breaking news
Aaryan Movie
-
వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్
మరో వీకెండ్ వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ కాగా.. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు అనగా శుక్రవారం కూడా పలు డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం శుక్రవారం ఒక్కరోజే 20 వరకు మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయి కూడా.స్ట్రేంజర్ థింగ్స్, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి లాంటి సినిమాలు ఇప్పటికే గురువారం స్ట్రీమింగ్‌లోకి రాగా.. శుక్రవారం నాడు మాస్ జాతర, ఆర్యన్, ప్రేమిస్తున్నా, శశివదనే, ఆన్ పావమ్ పొల్లతత్తు తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 28)ఆహాప్రేమిస్తున్నా - తెలుగు సినిమాక్రిస్టినా కథిర్‌వేలన్ - తమిళ మూవీసన్ నెక్స్ట్శశివదనే- తెలుగు సినిమానెట్ఫ్లిక్స్మాస్ జాతర - తెలుగు సినిమాఆర్యన్ - తెలుగు డబ్బింగ్ మూవీలెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ - మాండరిన్ సినిమాస్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 - తెలుగు డబ్బిగ్ సిరీస్ (ప్రస్తుతం స్ట్రీమింగ్)సన్నీసంస్కారి కీ తులసి కుమారి - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)హాట్స్టార్ఆన్ పావమ్ పొల్లతత్తు - తెలుగు డబ్బింగ్ చిత్రంబార్న్ హంగ్రీ - ఇంగ్లీష్ మూవీజీ5ద పెట్ డిటెక్టివ్ - తెలుగు డబ్బింగ్ సినిమారేగాయ్ - తమిళ సిరీస్రక్తబీజ్ - బెంగాలీ మూవీలయన్స్ గేట్ ప్లేప్రీమిటివ్ వార్ - తెలుగు డబ్బింగ్ సినిమారష్ - ఇంగ్లీష్ మూవీబుక్ మై షో40 ఏకర్స్ - ఇంగ్లీష్ సినిమాఎలివేషన్ - ఇంగ్లీష్ మూవీగ్యాబీ డాల్ హౌస్ - ఇంగ్లీష్ సినిమాహాచీ: ఏ డాగ్స్ టేల్ - ఇంగ్లీష్ మూవీవిన్నర్ - ఇంగ్లీష్ సినిమాఅమెజాన్ ప్రైమ్కాంతార 1 - హిందీ డబ్బింగ్ వెర్షన్షీ రైడ్స్ షాట్ గన్ - తెలుగు డబ్బింగ్ సినిమా -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా', కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా', ధనుష్ 'అమర కావ్యం' లాంటి పెద్ద సినిమాలతో పాటు అంధక, ఖైదు, స్కూల్ లైఫ్, మరువ తరమా! లాంటి తెలుగు చిన్న మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. ఉన్నంతలో రామ్ మూవీపై మాత్రమే కాస్తోకూస్తో హైప్ ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ 15 వరకు సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 23 ఏళ్ల ప్రేమ.. గుళ్లో పెళ్లి చేసుకున్న సీరియల్ జంట)ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో ఆర్యన్, శశివదనే చిత్రాలు కొద్దో గొప్పో చూసే లిస్టులో ఉండగా.. ఈ వీకెండ్లో రవితేజ 'మాస్ జాతర' కూడా స్ట్రీమింగ్ కానుందనే టాక్ వినిపిస్తుంది. ఇవి కాకుండా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఐదో సీజన్, జాన్వీ కపూర్ 'సన్నీ సంస్కారీ కీ తులసి' కూడా ఉన్నాయి. కాకపోతే వీటికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 24 నుంచి 30వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 26జింగిల్ బెల్ హైస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 26సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (హిందీ చిత్రం) - నవంబరు 27మాస్ జాతర (తెలుగు మూవీ) - నవంబరు 27 (రూమర్ డేట్)ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 28లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (మాండరిన్ మూవీ) - నవంబరు 28హాట్స్టార్బార్న్ హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28అమెజాన్ ప్రైమ్వుయ్ ఆర్ గ్రీన్ లాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - నవంబరు 24 (రెంట్ విధానం)జీ5రేగాయ్ (తమిళ సిరీస్) - నవంబరు 28ద పెట్ డిటెక్టివ్ (మలయాల సినిమా) - నవంబరు 28రక్తబీజ్ (బెంగాలీ మూవీ) - నవంబరు 28సన్ నెక్స్ట్శశివదనే (తెలుగు సినిమా) - నవంబరు 28ఆపిల్ టీవీ ప్లస్ప్రీ హిస్టారిక్ ప్లానెట్: ఐస్ ఏజ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26వండ్‌లా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26లయన్స్ గేట్ ప్లేప్రీమిటివ్ వార్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ) -
ఓటీటీలో లేటెస్ట్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్ (Aaryan Movie). తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్.కె దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఆర్యన్వారం ఆలస్యంగా నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు!కథేంటంటే?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానెల్‌కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్ రచయితనని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నంది (విష్ణు విశాల్)కి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి? అదెలా సాధ్యం? అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్ చూడాల్సిందే! #Aaryan - thrilling your NETFLIX screens from 28th November!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts @jayachandran46 @itshravanthi @prathool @Netflix_INSouth @SreshthMovies… pic.twitter.com/I2JRhlRKve— Vishnu Vishal Studioz (@VVStudioz) November 22, 2025 చదవండి: నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా? -
'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?
'రాక్షసుడు' అనే తమిళ సినిమాతో మన ప్రేక్షకులకు కాస్త పరిచయమైన యంగ్ హీరో విష్ణు విశాల్. మట్టీ కుస్తీ, అరణ్య లాంటి తెలుగు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో చాలా గ్యాప్ తర్వాత 'రాక్షసుడు' తరహా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌తో వచ్చాడు. అదే 'ఆర్యన్'. తమిళంలో గత వారం రిలీజ్ కాగా.. ఇప్పుడు(నవంబరు 07) తెలుగులోనూ థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ)కథేంటి?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి... ప్రముఖ న్యూస్ ఛానెల్లో నయన(శ్రద్ధా శ్రీనాథ్) హోస్ట్ చేస్తున్న షోకి వస్తాడు. గన్‌తో అందరినీ బెదిరించి భయపెట్టేస్తాడు. తను ఓ ఫెయిల్యూర్ రచయితనని ఓ థ్రిల్లింగ్ కథ చెబుతానని అంటాడు. రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని.. ఎవరో చెప్పి మరీ చంపేస్తానని చెబుతాడు. అలా చెప్పిన కాసేపటికే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కేసుని పైఅధికారులు.. పోలీసాఫీసర్ నంది(విష్ణు విశాల్)కి అప్పజెబుతారు. చెప్పినట్లే ఆత్రేయ చనిపోయినా వరస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఆత్రేయ ఎవరు? వీళ్లనే ఎందుకు చంపుతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. హత్యలు చేసే విలన్ని చివర్లో చూపిస్తారు లేదంటే విలన్ని ఇంటర్వెల్లో బయటపెడతారు. ఇదీ కాదంటే ప్రారంభంలోనే విలన్ ఎవరో రివీల్ చేసేసి దొంగ పోలీస్ గేమ్ తరహాలో స్టోరీని నడిపిస్తాడు. ఇవన్నీ కాకుండా సరికొత్తగా తీయొచ్చా అంటే తీయొచ్చు. అదే విషయాన్ని 'ఆర్యన్' దర్శకుడు నిరూపించి చూపించాడు.న్యూస్ ఛానల్ లైవ్‌లో చనిపోయిన ఓ వ్యక్తి.. తర్వాత ఐదు రోజుల్లో మనుషుల్ని చంపడం అనే డిఫరెంట్ పాయింట్‌తో ఈ సినిమా తీశారు. వినడానికి బాగానే ఉంది గానీ మూవీ ఎలా తీశారా అంటే అదిరిపోయిందనే చెప్పొచ్చు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా అయితే మంచి థ్రిల్లర్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.హీరో ఎవరో తెలుసు. విలన్ ఎవరో తెలుసు. మరోవైపు హత్యలు జరుగుతుంటాయి. పోని చనిపోతున్నవాళ్లు చెడ్డవాళ్లా అంటే కాదు. అందరూ మంచివాళ్లు. సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడేవాళ్లు. అలాంటి వాళ్లని ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాన్ని క్లైమాక్స్ వరకు పట్టుసడలకుండా అద్భుతంగా చూపించారు. 'రాక్షసుడు' అంత కాకపోయినప్పటికీ 'ఆర్యన్' కూడా బాగుంది.కథంతా సీరియస్ టెంపోలో వెళ్తున్న టైంలో హీరో, అతడి భార్యతో విడాకులు, కోర్టు వాదనలు ఈ సీన్స్ అన్నీ అనవసరం అనిపిస్తాయి. అసలు ఈ సన్నివేశాలు సినిమాలో లేకపోయినా సరే స్టోరీలా పెద్దగా పోయేదేం ఉండదు కదా అనిపిస్తుంది. సినిమా అంతా బాగానే ఉంటుంది గానీ క్లైమాక్స్‌లో ఈ హత్యల వెనక కారణం కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది. అదే విషయాన్ని విష్ణు విశాల్ పోషించిన నంది పాత్రతోనూ చెప్పించారు.ఎవరెలా చేశారు?నంది అనే పోలీసాఫీసర్‌గా విష్ణు విశాల్ అదరగొట్టేశాడు. ఫిజిక్, యాక్టింగ్ అన్నీ కూడా నిజంగానే పోలీస్‌ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగించాయి. నయనగా చేసిన శ్రద్ధా శ్రీనాథ్, నంది భార్య అనితగా చేసిన మానస చౌదరివి సైడ్ క్యారెక్టర్స్ లాంటి పాత్రలు. చాలా పరిమితంగా సీన్స్ ఉంటాయి. విలన్ ఆత్రేయగా సెల్వ రాఘవన్ మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే.. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. జిబ్రాన్ ఈ విషయంలో అదరగొట్టేశాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే తెరపై సీన్, వెనక నేపథ్య సంగీతం వింటుంటే టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఆ రేంజ్ సౌండింగ్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ డీసెంట్. డైరెక్టర్ ప్రవీణ్ వావ్ అనిపించాడు. ఓవరాల్‌గా సరికొత్త థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం దీన్ని మిస్ అవ్వొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ‘జటాధర’ మూవీ రివ్యూ)


