‘‘నా కెరీర్‌లో ‘శివ’ సినిమా చాలా ప్రత్యేకం. అలాగే ‘గీతాంజలి’ చిత్రం కూడా. ‘శివ’ లాంటి సినిమా మళ్లీ ఇప్పుడు వస్తుందా? అంటే చెప్పలేను. అప్పట్లో జరిగిపోయిందంతే’’ అని హీరో నాగార్జున చెప్పారు. గోవా వేదికగా జరుగుతున్న 56వ ఇఫీ (ఇంటర్‌నేషనల్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున హీరోగా నటించిన ‘శివ, గీతాంజలి’ సినిమాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ అయ్యాయి. ‘ప్రిజర్వింగ్ ది క్లాసిక్స్: ది జర్నీ ఆఫ్ శివ’ కార్యక్రమంలో భాగంగా నాగార్జున గోవా వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ –‘‘శివ’ 36 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటి సినిమాలానే ఉంటుంది.
కేవలం యాక్టింగ్ పరంగానే కాదు.. సౌండ్ డిజైన్ , కెమెరా వర్క్, లైటింగ్ ఫ్యాట్రన్ , డైరెక్షన్ బ్రిలియన్సీ... ఇలాంటి అంశాలు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి. ఇలా టెక్నికల్ పరంగానూ ఈ సినిమా ఇప్పటికీ రిలవెంట్‌గానే ఉంటుంది. ఇది నా ప్రామిస్. ‘శివ 4కె’ వెర్షన్ స్క్రీనింగ్ కోసం వచ్చిన మీ అందరికీ (వీక్షకులను ఉద్దేశిస్తూ...) ధన్యవాదాలు’’ అన్నారు. దివంగత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వైకుంఠ్ బాబ్ శత జయంతి వేడుకలు ‘ఇఫీ’లో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పేరిట ఓపోస్టల్ స్టాంప్‌ని విడుదల చేశారు.


