నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా? | May I Touch You: Mohanlal Fulfill his Lady Fan Wish | Sakshi
Sakshi News home page

Mohanlal: ఆయన్ను కలవందే తిరిగి వెళ్లను.. అభిమాని కోసం..

Nov 22 2025 11:52 AM | Updated on Nov 22 2025 12:09 PM

May I Touch You: Mohanlal Fulfill his Lady Fan Wish

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ (Mohanlal) బిజీ యాక్టర్‌. ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటాడు. ఈ ఏడాదైతే ఇప్పటివరకు ఏకంగా నాలుగు సినిమాల్లో కనిపించాడు (ఎల్‌ 2: ఎంపురాన్‌, తుడరుమ్‌, కన్నప్ప, హృదయపూర్వం). ప్రస్తుతం వృషభ, దృశ్యం 3, పేట్రియాట్‌, రామ్‌ వంటి పలు సినిమాలు చేస్తున్నాడు.

హీరో కోసం 80 ఏళ్ల వృద్ధురాలు
దృశ్యం 3 సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కేరళలోని అయిమురిలో ఓ చర్చి దగ్గర ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ విషయం తెలిసి ఓ 80 ఏళ్ల వృద్దురాలు అక్కడికి చేరింది. కొత్తగా కొన్న చీర కట్టుకుని మనవడు శ్యామ్‌ను వెంటేసుకుని లొకేషన్‌లో అడుగుపెట్టింది. కానీ జనం రద్దీ అధికంగా ఉండటంతో లోనికి ఎవరినీ అనుమతించలేదు. అందరూ దూరం నుంచే మోహన్‌లాల్‌ను చూసి సంతోషించారు. అయినా లీలామణి అమ్మకు తృప్తి తీరలేదు.

మహిళా అభిమానిని కలిసిన మోహన్‌లాల్‌

చూశాకే తిరిగెళ్తా!
ఆయన్ను కచ్చితంగా దగ్గరినుంచి చూసి తీరాల్సిందేనని భీష్మించుకుంది. ఆయన్ను కలిసేవరకు తిరిగి వెళ్లే ప్రసక్తేలేదని మొండిగా కూర్చుంది. ఈ విషయం హీరో చెవిన పడింది. సాయంత్రం ఐదు గంటలకు లీలామణి అమ్మను కలిశాడు. తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. ఇంట్లో అందరూ బాగున్నారా? అని యోగక్షేమాలు అడిగాడు. అప్పుడు ఆ ముసలమ్మ నెమ్మదిగా ఓ కోరిక కోరింది. 

ముట్టుకోవాలని కోరిక
నేను మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? అని అడిగింది. అందుకు మోహన్‌లాల్‌ నవ్వుతో అంగీకారం తెలుపుతూ ఆమెను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. హీరో కోసం పాట కూడా పాడాలనుకుంది, కానీ అక్కడ అంత సమయం దొరకలేదని చెప్తోంది. మోహన్‌లాల్‌ సినిమా వస్తుందంటే చాలు టీవీకి అతుక్కుపోతుంది లీలామణి. ఆయన నటించిన వాటిలో ఆరం తంపురన్‌ మూవీ తనకెంతో ఇష్టమని చెప్తోంది. చివరగా తన పిల్లలతో కలిసి తుడరుమ్‌ సినిమా చూశానంది. దృశ్యం 1, 2 సినిమాలను చూశానని, మూడో పార్ట్‌ కోసం ఎదురుచూస్తున్నానంది.

చదవండి: దర్శన్‌ ఎలాంటివాడో మీఅందరికీ తెలుసు..: హీరో భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement