గోవాలో జరుగుతున్న 56 ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవ (IFFI–2025) వేడుకల్లో అమరన్ చిత్రం (Amaran Movie) ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్ హీరో కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, టెర్మరిక్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్ చిత్ర యూనిట్‌కు గౌరవ మైలురాయి అయింది.
ఇఫీలో అమరన్
భారతీయ సినిమాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రశంసలు పొందిన చిత్రాలే ఇండియన్ పనోరమ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికవుతాయి. అలా ఎంపికైన అమరన్ చిత్ర ప్రదర్శన శనివారం నాడు ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలో ప్రదర్శించారు. కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి, శివకార్తికేయన్, సాయిపల్లవి వేడుకలో పాల్గొన్నారు.
మేజర్ ముకుంద్ జీవితకథ
అశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం అమరన్. దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. మేజర్ ముకుంద్ దేశభక్తిని ,అత్యున్నత సేవలను ప్రదర్శించిన చిత్రం అమరన్. ఇందులో భారత సైనికుల వీరత్వాన్ని, ఘనతను ఆవిష్కరించారు. అలాంటి చిత్రం ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆ చిత్ర యూనిట్ ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా అమరన్ చిత్రం అంతర్జాతీయ గోల్డెన్ పికాక్ చిత్రోత్సవాల్లో నామినేషన్‌కు పంపడం గమనార్హం.
చదవండి: ఒక్కరోజే ఇన్ని సినిమాలా?


