్దరూ స్పష్టం చేశారు. ‘‘పారలల్ సినిమా–కమర్షియల్ సినిమా అని తేడా లేదు. ఏ సినిమా కైనా పని తీరు మాత్రం ఒకటే’’ అని ఖుష్బూ స్పష్టం చేశారు. చిత్రకళ, కెమెరా టెక్నిక్‌లలో శిక్షణ పొందిన సుహాసిని సాంకేతిక అంశాలపై సూచనలు ఇచ్చారు. ‘‘ఐ లైన్స్, టైమింగ్, కెమెరా ఎలా పని చేస్తాయో తెలుసుకోండి. కెమెరాను ఎలా డీల్ చేయాలో నేర్చుకోండి. రియలిజయ్ కూడా ఓ స్థాయి దాటకూడదు’’ అని సూచనలు చేశారు. నటీనటులు సంభాషణలను ఎప్పుడూ తమ స్వభాషలో నేర్చుకోవాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఇద్దరూ తమ తరానికి చెందిన క్రమశిక్షణను నేటి యువతకు చెప్పారు. ‘‘15 నిమిషాల్లో మేకప్ పూర్తి చేయడం, సమయాన్ని గౌరవించడం వంటి విషయాల్లో బాధ్యతగా ఉండాలి’’ అని ఖుష్బూ తెలిపారు.సుహాసిని తనకు ఎదురైన తొలి వైఫల్యం గురించి చెప్పిన విషయం ప్రేక్షకుల నుంచి చప్పట్లను అందుకుంది. ‘‘నా తొలి తెలుగు సినిమా (కొత్త జీవితాలు) సూపర్ ఫ్లాప్. కానీ 100 తెలుగు సినిమాలు చేశాను. అదృష్టాన్ని కాదు... నిరంతర కృషినే నమ్మాలి... విజయానికి మూలం అదే అన్నారు. ‘‘యాక్షన్–కట్ మధ్యలోనే జననం–మరణం అన్నట్టు ఉంటుంది’’ అన్నారు సుహాసిని. ‘మీలోని చిన్నప్పటి నటì ఇప్పుడు మీకు ఎదురైతే మీరు ఏం చెప్పాలనుకుంటారు?’ అన్న ప్రేక్షకుల ప్రశ్నకు ‘‘ఇంకా కొంచెం బాగా చేయమని చెబుతాను’’ అని ఖుష్బూ చెప్పగా, ‘‘నేను కొన్ని అర్థం చేసుకోవడంలో నా చిన్నప్పటి స్థితి చూసి సిగ్గుపడతాను. స్వేచ్ఛగా ఉండమని చెబుతాను’’ అన్నారు సుహాసిని. ఇక ఓపాటకు ఖుష్బూ పెదాలు కదపగా, శాస్త్రీయ అభినయంతో సుహాసిని ఆకట్టుకున్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
స్వతంత్ర సినిమాకు ప్రోత్సాహం కరువైంది: ‘ఇఫీ’లో కమల్‌హాసన్
‘‘స్వతంత్ర సినిమా స్వతంత్రంగానే ఉంటుంది. దాన్ని వాణిజ్య సినిమాలతో పోల్చి పరిమితుల్లో పెట్టకండి. స్వతంత్ర సినిమా కూడా స్వతంత్ర భారత్ లాగే స్వేచ్ఛగా ఉంటుంది’’ అని నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్ తెలిపారు. గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) శుక్రవారం కమల్‌హాసన్ పాల్గొన్నారు. ‘ఇండిపెండెంట్ సినిమాలు ఇంకా థియేటర్లలో స్థానం సంపాదించుకోవడానికి పోరాడుతున్నాయి... థియేటర్లలో స్వతంత్ర సినిమాలకు సరైన ప్రదర్శన అవకాశాలు లభించడం లేదు కదా?’ అనే ప్రశ్నకు కమల్‌హాసన్ బదులిస్తూ– ‘‘అవును... ఇది నిజమే. గత 40 ఏళ్లుగా నేను లేవనెత్తుతున్న సమస్య ఇది’’ అని స్పష్టం చేశారు.శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీగా కమల్‌హాసన్ నిర్మించిన ‘అమరన్’ చిత్రం ఈ ఏడాది భారతీయ పనోరమా విభాగంలో ప్రారంభ చిత్రంగా ఎంపిక అయింది. ఈ నేపథ్యంలో చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నేను నిర్మించిన ‘అమరన్ ’ చిత్రం ‘ఇఫీ’లో ప్రదర్శనకు ఎంపిక కావడం, అత్యున్నత పురస్కారం అయిన గోల్డెన్ పీకాక్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘అర్ధంతరంగా ఆగి పోయిన ‘మరుదనాయగమ్’ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించే చాన్స్ ఉందా?’ అనే ప్రశ్నకు కమల్ బదులిస్తూ– ‘‘ప్రస్తుత సాంకేతిక విప్లవ యుగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా ఆ చిత్రం పూర్తి కావచ్చుననే ఆశాభావం ఉంది’’ అన్నారు. మాస్టర్ క్లాసెస్ ప్రారంభం ‘ఇఫీ’లో భాగంగా నిర్వహిస్తున్న మాస్టర్‌క్లాస్ సిరీస్‌ను శుక్రవారం కేంద్ర సమాచార– ప్రసారశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముజఫర్ అలీ మాస్టర్‌క్లాస్ సిరీస్‌లో తొలి సెషన్‌ను నిర్వహించారు. సినీ ప్రముఖులతో క్లాసెస్... ఈ మాస్టర్‌క్లాస్ విభాగంలో ఫ్యానల్ డిస్కషన్లు, వర్క్‌షాపులు, రౌండ్‌టేబుల్ ఇంటరాక్షన్లు, ఇంటర్వ్యూ సెషన్లు, ఫైర్‌సైడ్ చాట్స్ వంటి వర్క్‌షాపులు ఉంటాయి. భారతీయ సినీ ప్రముఖులు విధు వినోద్ చోప్రా, అనుపమ్ ఖేర్, షాద్ అలీ, శేఖర్ కపూర్, రాజ్‌కుమార్ హిరానీ, ఆమిర్ ఖాన్, విశాల్ భరద్వాజ్, సుహాసినీ మణిరత్నం వంటి వారు ఈ ఫెస్టివల్లో వివిధ సెషన్లు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా కృత్రిమ మేథ (ఏఐ) మనుగడ, సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక విభాగాలపై ప్రత్యేక వర్క్‌షాపులను ప్లాన్ చేశారు. రంగస్థల నటనపై ప్రముఖ నిపుణులు అందించే మాస్టర్‌క్లాస్‌లు కూడా జరగనున్నాయి. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
ప్రపంచ సినిమాను గోవాకు తీసుకురావడం మా లక్ష్యం: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
‘‘భారతీయ దర్శకులు, నిర్మాతలు, కథారచయితలు... ఇలా అందరూ ప్రపంచాన్ని కలుసుకునే వేదిక ఇది. గోవాను క్రియేటివ్ క్యాపిటల్‌గా మలిచే దిశగా కృషి చేస్తున్నాం. చిత్ర నిర్మాణ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, గోవా ఫిల్మ్ మేకర్స్‌ను ప్రోత్సహిస్తూనే ప్రపంచ సినిమాను గోవాకు తీసుకురావడం మా లక్ష్యం’’ అని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) గురువారం భారీ పరేడ్ నేపథ్యంలో గోవా గవర్నర్ అశోక గజపతిరాజు ప్రారంభించారు. 2004లో మనోహర్‌పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇఫీలోపాల్గొడానికి గోవా వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అశోక గజపతిరాజు గుర్తుచేసుకున్నారు.50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసిన ఘనతకు గుర్తింపుగా ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘ఇఫీ వేడుకల్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ– ‘‘సనాతన ధర్మం సత్తా చూపించేలా ‘అఖండ 2’ రూ పొందింది. ప్రస్తుతం నటనని గ్రాఫిక్స్ డామినేట్ చేస్తున్నాయి. అయితే నా సినిమాలను గమనిస్తే నేనే వాటిని డామినేట్ చేస్తాను’’ అని పేర్కొన్నారు బాలకృష్ణ. ఔత్సాహిక యువతను ప్రోత్సహించేందుకు మారియట్ హోటల్లో కేంద్ర మంత్రి మురుగన్ ఆరంభించిన ‘వేవ్స్ ఫిల్మ్ బజార్–2025’ ప్రారంభ కార్యక్రమంలో కూడా బాలకృష్ణపాల్గొన్నారు.టాలీవుడ్ సందడి: ‘ఇఫీ’ కార్యక్రమాల్లో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగాపాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు శ్రీలీల, ‘దిల్’ రాజు, సి కల్యాణ్, మాదాల రవి, వీరశంకర్, భరత్ భూషణ్ తదితరులుపాల్గొన్నారు. ‘‘్రపాంతీయ భాష నుంచిపాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ప్రాంతాలకు అతీతంగా ఇంతమందిని ఒక్కటి చేసి ఇండియన్ సినిమాగా మార్చేందుకు ప్రపంచ సినిమాతో పోటీ పడేందుకు ‘ఇఫీ’లాంటి వేదికలు ఉపకరిస్తాయి’’ అన్నారు ‘దిల్’ రాజు, మాదాల రవి. హిందీ పరిశ్రమ నుంచి అనుపమ్ ఖేర్, రాకేష్ ఓంప్రకాశ్ మెహ్రా, శేఖర్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
గ్రాండ్‌గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. హాజరైన సినీతారలు (ఫోటోలు)
-
ఇఫీ లో వేవ్స్ ఫిల్మ్ బజార్ ప్రారంభం...
భారత 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) లో భాగంగా, 19వ ఫిల్మ్ బజార్ గా కొత్త పేరుతో వేవ్స్ ఫిల్మ్ బజార్‌గా ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే ఇఫీ దేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ చలన చిత్రోత్సవం. ఇది ప్రపంచదేశాల దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, కథా రచయితలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.ఆసియాలో అత్యంత ప్రముఖమైన ఫిల్మ్ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వేవ్స్ ఫిల్మ్ బజార్, చిత్రకారులను పెట్టుబడిదారులు, స్టూడియోలు, అంతర్జాతీయ భాగస్వాములు, ఫెస్టివల్ ప్రోగ్రామర్లతో కలుపుతూ ప్రత్యేక పరిశ్రమ వేదికగా సేవలు అందిస్తుంది.ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కొరియా రిపబ్లిక్కు చెందిన జేవోన్ కిమ్, భారత ప్రభుత్వ సమాచార & ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు, దర్శకుడు గార్త్ డేవిస్, నటుడు అనుపమ్ ఖేర్, కేంద్ర సమాచార & ప్రసార శాఖకు చెందిన డా. ఎల్. మురుగన్, అదనపు కార్యదర్శి ప్రభాత్ కుమార్, వేవ్స్ బజార్ సలహాదారు జెరోమ్ పిలోఆర్డ్, నటుడు నందమూరి బాలకృష్ణ, ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్ హాజరయ్యారు.వేవ్స్ బజార్ పేరిట ఈ ఏడాది విస్తరించిన కార్యక్రమాలు, అవకాశాల గురించిసంజయ్ జాజుమాట్లాడుతూ “ఈ సంవత్సరం వేవ్స్ ఫిల్మ్ బజార్ 300కి పైగా చిత్రాలతో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వబోతోంది. తొలిసారిగా యువ ఔత్సాహిక దర్శకులను ప్రోత్సహించేందుకు 20,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతిని కూడా ప్రకటిస్తున్నాం” అని తెలిపారు.డా. ఎల్. మురుగన్ మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి గారు WAVES గురించి పేర్కొన్నట్లుగా, ఉత్పత్తి, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీత రంగాల్లో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. WAVES ఫిల్మ్ బజార్ థియేటర్ల నుండి ప్రపంచ నిర్మాతల వరకు ఉన్న అంతరాన్ని తగ్గించి యువ ప్రతిభలకు వేదికగా నిలుస్తుంది” అన్నారు.ఈ వేడుకలో కొరియన్ అతిథి జేవోన్ కిమ్ “వందే మాతరం” గానం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులు అందరూ లేచి కలిసి పాడిన ఈ ఘట్టం కార్యక్రమానికి ప్రత్యేకమైన ఉత్సాహాన్ని అందించింది.అంతర్జాతీయ పాల్గొనుదల, కొత్త గ్రాంట్ వ్యవస్థలు, బలమైన పరిశ్రమ వేదికలతో వేవ్స్ ఫిల్మ్ బజార్ IFFIని ప్రపంచ సినీ సహకారం మరియు సృజనాత్మక మార్పిడికి కీలక కేంద్రంగా నిలుపుతోంది. -
IFFI 2025: రజనీకాంత్ కి 50ఏళ్లు... భానుమతికి వందేళ్లు....
56వ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది, ఇందులో విభిన్న రకాల సినిమాల ప్రదర్శనతో, సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక అభినందన కార్యక్రమంతో పాటు పలు కొత్త టెక్నాలజీ–ఆధారిత ఈవెంట్లు ఉంటాయి.ముఖ్యాంశాలు👉 గ్లోబల్ ఫిల్మ్ షోకేస్: ఈ ఉత్సవంలో 81 దేశాల నుండి 240 కి పైగా సినిమాలు ప్రదర్శించబడతాయి, వీటిలో 13 ప్రపంచ ప్రీమియర్లు, అనేక అంతర్జాతీయ ఆసియా ప్రీమియర్లు ఉన్నాయి.👉50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను సత్కరిస్తారు, ఇది ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ. ఆయన సినిమా లాల్ సలామ్ ప్రదర్శిస్తారు.👉 జపాన్ ’కేంద్రీకరణ దేశం’గా , స్పెయిన్ ’భాగస్వామి దేశం’గా ఆస్ట్రేలియా ’స్పాట్లైట్ దేశం’గా వ్యవహరిస్తున్నాయి, ఈ దేశాల నుంచి క్యూరేటెడ్ ఫిల్మ్ విభాగాలు ఉంటాయి.👉ఈ ఉత్సవంలో భారతీయ సినిమా దిగ్గజాలు గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్ భూపేన్ హజారికా, సలీల్ చౌదరి లతో పాటు మన తెలుగు సినీరంగానికి చెందిన దివంగత అద్భుత నటి పి. భానుమతి శత జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఇదే ఫెస్టివల్లో భాగంగా గత ఏడాది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే.👉పనోరమా విభాగం భారతీయ సినిమా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది, ఇందులో 25 చలనచిత్రాలు, 20 నాన్–ఫీచర్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినీ ఉత్సతవంలో తమిళ చిత్రం అమరన్ ప్రారంభ చలనచిత్రంగా, కాకోరి ప్రారంభ నాన్–ఫీచర్ చిత్రంగా ఉంటాయి.👉నూతన దర్శకుడి ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ కోసం పోటీలో భారతదేశం విదేశాల నుంచి ఏడుగురు తొలిసారి చిత్ర నిర్మాతలు పాల్గొంటారు, సినిమాలోకి కొత్త వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో‘ (సిఎమ్ఒటి) నిర్వహిస్తున్నారు, దీనిలో భాగంగా 124 మంది యువకులు 48 గంటల చిత్రనిర్మాణ సవాలులో పాల్గొంటారు.👉మాస్టర్ క్లాసెస్ – వర్క్‌షాప్‌లు ప్రధానంగా ఉంటాయి. విధు వినోద్ చోప్రా, ఆమిర్ ఖాన్, అనుపమ్ ఖేర్ , బాబీ డియోల్ వంటి ప్రఖ్యాత సినీ ప్రముఖులు 21 మాస్టర్ క్లాసెస్ , ‘ఇన్–కన్వర్సేషన్‘ సెషన్ లను నిర్వహిస్తారు.👉 ‘సినిమాఏఐ హ్యాకథాన్ పేరిట తొలిసారిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సినిమాటిక్ పృజనాత్మకత కలయికను అన్వేషించే హ్యాకథాన్, ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ విభాగంతో పాటు ప్రారంభిస్తారు.👉‘ఇఫెస్టా‘ పేరుతో సాంస్కృతిక కోలాహలం మరో ఆకర్షణ. ప్రధాన ఉత్సవానికి సమాంతరంగా ’ఇఫెస్టా’ నడుస్తుంది. యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కలిగి ఉన్న ఒక శక్తివంతమైన వినోద జోన్ గా ఇది ఉంటుంది.👉దక్షిణాసియాలో అతిపెద్ద ఫిల్మ్ మార్కెట్ ఫిల్మ్ బజార్:, వేవ్స్ ఫిల్మ్ బజార్ 19వ ఎడిషన్, ఉత్పత్తి, పంపిణీ అమ్మకాల కోసం 300 కంటే ఎక్కువ ఫిల్మ్ ప్రాజెక్ట్‌లతో సృష్టికర్తలు, పరిశ్రమలు. ప్రేక్షకులను కలుపుతుంది. -
IFFI 2025: ఒక్క మహిళ కూడా కనిపించలేదా?.. నెటిజన్స్ ఫైర్
‘ఇఫీ’ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) 56వ ఎడిషన్ ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 దేశాలకు చెందిన 240 చిత్రాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ‘ఇఫీ’(IFFI 2025)లోని ఇండియన్ పనోరమా(Indian Panorama) సెక్షన్ జ్యూరీ చైర్మన్‌గా దర్శక–నిర్మాత–నటుడు రాజ్ బుందేలా నియమితులయ్యారు. తాజాగా ఈ విభాగానికి సంబంధించిన జ్యూరీ సభ్యులను అధికారికంగా ప్రకటించారు. కృష్ణ హెబ్బాళే, కమలేష్ కె. మిశ్రా, మలయ్ రే, సుభాష్ సెహ్గల్, అరుణ్ భక్షి, అసీమ్ సిన్హా, అశోక్ శరణ్, సుకుమార్ జతానియా, బీఎస్ బసవరాజు, అమరేష్ చక్రవర్తి, నెపోలియన్ థంగా, జడుమోని దత్తా జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ ప్యానెల్లో మహిళలకు చోటు దక్కకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ‘జ్యూరీలో మహిళలకు చోటు లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది’, ‘ఉమెన్ జ్యూరీ అంటూ ప్రత్యేకమైన పోస్ట్ ఏమైనా ఉందా?’ (వ్యంగ్యంగా..), ‘మహిళల కోసం మహిళలు నటించిన సినిమాలను ఎంపిక చేసేందుకు అందరూ మహిళలే ఉండేలా ప్రత్యేకమైన జ్యూరీ ఏదైనా ఉందా?’, ‘జ్యూరీలో భాగం చేయడానికి దేశం మొత్తం మీద మీకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా?’ అంటూ... సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. మరోవైపు... లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించడం లేదంటూ కొంకణి దర్శక–రచయిత ఎస్. లక్ష్మీకాంత్ ‘ఇఫీ’ వైఖరిని తప్పుపట్టారు. పలు అవార్డులు, రివార్డులు పొందిన కొంకణి షార్ట్ ఫిల్మ్ ‘ఆన్సెస్సావో’ని ప్రదర్శనకు ఎంపిక చేయకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఇక ఇండియన్ పనోరమా విభాగంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (తెలుగు), ‘అమరన్’ (తమిళం), ‘తుడరుమ్’ (మలయాళం) ‘సు ఫ్రమ్ సో’ (కన్నడ), గ్రౌండ్ జీరో, తన్వి ది గ్రేట్, ఛావా, ది బెంగాలీ ఫైల్స్ (హిందీ)..’ వంటి చిత్రాలతో ΄ాటు పలు భాషలకు చెందిన దాదాపు ముప్పై చిత్రాలు పోటీ పడుతున్నాయి.


