హిందీ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. రణ్‌వీర్‌సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శ కత్వం వహించిన సినిమా ‘ధురంధర్’. మాధవన్, సంజయ్‌దత్, అక్షయ్‌ఖన్నా, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ పతాకాలపై ఆదిత్యధర్,లోకేష్ ధర్, జ్యోతిదేశ్‌పాండే నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరు 5న థియేటర్స్‌లో విడుదలైంది.
కాగా ‘ధురంధర్’ సినిమా 33 రోజుల్లో రూ.831.40 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్’ చిత్రం రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి, ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శించబడుతోంది. ఇక ‘ధురంధర్ 2’ చిత్రం మార్చి 19న రిలీజ్ కానుంది.


