గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్‌'.. విన్నర్స్‌ ప్రకటన | Golden Globes 2026 Winners Details | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్‌'.. విన్నర్స్‌ ప్రకటన

Jan 12 2026 10:03 AM | Updated on Jan 12 2026 10:26 AM

Golden Globes 2026 Winners Details

ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుక ‘గోల్డెన్‌ గ్లోబ్స్‌ 2026’ ఘనంగా జరిగింది. 83వ గోల్డెన్ గ్లోబ్‌ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్‌' సిరీస్‌ సత్తా చాటింది. ప్రస్థుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ఈ సిరీస్‌కు రెండు అవార్డ్స్‌ దక్కడం విశేషం.  ఉత్తమ నటుడు, సహాయనటుడి విభాగాల్లో అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది.

'అడాల్‌సెన్స్‌' చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్‌ అందుకుని ఆదరణ పొందింది. అయితే, ఈ మూవీలో నటించిన స్టీఫెన్‌ గ్రాహం  ఉత్తమ నటుడిగా తొలిసారి గోల్డెన్‌ గ్లోబ్స్‌ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆపై  సిరీస్‌లో తన నటనతో మెప్పించిన 13 ఏళ్ల ఓవెన్‌ కూపర్‌ ఉత్తమ సహాయనటుడిగా అతి చిన్న వయసులోనే అవార్డ్‌ అందుకున్నాడు. ఈ అవార్డ్‌ కార్యక్రమంలో భారత్‌ నుంచి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు.

సినిమా రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో హాలీవుడ్‌ ఫారిన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ (హెచ్‌. ఎఫ్‌. పి. ఎ) వారు ఈ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నాంది పలికారు. 1944 నుంచి ఈ అవార్డు కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ప్రారంభంలో వారు నిర్వహిస్తున్నారు. హాలీవుడ్‌ సినిమాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను కూడా గుర్తించి వాటికి పురస్కారాలు ఇస్తుంటారు.  ప్రస్తుతం హెచ్‌. ఎఫ్‌. పి. ఎ టీమ్‌లో సుమారు 60 దేశాలకు చెందిన 105 మంది సభ్యులున్నారు. వారందరూ ఓకే అనుకున్న తర్వాతే గోల్డెన్‌ గ్లోబ్స్‌ ఖరారు చేస్తారు.  సినిమా రంగంతో పాటు టెలివిజన్‌ రంగంలో ప్రతిభ చూపిన వారికీ అవార్డులు ఇస్తుండటం విశేషం.

  గోల్డెన్‌ గ్లోబ్స్‌- 2026అవార్డ​్‌ విజేతలు (సినిమా)
 -ఉత్తమ నటుడు : తిమోతీ చలమెట్ (మార్టీ సుప్రీం)
 - ఉత్తమ నటి : రోజీ బేర్నీ (ఇఫ్‌ ఐ హేడ్‌ లెగ్స్‌ ఐడిడ్‌ కిక్‌ యూ)
- ఉత్తమ సహాయ నటుడు: స్టెల్లన్ స్కార్స్‌గార్డ్ (సిన్నర్స్)
- ఉత్తమ సహాయ నటి: టెయానా టేలర్ (ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్)

గోల్డెన్‌ గ్లోబ్స్‌- 2026అవార్డ్‌ విన్నర్స్‌ ( టెలివిజన్ సిరీస్)

- ఉత్తమ టెలివిజన్ సిరీస్ (డ్రామా): ది వైట్ లోటస్
- ఉత్తమ నటుడు : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)
- ఉత్తమ సహాయ నటి : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)
- ఉత్తమ సహాయ నటుడు : స్టీఫెన్‌ గ్రాహం (అడోలెసెన్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement