తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్ (Aaryan Movie). తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్.కె దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు.
ఓటీటీలో ఆర్యన్
వారం ఆలస్యంగా నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు!
కథేంటంటే?
ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానెల్‌కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్ రచయితనని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నంది (విష్ణు విశాల్)కి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి? అదెలా సాధ్యం? అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్ చూడాల్సిందే!
#Aaryan - thrilling your NETFLIX screens from 28th November!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts @jayachandran46 @itshravanthi @prathool @Netflix_INSouth @SreshthMovies… pic.twitter.com/I2JRhlRKve
— Vishnu Vishal Studioz (@VVStudioz) November 22, 2025
చదవండి: నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా?


