తమిళసినిమా: కొందరికి వయసే తెలియదు 40ల్లోనూ 20ల్లాగానే కనిపిస్తారు. అలాంటి అతి తక్కువ మంది నటిమణుల్లో నయనతార ఒకరు. పాన్ ఇండియా కథానాయకిగా అవతరించిన మాలీవుడ్ బ్యూటీ ఈమె. అయితే నయనతార అదృష్టం మామూలుగా లేదు. కోలీవుడ్లో అడుగు పెట్టడంతోనే శరత్ కుమార్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని పొందారు. ఆ చిత్ర విజయం ఈమెను కథానాయకిగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా చేసింది. ఆ వెంటనే రజినీకాంత్ సరసన చంద్రముఖి, సూర్యతో కలిసి గజిని వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించే అవకాశాలు వరించాయి.
మంచి చిత్రాలు నటించిన నయనతార టాలీవుడ్ ఆహ్వానించింది ఆ తర్వాత మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తున్న నయనతార జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ రంగప్రవేశం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. 41 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతూ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉండడం విశేషం. ఈమె తెలుగులో చిరంజీవి సరసన నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి సందర్భంగా సోమవారం తెరపైకి వచ్చేసింది. కాగా కన్నడంలో యాష్ కథానాయకుడు నటించిన టాక్సిక్ చిత్రంలో నటిస్తున్నారు.
మలయాళంలో పెట్రియడ్, డియర్ స్టూడెంట్ చిత్రాలు నటిస్తున్నారు. ఇక తమిళంలో ఈమె టైటిల్ పాత్రలో నటిస్తున్న మన్నాంగట్టి సీన్స్ 1960, హాయ్, రాక్కాయి , మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా తెలుగులో బాలకృష్ణకు జంటగా ఒక చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా నాలుగు భాషలు నటిస్తూ బిజీగా ఉన్న నయనతార పారితోíÙకం విషయంలోనూ తగ్గేదెలే అంటున్నట్లు సమాచారం. ఈమె కన్నడంలో నడుస్తున్న టాక్సిక్ చిత్రం కోసం రూ.18 కోట్లు డిమాండ్ చేసినట్లు, చివరికి రూ.15 కోట్లకు సమ్మతించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది.


