ప్రముఖ కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. హనుమాన్ మూవీతో తెలుగులో మరింత క్రేజ్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో పలు చిత్రాల్లో మెప్పించిన ఈ కోలీవుడ్ బ్యూటీ.. ప్రస్తుతం దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది.
వరలక్ష్మి శరత్‌కుమార్ దర్శకత్వ అరంగేట్రం చేస్తోన్న తాజా చిత్రం 'సరస్వతి'. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ను అధికారికంగా పూర్తి చేశారు. తాజాగా షూటింగ్ పూర్తయిన సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీతోనే వరలక్ష్మి శరత్కుమార్ దర్శకురాలిగా మారనుంది. ఇది కేవలం ఆమెకు అరంగేట్ర సినిమా మాత్రమే కాదు.. వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోంది. తన చెల్లెలు పూజా శరత్‌కుమార్‌తో కలిసి ప్రారంభించిన 'డోసా డైరీస్' బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా.. ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్ నటించడంతో పాటు దర్శక, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, ప్రకాశ్‌రాజ్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీకి తమన్ సంగీతమందిస్తున్నారు.


