Bollywood Industry
-
ఓ ఇంటివాడైన రవిశాస్త్రి.. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధైర్య కర్వా ఓ ఇంటివాడయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన వివాహా వేడుకలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాహ వేడుకలో కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.కాగా.. ధైర్య కర్వా బాలీవుడ్లో దీపికా పదుకొణె నటించిన గెహరియాన్ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. అంతేకాకుండా యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో కెప్టెన్ సర్తాజ్ సింగ్ చందోక్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత స్పోర్ట్స్ డ్రామా 83 లాంటి సినిమాలతో అభిమానులను మెప్పించారు. 1983 ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రంలో రవిశాస్త్రి పాత్రలో ఆకట్టుకున్నారు. గతేడాది గ్యారాహ్ గ్యారాహ్ సినిమాలో నటించారు. పలు సినిమాలతో బాలీవుడ్లో అభిమానులను మెప్పించిన ధైర్య కర్వా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అయితే అతను చేసుకున్న ఆమె గురించి వివరాలేమీ తెలియదు. -
విగ్ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) బయట ఎంత సింపుల్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎక్కువగా తెల్ల పంచె, షర్ట్ ధరించే కనిపిస్తాడు. సినిమా ఈవెంట్స్‌కి కూడా అలానే వెళ్తాడు. అవసరం అయితే తప్ప మేకప్ వేసుకోరు. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు ఎంత మంది ఉన్నారో..ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్లుకూడా అంతే ఉన్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ..రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా(Mukesh Khanna) ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ హీరోలలో ఎంతో మందికంటే రజనీకాంత్ చాలా గొప్పవాడని, రియల్ హీరో అంటే ఆయనేనని పొగడ్తలతో ముంచేశాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు రజనీకాంత్‌ని వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు కూడా మేకప్ వేసుకోరు. కనీసం విగ్గు కూడా ధరించడు. ఫ్యాన్స్‌తో ఓ సామాన్య వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడు.బాలీవుడ్ హీరోల్లో ఎవరూ కూడా రజనీకాంత్‌లా ఉండలేరు. మేకప్ లేకుండా వాళ్లు బయట తిరగలేరు. వాళ్లతో పోలిస్తే రజనీకాంత్ చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన రియల్ హీరో’ అని మేకేష్ చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ గురించి చెబుతూ.. డైలాగులు లేని కారణంగా చాలా పెద్ద సినిమాలు వదులుకున్నానని చెప్పారు. విలన్‌గా చేయడం ఇష్టంలేక సినిమాలను దూరం పెట్టానని చెప్పారు. ‘మహాభారతం’ సీరియల్లో మొదట దుర్యోధనుడి పాత్ర ఇస్తే నో చెప్పానని, ఆ తర్వాత భీష్ముడి పాత్ర వచ్చిందని చెప్పారు. బాలీవుడ్ హీరోలపై ముకేశ్ ఖన్నా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి."రూహీ"(1981) చిత్రంలో ముకేశ్ ఖన్నా తన సినీ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత అతను "వక్త్ కీ దీవార్" (1981), "దర్ద్ కా రిష్తా" (1982) వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాడు. 1980లలో అతను అనేక హిందీ చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించాడు, కానీ అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. 1997లో దూరదర్శన్‌లో ప్రసారమైన "శక్తిమాన్" అనే టెలివిజన్ సీరియల్‌తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్లో అతను శక్తిమాన్ అనే సూపర్‌హీరో పాత్రను పోషించాడు. ఈ పాత్ర అతన్ని ఇంటింటికీ చేర్చింది, ముఖ్యంగా పిల్లల్లో అతను అత్యంత ప్రజాదరణ పొందాడు. "శక్తిమాన్" సీరియల్‌ను అతను స్వయంగా నిర్మించడం విశేషం.‘మహాభారతం’ లో పోషించిన భీష్మ పాత్ర అతన్ని భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపింది. నటనతో పాటు నిర్మాణం మరియు దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చాటిన ముకేష్ ఖన్నా, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. -
సల్మాన్ ఖాన్‌తో సూపర్ హిట్ డైరెక్టర్ మూవీ.. ఆలస్యానికి అదే కారణం!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా నిర్మించారు.అయితే జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సల్మాన్ ఖాన్ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీ ఆలస్యం కావడంపై ఆయన స్పందించారు.ఈ సినిమా బడ్జెట్‌పై అంచనాలు మరోసారి రూపొందిస్తున్నారని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. అదే ఈ సినిమా ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించినా బడ్జెట్ విషయంలో సమస్యలు రావడంతో వాయిదా పడిందని సల్మాన్ పేర్కొన్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరెకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షారూఖ్ ఖాన్ జవాన్ తర్వాత అట్లీ చేస్తున్న రెండో హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1,150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 2023లో విడుదలైన జవాన్ మూవీలో నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సికందర్. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మేకర్స్ సికందర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సల్మాన్ ఖాన్ ఫైట్స్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ యాక్షన్ మూవీలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందించారు. -
ఆయన త్వరగా కోలుకోవాలి.. దయచేసి నన్ను అలా పిలవొద్దు: సైరా భాను
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. గతేడాది చివర్లో తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. దాదాపు 28 ఏళ్ల తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ ఆస్పత్రి పాలయ్యారు. డీ హైడ్రేషన్‌కు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం డిశ్ఛార్డ్ అయ్యారు.తాజాగా ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై ఆయన భార్య సైరా భాను ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నానని తెలిపారు. ఆయనకు ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరినట్లు నాకు తెలిసింది.. ఆ దేవుడి ఆశీర్వాదంతో ప్రస్తుతం బాగానే ఉన్నారని.. ఎవరూ కూడా ఆందోళనకు గురి కావొద్దని అభిమానులను కోరారు. అయితే మేమిద్దరం ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని అన్నారు. కేవలం నా ఆరోగ్య సమస్యల కారణంగానే విడిపోయామని.. గత రెండేళ్లుగా నా పరిస్థితి బాగాలేదని పేర్కొన్నారు. నా వల్ల ఆయనకు అదనపు ఒత్తిడిని గురి చేయవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని.. అందువల్ల తనను మాజీ భార్య అని పిలవవద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేసింది.కాగా.. ఏఆర్ రెహమాన్, సైరా భాను 1995లో వివాహం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. సైరా తరపు లాయర్ వందనా షా ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా.. ఈ జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు.రెహమాన్ సినీ ప్రయాణంఏఆర్ రెహమాన్.. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఎన్నో హిట్ చిత్రాలకు బ్లాక్‌బస్టర్ సంగీతం అందించాడు. తెలుగులో గ్యాంగ్‌మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు పని చేశాడు. ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఛావాకు అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రస్తుతం రామ్‌చరణ్-బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనను ప్రభుత్వం.. పద్మ శ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకుగానూ రెండు ఆస్కార్లు అందుకున్నాడు. -
మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉండగా స్టార్ హృతిక్ రోషన్‌కు సునయన రోషన్ అనే చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను మద్యానికి బానిసైనట్లు వెల్లడించారు. ఆ వ్యసనం నుంచి బయప పడేందుకు చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. రిహబిలిటేషన్ సెంటర్లో నరకం అనుభవించినట్లు సునయన చెప్పుకొచ్చారు. అక్కడ సాధారణ పునరావాస కేంద్రం కంటే అధ్వాన్నంగా ఉంటుందని తాను ఊహించలేదన్నారు. సునయన రోషన్ మాట్లాడుతూ.. 'ఇది మొత్తం 28 రోజుల కోర్సు. అయితే ఇది సాధారణ పునరావాసం లాంటిది కాదు. ప్రాథమికంగా అక్కడ ఎలాంటి వ్యసనానికైనా చికిత్స అందస్తారు. ఆ సెంటర్లో దాదాపు 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అక్కడి వాతావరణం సాధారణ పునరావాసం కంటే చాలా దారుణంగా ఉంది. అసలు నార్మల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నన్ను రోజుకు 9 గంటల పాటు ఓకే గదిలో ఉంచేవారు. అలా ప్రత్యక్షం నరకం అనుభవించా' అని తెలిపింది.అయితే తాను బాగుపడతానని తెలిసే అక్కడికి వెళ్లినట్లు సునయన రోషన్ తెలిపారు. మద్య వ్యసనం నుండి బయటపడేందుకు జీవితంలో ముందుకు సాగడానికి ఒక అడుగుగా భావించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కేవలం నాకు కాల్ చేసే వ్యక్తుల నంబర్లు మాత్రం అమ్మ వారికి ఇచ్చిందని వెల్లడించింది. అక్కడికి సెల్ ఫోన్లు, షుగర్, కాఫీ , చాక్లెట్, పెర్ఫ్యూమ్లు అనుమతించరని ఆమె చెప్పింది. అయితే పునరావాసం నుంచి బయటపడిన క్షణంలోనే తన తండ్రి రాకేష్ రోషన్‌కు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని సునయన రోషన్ వెల్లడించింది. -
'బాలీవుడ్ నుంచి గెంటేయాలని చూశారు'.. గోవిందా సంచలన ఆరోపణలు
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా బాలీవుడ్‌పై విమర్శలు చేశారు. బాలీవుడ్లో తనపై కుట్ర చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. నన్ను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపేందుకు కొందరు ప్రయత్నించారని వెల్లడించారు. తాను పెద్దగా చదువుకోలేదని.. వారంతా చదువుకున్న వారు కావడంతోనే నాతో ఆడుకున్నారని తెలిపారు. కేవలం నా నటన వల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని వెల్లడించారు. నన్ను టార్గెట్ చేసిన వారి పేర్లను వెల్లడించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా.. ముఖేష్ ఖన్నా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా ఈ వ్యాఖ్యలు చేశారు.పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన గోవిందా ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన చివరిసారిగా 2019 విడుదలైన రంగీలా రాజాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. నటుడు తన కెరీర్లో 100 కోట్ల ప్రాజెక్ట్‌లను చేయలేకపోయినట్లు వెల్లడించారు. నిజం చెప్పాలంటే తాను రూ. 100 కోట్ల చిత్రాలను తిరస్కరించానని తెలిపారు. వాటిని వద్దనుకున్నప్పుడు అద్దంలో చూసుకుని నన్ను చెంపదెబ్బ కొట్టుకునేవాడినని పేర్కొన్నారు.విడాకుల రూమర్స్..గత కొద్ది కాలంగా గోవిందాపై విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తన భార్య సునీతా అహుజాతో విడిపోతున్నారని వార్తలు తెగ వైరలవుతున్నాయి. వీటిపై ఇటీవలే ఆయన భార్య కూడా స్పందించింది. గోవిందను... తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు. -
సికందర్ సాంగ్.. రష్మిక డ్యాన్స్‌తో అదరగొట్టేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రంజాన్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.సికందర్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. జోహ్ర జబీన్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రష్మిక మందన్నా, సల్మాన్ ఖాన్ కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సాజిద్నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్- 3లో కనిపించారు. -
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ సింగర్.. భార్య పేరును మాత్రం దాచిపెట్టాడు!
ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కొత్త ఏడాదిలో కొత్త బంధంలోకి పలువురు సినీతారలు అడుగుపెడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. బాలీవుడ్ గేయ రచయిత, సింగర్ అనుప్ జైన్ ఓ ఇంటివాడయ్యారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబతున్నారు.ప్రముఖ సింగర్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో నూతన వధూవరులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న 2025న ఢిల్లీలో జరిగింది. కాగా.. అనువ్ జైన్ తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలైన హృది నారంగ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అనువ్ తన భార్య పేరును మాత్రం ఫోటోల్లో వెల్లడించలేదు. అయితే ఓ అభిమాని మాత్రం ఆమె పేరును కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేశాడు. ఇక నుంచి అనుప్ జైన్ వివాహం చేసుకున్నందున బ్రేకప్ సాంగ్స్ పాడటం ఆపేస్తాడని కొందరు నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేశారు.కాగా.. సెప్టెంబర్ 2022లో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనువ్ జైన్.. తాను రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. అనువ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి చాలా దూరంగా ఉంటరు. బాలీవుడ్ పలు చిత్రాలు పాటలు ఆలపించిన అనువ్.. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా బారిషేన్, గుల్, అలాగ్ ఆస్మాన్ వంటి పాటలు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. -
19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్‌కి వస్తారన్నాడు: హీరోయిన్
సినిమా అనేది రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఇండస్ట్రీలోకి వస్తారు. అవకాశాల కోసం ఎదురు చూసి..చాన్స్ వచ్చినప్పుడే తమను తాము నిరూపించుకుంటారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు, బాధలు భరించి వచ్చినవాళ్లే. ముఖ్యంగా హీరోయిన్లు అయితే చాలా ‘ఇబ్బందులను’ ఎదుర్కొవాల్సి వస్తోంది. అవకాశాల పేరుతో మోసం చేసేవాళ్లు కొంతమంది అయితే.. అవకాశం ఇచ్చి అవమానించే వారు మరికొంతమంది. ఇలాంటి వాళ్లను తట్టుకొనే ఈ స్థాయికి వచ్చానని అంటోంది గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, 19 ఏళ్ల వయసులోనే ఓ డైరెక్టర్ తన గురించి చెడుగా ప్రవర్తించాడని, ఆయన అన్న మాటలకు డిప్రెషన్లోకి వెళ్లాని చెప్పింది. నీచంగా మాట్లాడాడుతాజాగా జరిగిన ఫోర్బ్స్ పవర్ ఉమెన్స్ సమ్మిట్‌లో ప్రియాంక పాల్గొని కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. ‘19 ఏళ్ల వయసులో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పటికే చిత్ర పరిశ్రమలో ఎలా ఉంటారో కూడా తెలియదు. ఓ సినిమా కోసం సెట్లోకి వెళ్లాను. దర్శకుడిని కలిసి ఇప్పుడు నాకు ఎలాంటి దుస్తులు కావాలో ఒక్కసారి మా కాస్ట్యూమ్ డిజైనర్‌కి చెప్పండి’ అని అడిగాను. అతను నా ముందే స్టైలిస్ట్ ఫోన్ చేసి నీచంగా మాట్లాడాడు.అలాంటి దుస్తులే వేసుకోవాలిఆ డైరెక్టర్ నా స్టైలిస్ట్‌కి ఫోన్ చేసి.. ‘హీరోయిన్ లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. కాబట్టి ప్రియాంక ధరించే దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి. తన లోదుస్తులు కనిపించాలి. తను కూర్చోగానే లోదుస్తులు కనిపించాలి.. అంటూ పదే పదే ఆ పదాన్నే ఉపయోగించాడు. హిందీలో ఆ మాటలు విన్నప్పడు నీచంగా అనిపించిది. చాలా బాధ కలిగింది. డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి అతడు నన్ను అంత చిన్నచూపు చూస్తే నేను ఎప్పటికీ ఎదగలేను అని చెప్పేశాను. ఆ మరుసటి రోజే వెళ్లి నేను ఈ సినిమా చేయలేనని చెప్పాను. ఇప్పటికీ ఆ దర్శకుడితో నేను కలిసి పని చేయలేదు. నన్ను ఎలా చూపించుకోవాలని అనేది నా ఛాయిస్. దృష్టికోణం అనేది నిజం. నేను ఎలాంటి దృష్టితో చూస్తానో అదే నా ఐడెంటిటీగా మారుతుంది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.మహేశ్‌కి జోడీగాబాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియాంక..పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి తన మకాంని మార్చింది. 'క్వాంటికో' టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి అక్కడ అగ్ర హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఈ గ్లోబల్ బ్యూటీ ప్రస్తుతం రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
బాలీవుడ్ కు గుడ్ న్యూస్ మళ్లీ బిజీ అవుతున్న ఖాన్స్
-
సైఫ్ అలీ ఖాన్‌ను గుర్తు పట్టలేదు.. డబ్బులు కూడా తీసుకోలేదు: ఆటో డ్రైవర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరికి యత్నించిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 30 ఏళ్ల బంగ్లాదేశీయునిగా(Bangladesh) పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్. భారత్ వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు.అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు. తాను ఆటోలో వెళ్తండగా ఓ మహిళ ఆగండి అంటూ గట్టిగా అరిచిందని.. దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చానని తెలిపాడు. అక్కడి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.. అప్పుడు సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలవుతోందని అతను వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో.. బాంద్రా వెస్ట్ నుంచి టర్నర్ రోడ్, హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్‌కు చేరుకున్నాం. వారివెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు.. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి (సైఫ్) కూర్చున్నాడు.. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయాను.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడమే లక్ష్యంగా ఆటోను నడిపినట్లు వెల్లడించారు. -
సైఫ్ అలీఖాన్‌కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
బాలీవుడ్ నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిణామాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీఖాన్ భార్య కరీనాకపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు. ఆయన తొలుత సహ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకుని 13 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు 2004లో విడాకులు తీసుకున్నారు.ఇదిలా ఉంటే గతంలో అమృతా సింగ్ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లడైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఆ విషయం హల్చల్ చేస్తోంది. చిత్రనిర్మాత, సూరజ్ బర్జాత్యా ఒకసారి ఒక చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్‌కి అమృతా సింగ్ నిద్రమాత్రలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు.దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ సంఘటన హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్‌తో పాటు కరిష్మా కపూర్, సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే, మోహ్నీష్ బహ్ల్, టబు కీలక పాత్రల్లో నటించారు. హమ్ సాత్ సాథ్ హై సెట్స్‌లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితమైన షాట్‌ను ఖచ్చితంగా చేయడానికి వీలుగా సైఫ్ అలీ ఖాన్ సరైన పరిస్థితిలో లేడు. అతనికి కారణాలేమో తెలీదు కానీ అంతకు ముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవడంతో చాలా రీటేక్‌లు ఇవ్వాల్సి వచ్చింది.‘‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది. అందుకే ఎప్పుడూ టెన్షన్లో ఉండేవాడు. ఈ చిత్రంలోని ‘సునో జీ దుల్హన్’ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలు మార్లు రీటేక్‌లు తీసుకుంటున్నాడు. ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు. నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది’’ అంటూ సూరజ్ బర్జాత్యా గుర్తు చేసుకున్నారు.అప్పుడు ఆయన సైఫ్ అలీఖాన్ భార్య అమృతాసింగ్కు ఓ సలహా ఇచ్చాడు. ’’అతను రాత్రంతా నిద్రపోవడం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను. అదేంటంటే... సైఫ్‌కు తెలియకుండా నిద్రమాత్రలు ఇవ్వాలని. నా సలహా ను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది’’ అంటూ ఆయన చెప్పారు. దాంతో అతని సన్నివేశాలు చాలా వరకూ ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట. కేవలం ఒక్క టేక్‌లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు. దాంతో షూటింగ్లో అందరూ షాక్ అయ్యారు’’ అన్నారాయన.హమ్ సాథ్ సాథ్ హై చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలనచిత్రంలో ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సైఫ్ అలీ ఖాన్ 2004లో అమృతాసింగ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, అతను 2012లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. -
సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. సీసీటీవీల్లో నిందితుడి దృశ్యాలు
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై ఇవాళ తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.ముంబై పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించగా.. ఆయన సిబ్బంది గట్టిగా అరవడంతో మేల్కొన్న సైఫ్.. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. -
గేమ్ ఛేంజర్‌తో పోటీపడనున్న స్టార్ హీరో మూవీ.. టీజర్ వచ్చేసింది!
పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు, అరుంధతి చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ఫతే. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఆ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సైబర్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేదు. అయితే అదే రోజున రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది.किरदार ईमानदार रखना जनाज़ा शानदार निकलेगा ! 🪓 #Fateh Teaser out now 🔥Releasing in cinemas on 10th January. @Asli_Jacqueline @ZeeMusicCompany @ShaktiSagarProd @ZeeStudios_ Link: https://t.co/wfeG5hIR3W pic.twitter.com/LV0DCjv5rb— sonu sood (@SonuSood) December 9, 2024 -
స్టార్ డైరెక్టర్ ఇంట పెళ్లిసందడి.. హల్దీ వేడుకలో ఖుషీ కపూర్!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు ఆలియా కశ్యప్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కాగా.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబయిలో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేశారు. ఈ హల్దీ వేడుకలో జాన్వీకపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ అందమైన దుస్తులు ధరించి మెరిసింది. ఈ ఫోటోలను అనురాగ్ కశ్యప్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అనురాగ్ కశ్యప్ తన కుమార్తెతో వివాహానికి ముందు అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ సినిమాని చూడటానికి తండ్రీకూతుళ్లిద్దరూ వెళ్లారు.కాగా.. ఆలియా కశ్యప్ కొంతకాలంగా షేన్‌తో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ డేటింగ్ యాప్ ద్వారానే పరిచయమయ్యారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడంతో తన సోషల్ మీడియా ఖాతాల ప్రమోషన్స్ చేస్తోంది. అంతేకాకుండా ఆమె యూట్యూబ్ ఛానెల్లో వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) -
టాలీవుడ్ డైరెక్టర్ యాక్షన్ మూవీ.. సన్నీ డియోల్ యాక్టింగ్ చూశారా?
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తోన్న తాజా చిత్రం జాట్. ఈ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ పాన్ ఇండియా మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.(ఇది చదవండి: ఓటీటీలో కంగువా.. అనుకున్న తేదీకంటే ముందే స్ట్రీమింగ్)టీజర్ చూస్తే ఈ మూవీని ఫుల్ యాక్షన్ కథాంశంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, స్వరూప ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. शैतान नहीं, भगवान नहीं जाट हैं वो 💥💥💥Action Superstar @iamsunnydeol in and as #JAAT 🔥🔥 🔥 #JaatTeaser out now ❤️🔥▶️ https://t.co/3WmWn7VEEhMASS FEAST loading in cinemas April 2025. 🙌 Produced by @MythriOfficial & @peoplemediafcy A @MusicThaman Mass Beat 🔥🔥… pic.twitter.com/77fPDP2mWl— Gopichandh Malineni (@megopichand) December 6, 2024 -
రెండు రోజుల క్రితమే సినిమాలకు గుడ్ బై.. అప్పుడే సెట్లో ప్రత్యక్షమైన హీరో!
12th ఫెయిల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ చిత్రంలో రాశి ఖన్నా, రిద్ధి డోగ్రాతో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే విక్రాంత్ మాస్సే రెండు రోజుల క్రితమే సినిమాలకు విరామం ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.కానీ అంతలోనే ఓ మూవీ షూటింగ్ సెట్లో దర్శనమిచ్చాడు విక్రాంత్ మాస్సే. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొన్నారు. తన తదుపరి చిత్రం ఆంఖోన్ కి గుస్తాఖియాన్ షానాయ కపూర్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కలిశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.నటనకు బ్రేక్..ఇటీవల తాను సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 2025 వరకు మాత్రమే సినిమాలు చేస్తానని ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ తర్వాత తన పోస్ట్‌పై విక్రాంత్ వివరణ ఇచ్చాడు. పూర్తిగా సినిమాలు మానేస్తానని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. కుటుంబం, ఆరోగ్యం కోసమే కొన్ని రోజులు విరామం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో అభిమానులు ఆందోళనకు గురికావద్దని విక్రాంత్ కోరారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) -
సినిమాలకు రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన సబర్మతి రిపోర్ట్ నటుడు!
12th ఫెయిల్ మూవీతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా విక్రాంత్ మాస్సే చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను 2025వరకు మాత్రమే సినిమాలు చేస్తానని పోస్ట్ చేశారు. తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా తన పోస్ట్‌పై విక్రాంత్ మాస్సే క్లారిటీ ఇచ్చాడు. అది తన రిటైర్మెంట్ ప్రకటన కాదని మరో పోస్ట్ చేశాడు. తన కుటుంబం, ఆరోగ్యం కోసమే కొద్ది రోజుల పాటు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఇస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.ఈ ప్రకటనతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.విక్రాంత్ మాస్సే తన స్టేట్మెంట్లో రాస్తూ.. "నాకు నటించడం మాత్రమే తెలుసు. నటన నాకు అన్నీ ఇచ్చింది. ప్రస్తుతం నా శారీరక, మానసికంగా అలసిపోయా. నేను కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సరైన సమయంలో మళ్లీ సినిమాల్లోకి వస్తా. నా కుటుంబం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కొంత సమయం విరామం ప్రకటిస్తున్నా' అని ప్రకటన విడుదల చేశారు. -
ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవీన్ కస్తూరియా ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ప్రియురాలు శుభాంజలి శర్మను పెళ్లాడారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అభిమాన నటుడికి అభినందనలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. బుల్లితెర నటుడిగా ఎంట్రీ నవీన్ కస్తూరియా ఆ తర్వాత సినిమాల్లోనూ మెప్పించారు. టీవీఎఫ్ పిచర్స్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌ల్లో నటించారు. బ్రీత్: ఇన్టు ది షాడోస్, ఆస్పిరెంట్స్, పతీ పత్ని ఔర్ పంగా, హ్యాపీ ఎవర్ ఆఫ్టర్, మ్యాన్స్ వరల్డ్ లాంటి సిరీస్‌ల్లో కనిపించారు. అంతేకాకుండా సులేమాని కీడా మూవీతో ఎంట్రీ ఇచ్చిన నవీన్ వా జిందగీ, లవ్ సుధా, ఇంటీరియర్ కేఫ్ నైట్, హోప్ ఔర్ హమ్ లాంటి సినిమాల్లోకి నటించారు. నవీన్ కస్తూరియా చివరిసారిగా మిథ్యా వెబ్ సిరీస్ సీజన్-లో కనిపించాడు. ఈ సిరీస్ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.డేటింగ్ రూమర్స్..గతంలో నవీన్‌పై డేటింగ్ రూమర్స్ కూడా వినిపించాయి. తన సహనటి హర్షిత గౌర్తో ఆయన డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత వాటిపై నవీన్ క్లారిటీ ఇచ్చారు. తాము ఇద్దరం ఎప్పుటికీ స్నేహితులమని అంతకుమించి మరేమీ లేదని స్పష్టం చేశారు. తాజాగా నవీన్‌కు పెళ్లి కావడంతో ఆ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడింది. -
సన్ ఆఫ్ సర్దార్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అశ్విని ధీర్ కుమారుడు మృతి చెందారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో జలజ్ (18) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు స్నేహితుడు కూడా మరణించారు. ఈ ఘటనతో దర్శకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధీర్ తన కెరీర్లో పలు చిత్రాలను తెరకెక్కించారు. సన్ ఆఫ్ సర్దార్, ఉ మే ఔర్ హమ్, అతిథి తుమ్ కబ్ జావోగే లాంటి చిత్రాలను రూపొందించారు. అంతేకాకుండా సినిమాలతో పాటు హమ్ ఆప్కే హై ఇన్ లాస్, హర్ షాఖ్ పే ఉల్లు బైతా హై వంటి ప్రముఖ సీరియల్స్‌కు కూడా దర్శకత్వం వహించారు. కాగా.. 2017లో గెస్ట్ లిన్ లండన్ అనే సినిమాకు చివరిసారిగా దర్శకత్వం వహించారు. -
రూ.12 కోట్ల విలువైన కారు కొన్న 'వినయ విధేయ రామ' నటుడు
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్రాండ్ కారును సొంతం చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి లగ్జరీ కారు డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.వివేక్ తన తల్లిదండ్రులు సురేశ్, యశోధర, భార్య ప్రియాంకతో కలిసి కొత్త కారులో ప్రయాణించారు. సిల్వర్ గ్రే కలర్ ఉన్న రోల్స్ రాయిస్ కుల్లినన్ కారు ధర మనదేశంలో దాదాపు రూ.12.25 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ ఒబెరాయ్ చివరిసారిగా 2019లో పీఎం నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్స్ బయోపిక్‌లో నటించారు.అంతేకాకుండా మలయాళం, కన్నడతో పాటు తెలుగు చిత్రాల్లోనూ కనిపించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర సినిమాలో నటించి తన నటనతో తెలుగు వారిని మెప్పించారు. రామ్ చరణ్ చిత్రం వినయ విధేయ రామలోనూ కీలక పాత్ర పోషించారు. సినిమాలతో పాటు ఇన్సైడ్ ఎడ్జ్, ధారవి బ్యాంక్, ఇండియన్ పోలీస్ ఫోర్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించాడు. విలన్‌గా, హీరోగా, సహా నటుడిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని విలక్షణ నుటుడిగా పేరు తెచ్చుకున్నారు వివేక్. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Vivek Oberoi (@vivekoberoi) -
కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ సినిమా.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ను తుడిచిపెట్టింది!
ఇటీవల సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. పాన్ ఇండియా హీరోల సినిమాలకైచే నిర్మాతలు బడ్జెట్ విషయంలో అసలు వెనకడుగు వేయడం లేదు. ఇటీవల సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువా. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కేవలం రూ.100 కోట్లకు పైగా వసూళ్లతోనే సరిపెట్టుకుంది. టాలీవుడ్‌లోనూ సలార్, బాహుబలి, పుష్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైనప్పటికీ సక్సెస్ సాధించాయి.అయితే భారీ బడ్జెట్ చిత్రాలతో లాభాల కంటే నష్టాలు ఎక్కువ వచ్చిన సందర్భాలే ఉంటున్నాయి. కానీ ఓ చిన్న సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్స్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2017లో అద్వైత్ చందన్ తెరకెక్కించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ మూవీని కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నిర్మించారు. ఇండియాలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్లోనూ రూ.65 కోట్లు వసూలు చేసి విజయాన్ని సాధించింది.అయితే ఆ తర్వాత చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఆ దేశంలో ఏకంగా 124 డాలర్ల మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా పెట్టుబడి కంటే అదనంగా 60 రెట్లు కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్లో జై సంతోషి మా మూవీ రికార్డును 20 రెట్ల భారీ తేడాతో అధిగమించింది.ఈ లెక్కన సీక్రెట్ సూపర్‌స్టార్ ప్రపంచవ్యాప్తంగా రూ.966 కోట్లను ఆర్జించిందని నివేదికలు వెల్లడించాయి. ఈ వసూళ్లతో ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన స్త్రీ 2 (రూ.857 కోట్లు), పీకే (769 కోట్లు), గదర్ -2 (రూ.691 కోట్లు), బాహుబలి: ది బిగినింగ్ (617 కోట్లు) లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అధిగమించింది. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. కానీ కేవలం రూ.15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన సీక్రెట్ సూపర్‌స్టార్... భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఈ సినిమాలో పెద్ద స్టార్స్ కూడా లేరు. అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించగా.. 16 ఏళ్ల జైరా వాసిమ్ కీలక పాత్ర పోషించారు. చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం దంగల్ తర్వాత అమీర్, జైరాలకు ఆ దేశంలో లభించిన క్రేజ్ కారణమని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. నవంబర్ 2024 నాటికి ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన 10వ భారతీయ చిత్రంగా సీక్రెట్ సూపర్‌స్టార్ నిలిచింది. -
ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి -16 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోలో ఆయన కుమారుడ్ అభిషేక్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన రాబోయే చిత్రం ఐ వాంట్ టూ టాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దర్శకుడు సుజిత్ సిర్కార్, రచయిత అర్జున్ సేన్ ఈ ఎపిసోడ్లో భాగమయ్యారు.ఈ సందర్భంగా అభిషేక్ తన మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుజిత్ ఐ వాంట్ టు టాక్ పూర్తి కథను చెప్పలేదని.. అర్జున్ జీవితం, అతని ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారని.. అదే తనకు నచ్చిందని తెలిపారు. ఈ కథలో కేవలం వంద రోజులు మాత్రమే తండ్రి బతుకుతాడని తెలిసిన ఆయన కూతురు ఏంటీ చచ్చిపోతున్నావా? నా పెళ్ళిలో డాన్స్ చేస్తావా? అని అమాయకంగా అడుగుతుంది. ఆ బాధను దిగమింది తాను చనిపోనని.. పెళ్లిలో నృత్యం చేస్తానని తన కూతురికి మాట ఇస్తాడు తండ్రి.. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యం.. ఈ స్టోరీనే ఐ వాంట్ టూ టాక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఒక తండ్రిగా కుమార్తెతో ఉండే ప్రేమ, అను బంధాన్ని అభిషేక్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ఈ కథ నిజంగా నా హృదయాన్ని తాకిందని.. తండ్రి మాత్రమే కుమార్తె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని అభిషేక్ అన్నారు. ఆరాధ్య నా కుమార్తె, షూజిత్కు ఇద్దరు కుమార్తెలు.. మేమంతా 'గర్ల్ డాడ్స్'.. అందుకే ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నామని తెలిపారు. అర్జున్ తన కూతురికి చేసిన వాగ్దానం కోసం ఆ తండ్రి చేసే పోరాటం గొప్పదన్నారు. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కథను విని అభిషేక్ ఎమోషనలయ్యారు. -
హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్.. ఆ హోటల్లో కఠిన నిబంధనలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం సల్లు భాయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సిటీలో రాయల్ హోటల్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనూ షూటింగ్ నిర్వహిస్తున్నారు.అయితే సల్మాన్ ఖాన్‌కు ఇటీవల వరుసగా బెదిరింపులు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణజింకల కేసు నుంచి ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరి నుంచి కాల్స్ వస్తుండటంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. అలా ఫుల్ సెక్యూరిటీ మధ్య ఆయన షూటింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.నాలుగంచెల భద్రత..ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లో నాలుగు అంచెల భద్రతలో సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్ నిర్వహించారు. ఆయన భద్రత విషయంలో రాజీ పడకూడకుండా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అతిథులు షూటింగ్ జరుగుతున్న హోటల్‌ను బుక్ చేసుకుంటే రెండంచెల చెకింగ్‌ను వారు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి హోటల్ సెక్యూరిటీ సిబ్బంది.. మరొకటి సల్మాన్ ఖాన్ ప్రత్యేక భద్రత బృందం వారిని తనిఖీ చేయాలి. ఆ తర్వాతే వారిని హోటల్లోకి అనుమతించడం జరుగుతుంది.ఐడీ ఉంటేనే అనుమతి...మరోవైపు హోటల్ సిబ్బందికి ఐడీ కార్డులు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ప్రతి రోజు సిబ్బంది ఐడీలను సైతం తనిఖీ చేస్తున్నారు. సల్మాన్ కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను పటిష్టమైన భద్రతా వలయంగా మార్చారు. ఆయన కోసం దాదాపు 50 నుంచి 70 వరకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. వీరిలో మాజీ పారామిలటరీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన తర్వాత సల్మాన్ దుబాయ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.కాగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
షారుఖ్ ఖాన్‌కూ బెదిరింపులు
ముంబై/రాయ్‌పూర్: బాలీవుడ్‌లోని మరో ప్రముఖ నటుడికి చంపేస్తామంటూ బెదిరింపు అందింది. సల్మాన్ ఖాన్‌కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే ఈసారి షారుఖ్ ఖాన్‌కు వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్‌ఫోన్‌కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు. బలవంతపు వసూళ్లు సహా వివిధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్లో జరిగే విచారణకు రావాల్సిందిగా ఆయనకు నోటీసిచ్చారు. ‘షారుఖ్ ఖాన్‌కు వచ్చిన బెదిరింపు మెసేజీపై విచారణ కోసం ముంబై పోలీసులు గురువారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చారు. బెదిరింపు మెసేజీ ఫైజాన్ పేరుతో రిజిస్టరైన ఫోన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆ మేరకు రాయ్‌పూర్‌లోని పండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఫైజాన్ ఖాన్‌కు నోటీసు అందజేశారు’అని రాయ్‌పూర్ సీనియర్ ఎస్పీ సంతోష్ సింగ్ చెప్పారు. అయితే, ఆ మెసేజీ తాను పంపలేదని, తనపై ఎవరో కుట్ర చేస్తున్నారనిఫైజాన్ ఖాన్ తెలిపారు. -
Bhool Bhulaiyaa 3 X Review: భూల్ భూలయ్యా టాక్ ఎలా ఉందంటే.. ?
బాలీవుడ్లో ఈ శుక్రవారం రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి సింగమ్ ఎగైన్. మరొకటి భూల్ భూలయ్యా 3. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, విద్యాబలన్, మాధూరీ దీక్షిత్ కీలక పాత్రలు పోషించారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సీరిస్ నుంచి వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, రెండు, మూడో భాగాల్లో కార్తీక్ ఆర్యన్ హీరో పాత్రను పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఇటీవల బాలీవుడ్లో భారీ చిత్రాలేవి లేకపోవడంతో ‘భూల్ భూలయ్యా 3’పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు(నవంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే పలు ప్రాంతాలలో ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భూల్ భూలయ్యా 3 కథేంటి? ఈ సారి ఏమేరకు భయపెట్టింది? కార్తిక్ ఆర్యన్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి.ట్విటర్లో భూల్ భూలయ్యా 3 చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది అంచనాలకు తగ్గట్టుగా లేదని ట్వీట్ చేస్తున్నారు. #OneWordReview...#BhoolBhulaiyaa3: OUTSTANDING.Rating: ⭐️⭐️⭐️⭐️Entertainment ka bada dhamaka... Horror + Comedy + Terrific Suspense... #KartikAaryan [excellent] - #AneesBazmee combo hits it out of the park... #MadhuriDixit + #VidyaBalan wowsome. #BhoolBhulaiyaa3Review pic.twitter.com/t2GbQIAfri— taran adarsh (@taran_adarsh) November 1, 2024ప్రముఖ సీనీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా అదిరిపోయిందంటూ ఏకంగా నాలుగు స్టార్స్(రేటింగ్) ఇచ్చాడు. హారర్, కామెడీ, సస్పెన్స్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుందని చెప్పారు. కార్తీక్ అద్భుతంగా నటించాడని, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటన బాగుందని ట్వీట్ చేశాడు. #BhoolBhulaiyaa3 first half... Full on cringe... Unnecessary songs and whatsapp forward jokes... @vidya_balan has the least screen presence but she stole the show... Hoping for a better second half... Pre-Interval block is interesting...— Anish Oza (@aolostsoul) November 1, 2024 ఫస్టాఫ్‌లో వచ్చే పాటలు కథకి అడ్డంకిగా అనిపించాయి. జోకులు కూడా అంతగా పేలలేదు. వాట్సాఫ్‌లలో పంపుకునే జోకుల్లా ఉన్నాయి. విద్యాబాలన్ తెరపై కనిపించేదది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇది ఓ యావరేజ్ మూవీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.The first one was a classic; this is just a disaster. #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review pic.twitter.com/e3VWavE9iB— Ankush Badave. (@Anku3241) November 1, 2024భూల్ భూలయ్యా మూవీ క్లాసికల్ హిట్ అయితే భూల్ భూలయ్యా 3 డిజాస్టర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.#BhoolBhulaiyaa3 might've been highly anticipated, but the script feels completely off-track. It's almost as if someone unfamiliar with the franchise wrote it. Disappointing execution and weak storyline! #BhoolBhulaiyaa3Review.pic.twitter.com/yvZGfTSNp9— Utkarsh Kudale 18 (@BOss91200) November 1, 2024The third installment of Bhool Bhulaiyaa is here to give us a Diwali filled with excitement and surprises. A cinematic delight that keeps you hooked! #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review"— itz Joshi (@ItzKulkarni) November 1, 2024#BhoolBhulaiyaa3Review: ⭐⭐⭐⭐A thrilling blend of laughs, chills, and an unexpected twist! #BhoolBhulaiyaa3 is a wild horror-comedy ride. @TheAaryanKartik nails it with his flawless comic timing, while @tripti_dimri23 lights up the screen. @vidya_balan and @MadhuriDixit… pic.twitter.com/aoHA2OBVbs— Manoj Tiwari (@ManojTiwariIND) November 1, 2024There is no mosquito repellent in the hall! The theatre is empty, watching a movie is no fun #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Harish raj (@Harishraj162409) November 1, 2024Bhool Bhulaiyaa 3 is a spine-chilling delight!The plot twists are just mind-blowing.Kartik Aaryan owns every scene he’s in.It's a film that’ll have you laughing and screaming!#BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Dattaraj Mamledar (@DattarajMamled) November 1, 2024 -
ప్రముఖ నిర్మాతపై పోక్సో కేసు.. ఎందుకంటే?
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడింది. బాలీవుడ్లో ప్రముఖ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఆమెపై కేసు నమోదైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో ప్రసారమవుతోన్న గంధీ బాత్ సీజన్-6కు సంబంధించిన ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో మైనర్ బాలికలకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఆరోపణలతో పోక్సో యాక్ట్ కింద ఆమెతో పాటు తల్లి శోభా కపూర్ పేరు కూడా చేర్చారు.ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీలో గంధీ బాత్ సీజన్- 6 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2021 మధ్య ప్రసారం చేశారు. బాలాజీ టెలిఫిల్మ్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సంస్థకు వీరిద్దరు యజమానులు కావడంతో ముంబయి పోలీసులు చర్యలు చేపట్టారు. మైనర్లకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు చూపారని ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదాస్పద ఎపిసోడ్ ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం కావడం లేదు.కాగా.. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఈ ఏడాది లవ్, సెక్స్ ఔర్ ధోఖా- 2 మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు. -
కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రాజకీయ కారణాలతో పలుసార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. అందువల్లే పంజాబ్ ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!
బాలీవుడ్లో ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ రియాలిటీ షోకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ఊహించని విధంగా బయటకొచ్చేశాడు. అడ్వకేట్ అయిన గుణరత్న సదావర్తే బిగ్ బాస్ హౌస్‌కు గుడ్ బై చెప్పారు. కారణమిదే...తాజా సమాచారం ప్రకారం అడ్వకేట్ గుణరత్న సదావర్తే సోమవారం కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అతను రాలేదు. దీంతో న్యాయమూర్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గుణరత్న సదావర్తే బిగ్‌బాస్ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే అతను మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తిరిగి వస్తాడా? లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.న్యాయవాది గుణరత్న కేసుఅంతకుముందు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నందున గుణరత్న సదావర్తే కోర్టుకు హాజరు కాలేకపోయాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమైన సమస్య అయిన మరాఠా రిజర్వేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు విచారిస్తోంది. కాగా.. సదావర్తే తన సతీమణి జైశ్రీ పాటిల్‌తో కలిసి రిజర్వేషన్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19కి కోర్టు వాయిదా వేసింది. -
స్టార్ హీరోకు క్యూట్ ప్రపోజ్.. మహిళ అభిమానానికి ఫిదా!
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విద్యా బాలన్, త్రిప్తి డిమ్రీ, మాధురి దీక్షిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని ఏకంగా ఆయనకు ప్రపోజ్ చేసింది. కార్తీక్ ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరు కాగా.. ఉహించని విధంగా ఓ అభిమాని సాంగ్ పాడి మరీ అతనికి ప్రపోజ్ చేసింది. ఈ సంఘటనతో ఆశ్చర్యానికి గురైన కార్తీక్.. తన మొత్తం ఫిల్మోగ్రఫీని ఒక్క కవితలో ఆలోచనాత్మకంగా చేప్పినందుకు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
69 ఏళ్ల వయసులో సాహసం.. ఓటీటీకి రియల్ స్టోరీ!
ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం విజయ్ 69. ఓ క్రీడాకారుని నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మనీశ్ శర్మ నిర్మించారు. ఈ చిత్రానికి అక్షయ్ రాయ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చేనెల 8 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. 69 ఏళ్ల వ్యక్తి ట్రయాత్లాన్ కోసం శిక్షణ పొందడం, జీవితంలోని సవాళ్లను ఎలా అధిగమించాడనేదే కథ.విజయ్ 69 కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువని అనుపమ్ ఖేర్ అన్నారు. ఇది అభిరుచి, పట్టుదల, అచంచలమైన మానవ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. మన కలలను సాకారం చేసుకోవడానికి వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదనే నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. విజయ్ 69 అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత చార్జ్ చేస్తాడంటే..?
బాలీవుడ్ ప్రముఖులకు, సెలబ్రిటీలకు మేకప్ వేసే ఆర్టిస్టులుంటారు. వారిలో కొందరూ చాలా ఫేమస్ అవ్వడమే గాక. వాళ్ల ఆర్ట్‌తో తమ కంటూ సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుంటారు. ఎంతలా అంటే ప్రముఖులకు మేకప్ వేసే ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకుంటారు. పైగా వాళ్ల ఫీజు కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. చెప్పాలంటే వాళ్లు ఈ స్థాయికి వచ్చేందుకు ఎన్ని కష్టాలు ఫేస్ చేసి ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అలా కష్టాలు పడి సెలబ్రిటీలు ఇష్టపడే మేకప్ ఆర్టిస్ట్‌గా క్రేజ్‌గా తెచ్చకున్నాడో వ్యక్తి. అతడెవరంటే..అతడి పేరే మిక్కీ కాంట్రాక్టర్. అతడి ప్రస్థానం ముంబైలోని టోక్యో బ్యూటీ పార్లర్లో హెయిర్ డ్రెస్సర్‌గా మొదలయ్యింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న రాణి హెలెన్ మిక్కీ ముందుఖ/ వచ్చి నిలబడింది. ఆ రోజుల్లో ఆమె పెద్ద స్టార్ అందువల్ల ఏ ఇతర ఉద్యోగికి ఆమె విగ్గు తీసే అధికారం లేదు. అందువల్ల మిక్కీ ఆ సాహసం చేయలేక ఆమె అనుమతికై వేచి చూస్తున్నాడు. అప్పుడు ఆమెతో మాట్లాడుతూ..తన సినిమాలకు హెయిర్ డ్రెస్సర్‌గా ఉంటానని మిక్కీ అడిగాడు. అందుకు హెలెన్ సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మేకప్ ఆర్టిస్ట్‌గా రమ్మని సలహ ఇచ్చింది. అదే బెస్ట్ అని మిక్కీకి హెలెన్ సూచించింది. అలా హెయిర్ డ్రెస్సర్ కాస్తా మేకప్ మ్యాన్‌గా బ్రెష్ పట్టుకుని ముఖానికి మెరుగులు దిద్దడం ప్రారంభించాడు. తన కలను నెరవేర్చుకునేందుకు, సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. చేయని ఉద్యోగం లేదు. అయితే కష్టపడి ఏదోరకంగా సినీ ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్‌గా అవకాశం వచ్చినా..అది కేవలం సినిమాలో మిగతా తారాగణానికే వేయాల్సి వచ్చేది. సినిమాలో నటించే మెయిన్ హీరోయిన్‌కి వేసే అవకాశం దక్కేదే కాదు. ఆ అవకాశం ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో ఎదురుచూపులు చూడాల్సి వచ్చేది. చివరికి 1992లో కాజోల్‌తో ‘బేఖుడి’ సినిమాతో మిక్కీకి మంచి బ్రేక్ వచ్చింది. అలా వెనుదిరిగి చూసుకోకుండా..హమ్ అప్కే హై కౌన్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, కల్ హో నా హో, మొహబత్తెయిన్, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, వీరే ది వెడ్డింగ్, వంటి చిత్రాలకు మేకప్ మ్యాన్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతా అంబానీ, ఇషా అంబానీ, టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి, కరీనా కపూర్, అలియా భట్, అనన్యపాండే వంటి ప్రముఖులకు మేకప్ వేసేది మిక్కీనే. చెప్పాలంటే సెలబ్రిటీల మేకప్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకున్నాడు. అతను మేకప్ వేయడానికి ఒకరోజుకి 75,000 నుండి రూ. లక్ష వరకు ఫీజు ఛార్జ్ చేస్తాడు. అంతేగాదు మిక్కీ భారతదేశంలోని అత్యంత సంపన్నమైన మేకప్ ఆర్టిస్ట్‌లో ఒకరు కూడా.(చదవండి: వెయిట్ లాస్ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..!) -
కమెడియన్ అరుదైన ఘనత.. తొలి భారతీయ నటుడిగా రికార్డ్!
బాలీవుడ్ నటుడు వీర్ దాస్ అరుదైన ఘనత సాధించారు. ఇండస్ట్రీలో స్టాండ్-అప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీర్ దాస్ ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2024 ఎమ్మీ అవార్డ్స్ హోస్ట్‌గా ఆయనను ప్రకటించింది.గతంలో 2021లో కామెడీ విభాగంలో ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. అయితే 2023లో నెట్‌ఫ్లిక్స్ కామెడీ వెబ్ సిరీస్ ల్యాండింగ్‌కు గానూ వీర్ దాస్ అవార్డ్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్‌గా వీర్‌దాస్ రికార్డ్ సృష్టించారు. ఈసారి ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్‌కు హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి భారతీయుడిగా నిలిచారు. కాగా..ఈ అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ 25న న్యూయార్క్‌లో జరగనుంది.(ఇది చదవండి: నా సినిమాకు జాతీయ అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్)కాగా.. ప్రముఖ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన వీర్‌దాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అతను ఇటీవల ప్రైమ్ వీడియో సిరీస్ కాల్ మీ బేలో న్యూస్ యాంకర్‌గా కనిపించారు. అతను ప్రస్తుతం ఇంటర్నేషనల్ టూర్లో ఉన్న వీర్ దాస్ ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. -
నీలో టాలెంట్ ఉందా?.. ఇక్కడైతే తొక్కేస్తారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్. బీటౌన్‌లో తన కామెంట్స్‌తో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గత ఎన్నికల్లో భాజపా ఎంపీగా గెలిచిన కంగనా ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో తలెత్తిన ఎమర్జన్సీ నేపథ్యంలో తెరకెక్కించారు.అయితే తాజాగా కంగనా రనౌత్ బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లను ఎదగనివ్వరని షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ అంతా ఈర్ష్య, అసూయలతో నిండిపోయిందని ఆరోపించారు. అందువల్లే చాలామంది కెరీర్స్ నాశనమయ్యాయని పేర్కొంది. ఎదగాలనుకునే వారికి బాలీవుడ్ ఇండస్ట్రీ సరైన వేదిక కాదన్నారు. ఒకవేళ ఎవరైనా తమ టాలెంట్‌తో పైకి వస్తే.. వారిని టార్గెట్ చేసి, పరువు తీసి తొక్కేస్తారని కంగనా వివరించింది. అలాగే తనపై కొంతమంది అసూయతో ఉన్నారని తెలిపింది.కాగా.. కంగనా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఎమర్జెన్సీ' సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే ముఖ్య పాత్రల్లో నటించారు. -
ఫేమస్ కావడానికే టార్గెట్ చేశాడు: అర్షద్ వార్సీపై బోనీ కపూర్ ఆగ్రహం
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ప్రస్తుతం ఆ పేరు ఒక్కటే వినిపిస్తోంది. ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేశాడు నటుడు అర్షద్ వార్సీ. అతను చేసిన కామెంట్స్ ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర జోకర్ లా ఉందంటూ అవమానకర రీతిలో మాట్లాడారు. అయితే అర్షద్ కేవలం ప్రభాస్‌ను మాత్రమే కాదు.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌పై సైతం విమర్శలు చేశారు. అతని సినిమా కోసం పని చేశానని.. కానీ సరైన పారితోషికం చెల్లించలేదని అర్షద్ వార్సీ ఆరోపణలు చేశారు.అయితే తాజాగా తనపై చేసిన కామెంట్స్‌పై బోనీ కపూర్ రియాక్ట్ అయ్యారు. అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వింటే కామెడీగా ఉందని అన్నారు. ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని.. ఇప్పుడు అతనికి నేను దొరికానని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. శ్రీదేవి, అనిల్ కపూర్ జంటగా 1993లో వచ్చిన చిత్రం రూప్ కి రాణి చోరోన్ కా రాజా. ఈ సినిమాలోని ఒక పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు బోనీ కపూర్ ప్రొడక్షన్ హౌస్ తనకు రూ. 25 వేలు తక్కువగా చెల్లించిందని అర్షద్ వార్సీ ఇటీవల ఆరోపించాడు. తాజాగా వార్సీ ఆరోపణలపై బోనీ కపూర్ కౌంటరిచ్చారు.బోనీ మాట్లాడుతూ..'అర్షద్ స్టేట్మెంట్ చదివి నవ్వుకున్నా. 1992లో సినిమా పాటను షూట్ చేశాం. ఆ సమయంలో అతను పెద్ద స్టార్ కాదు. అతనికి అంత పెద్ద మొత్తం ఎవరు చెల్లించారు?. షూటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పడుతుందని అనుకున్నాం. కానీ మూడు రోజుల్లోనే పూర్తయింది. అర్షద్‌కు రోజుకు రూ.25 వేలు చెల్లించారు. మూడు రోజులకు కలిపి రూ.75,000 ఇచ్చారు. అసలు పారితోషికం విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కానీ ఆయన ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్నేళ్లు ఎందుకు మాట్లాడలేదు' అని ప్రశ్నించారు. అంతకుముందు ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ మాట్లాడుతూ..'ఆ సినిమా వర్క్ కోసం నన్ను సంప్రదిస్తే కొరియోగ్రఫీ చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని రూ.లక్ష పారితోషికం అడిగా. అప్పుడు ఓకే అన్నారు. కానీ పాటను త్వరగా పూర్తి చేయమని నన్ను అడిగారు. నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పా. మూడు రోజుల్లోనే పని పూర్తి చేశా. చెక్కు తీసుకోవడానికి వెళ్తే రూ.75 వేలే ఇచ్చారు. అదేంటని అడిగితే నాలుగు రోజులకు రూ.లక్ష కదా.. మూడు రోజుల్లోనే పూర్తయినందుకు అంతే అన్నారని' తెలిపారు. -
షారూఖ్ ఖాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. తొలి భారతీయ నటుడిగా ఘనత!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ చివరిసారిగా డంకీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఈ సినిమా ఊహించని విధంగా అభిమానులను మెప్పించడంలో విఫలమైంది. అయితే షారూఖ్ ఖాన్ తాజగా లోకార్నో ఫిల్మ్ ఫిస్టివల్‌లో సందడి చేశారు. ఈ వేదికపై ఆయన ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు.పార్డో అల్లా కారియేరా అస్కోనా-లోకార్నో టూరిజం అవార్డును అందుకున్న మొదటి భారతీయ నటుడిగా షారూఖ్ ఖాన్ నిలిచారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్షా ఇండియన్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల ప్రేమవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. మూడున్నర దశాబ్దాల కెరీర్లో అన్ని రకాల పాత్రలు చేశానని బాద్షా చెప్పుకొచ్చారు. విలన్‌గా, ఛాంపియన్‌గా, సూపర్ హీరోగా, జీరోగా కనిపించానని వెల్లడించారు.ముఖ్యంగా దక్షిణాది సినిమాలపై షారూఖ్ ప్రశంసలు కురిపించారు. ఇండియాలో చాలా భాషలు ఉన్నాయప్పటికీ మంచి సినిమాలు వస్తున్నాయన్నారు. ప్రధానంగా దక్షిణాది నుంచి అద్భుతమైన చిత్రాలు వచ్చాయని షారూఖ్ అన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు సినిమాటిక్‌గా, టెక్నికల్‌గా ఫెంటాస్టిక్ అని కొనియాడారు. సౌత్‌లో హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుందని బాలీవుడ్ బాద్షా తెలిపారు. Shah Rukh Khan - "To regionalize Indian Cinema is wrong, we have some wonderful cinema and talents from each corner of country. Technically South Cinema is very fantastic, and I loved the opportunity to create a fusion of Bollywood & South in Jawan" pic.twitter.com/Rpr8ZjqFnd— sohom (@AwaaraHoon) August 11, 2024 -
ఖరీదైన కారు కొన్న జాన్వీ కపూర్ సిస్టర్.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ చెల్లెలు, శ్రీదేవి ముద్దుల కూతురు ఖుషీ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త రెడ్ కలర్ మెర్సిడెజ్ కారులో తిరుగుతూ ముంబయి వీధుల్లో కనిపించింది. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నటికి కంగ్రాట్స్ చెబుతున్నారు.కాగా.. ఖుషీ కపూర్ ది ఆర్చీస్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో బెట్టి కూపర్ పాత్రలో మెప్పించింది. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో సుహానా ఖాన్, అగస్త్యానందా కీలక పాత్రల్లో కనిపించారు. ఖుషీ ప్రస్తుతం రొమాంటిక్ కామెడీగా వస్తోన్న నాడనియాన్ చిత్రంలో నటించనుంది. ఇందులో ఇబ్రహీం అలీఖాన్ హీరోగా చేస్తున్నారు. ఆ తర్వాత హిందీలో రీమేక్ చేస్తోన్న లవ్ టుడే చిత్రంలో కనిపించనుంది. మరోవైపు జాన్వీ కపూర్ దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నటుడి ట్విటర్ ఖాతా హ్యాక్.. ఫ్యాన్స్‌కు హెచ్చరిక!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్(ట్విటర్ అకౌంట్) హ్యాకింగ్ గురైంది. ఈ విషయాన్ని నటుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని తెలిపారు. తన అభిమానులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా.. అర్జున్ రాంపాల్ చివరిసారిగా 'క్రాక్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్, రణవీర్ సింగ్‌లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆదిత్య ధర్ హెల్మ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) -
నాలో అభద్రతా భావం.. అందుకే స్టెరాయిడ్స్ తీసుకున్నా: స్టార్ హీరో మేనల్లుడు
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటుడు ఇమ్రాన్ ఖాన్. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరో.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తాను పడిన ఇబ్బందులపై మాట్లాడారు. తనలో అభద్రతా భావం ఎక్కువగా ఉండేదని తెలిపారు. అసలు నటుడి నేను రాణించగలనా? అని భావించేవాడినని అన్నారు. ఇలా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు.హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్‌లా శరీరాకృతి కలిగి ఉండాలని ప్రయత్నించినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అందుకోసం స్టెరాయిడ్స్‌ను వినియోగించినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ హీరో లుక్‌లో కనిపించేందుకు ఇలా చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మన లుక్ కోసం ఇలాంటి కెమికల్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదని అర్థమైందని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఉంటే ఫేమ్ మాత్రమే కాదు.. చాలా ఇబ్బందులు కూడా పడాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో నటీమణులు మాత్రమే గ్లామర్‌పై దృష్టిపెట్టేవారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయి నటులు సైతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.కాగా.. కిడ్నాప్, ఐ హేట్ లవ్ స్టోరీస్, లక్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ పలు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా 2015లో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. -
అలా చేస్తే డైరెక్ట్‌గా చావును అమ్మినట్లే: జాన్ అబ్రహం కామెంట్స్!
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం యాక్షన్-థ్రిల్లర్ వేదా సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా, శార్వరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిఖిల్ అద్వానీ డైరెక్షన్లో.. జీ స్టూడియోస్, ఎమ్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది.ఈ సందర్భంగా హీరో జాన్ అబ్రహం ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాన్ మసాలా యాడ్స్‌లో నటిస్తున్న హీరోలపై విమర్శలు చేశారు. ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టే ఉత్పత్తులను ప్రచారం చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అభిమానులకు తాను రోల్ మోడల్‌గా ఉండాలని కోరుకుంటానని తెలిపారు.జాన్ అబ్రహం మాట్లాడుతూ.. 'నేను నిజాయితీగా జీవిస్తేనే రోల్ మోడల్‌గా ఉంటా. ఒకవేళ ఫేక్ ప్రచారాలు చేస్తే తొందరగా దాన్ని గుర్తిస్తారు. ఇక్కడ కొందరు ఫిట్నెస్ గురించి మాట్లాడతారు. కానీ అదే వ్యక్తులు పాన్ మసాలా గురించి ప్రచారం చేస్తారు. నేను నా సహ నటులందరినీ గౌరవిస్తా. ఇక్కడ కేవలం నా గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను మరణాన్ని అమ్మాలనుకోవడం లేదు. మనదేశంలో పాన్ మసాలా వార్షిక టర్నోవర్ రూ.45 వేల కోట్లు అని మీకు తెలుసా? అంటే ప్రభుత్వం కూడా దీనికి మద్దతిస్తోంది. అందుకే ఇక్కడ చట్టవిరుద్ధం కాదు. వీటి గురించి ప్రచారం చేసే సెలబ్రిటీలు ఇన్‌డైరెక్ట్‌గా చావును ప్రజలకు అమ్మినట్లే. అలా వచ్చిన డబ్బులతో మీరెలా బతుకుతున్నారు' అని విమర్శించారు. కాగా.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రకటనలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇలాంటి యాడ్స్‌లో పాల్గొనబోనని అక్షయ్ ప్రకటించాడు. కాగా.. జిస్మ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన జాన్ అబ్రహం.. ఆ తర్వాత ధూమ్, గరం మసాలా, టాక్సీ నెం 9211, దోస్తానా, ఫోర్స్, దేశీ బాయ్జ్, రేస్ 2, పఠాన్ వంటి చిత్రాల్లో నటించారు. -
ఓర్రీ న్యూ లుక్.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అందరూ తహతహలాడతారు.. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇతడితో ఫోటో దిగేందుకు ఎగబడతారు. అతడే ఓర్రీ.. పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమణి. సినీతారలు. హీరోయిన్లకు ఇతడు బెస్ట్ ఫ్రెండ్.. బాలీవుడ్లో అంతలా ఫేమస్ అయ్యాడు. రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఓర్రీ తాజాగా న్యూ హెయిర్ కట్‌తో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. నేను ప్రతి సాయంత్రం మేల్కొంటాను.. మీరు ఇప్పటికీ 9 నుంచి 5 వరకు పనిచేస్తూనే ఉంటారు.. అది ఎంత చెడ్డదోనని ఆశ్చర్యపోతున్నానంటూ పోస్ట్ చేశారు.అయితే ఒర్రీ హెయిర్ స్టైల్‌పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అతని న్యూ లుక్‌ను ఉద్దేశించి నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అతని లుక్‌ను చికెన్ హెయిర్ కట్ అంటూ కోడిపుంజుతో కొందరు పోల్చారు. మరికొందరేమో నా పాతబట్టలు తీసుకోండి అంటూ సలహా ఇచ్చాడు. ఇంకొందరైతే ఏకంగా చికెన్ సెంటర్లో పనిచేసే వాడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు.ఎవరీ ఓర్రీ...ఓరీ గురించి వివరాలు ఆరా తీస్తే... అతడు న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇతడు ఓ సామాజిక కార్యకర్త కూడా! మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. దీని గురించి ఓరీ ఓసారి మాట్లాడుతూ.. 'నేను ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్నాను. కానీ ఏమయ్యాను? రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా, స్టైలిష్‌గా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా.. ఇలా రకరకాల పనులు చేస్తున్నాను. కొన్నిసార్లు ఫుట్‌బాల్ కూడా ఆడతాను. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) -
బాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అక్కాతమ్ముడు ఎవరంటే (ఫోటోలు)
-
'అత్యంత చెత్త గ్లామర్ నాదే'.. సైంధవ్ నటుడి షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఈ ఏడాది వెంకటేశ్ నటించిన సైంధవ్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవాజుద్దీన్ నటించిన 'రౌతు కా రాజ్' సినిమా జీ5లో జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన ముఖం చూసి నిరుపేద అనుకుంటారని అన్నారు. అంతే కాకుండా ఇండస్ట్రీలో అత్యంత అగ్లీయస్ట్ నటుడిని తానేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ మాట్లాడుతూ..'కొంతమంది మన రూపాన్ని ఎందుకు ద్వేషిస్తారో నాకు తెలియదు. బహుశా మనం అంత అందంగా కనిపించకపోవడం వల్లే కావొచ్చు. నేను కూడా నన్ను నేను అద్దంలో చూసుకుంటా. నేను అందంగా లేకపోయినా సినిమా పరిశ్రమలోకి ఎందుకు వచ్చానా అని ప్రశ్నించుకుంటా. బాలీవుడ్లో శారీరకంగా.. అత్యంత అంద విహీనంగా కనిపించే నటుడిని నేనే. ఈ విషయం నాకు తెలుసు. అయితే చిత్ర పరిశ్రమపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నా కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం ఇచ్చినందుకు ఇండస్ట్రీకి నా కృతజ్ఞతలు' అని అన్నారు.కాగా.. నవాజుద్దీన్ చివరిసారిగా హడ్డీలో కనిపించాడు. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో విడుదలైంది. అతని ఇటీవల విడుదలైన రౌతు క రాజ్ జూన్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆనంద్ సురపూర్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ చిత్రంలో అతుల్ తివారీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి కూడా నటించారు. -
వంట మనిషి కోసం లక్షలు డిమాండ్: డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నటీనటులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు నటీనటులు సమంజసం కాని డిమాండ్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. షూటింగ్ సమయంలో కొంతమంది నటులు వ్యక్తిగత చెఫ్‌లను నియమించుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. అంతే కాదు.. వారి చెఫ్‌కు ఒక్క రోజుకు ఏకంగా రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. వారి డిమాండ్స్ చాలా హాస్యాస్పదంగా ఉంటాయని కశ్యప్ వెల్లడించారు. అయితే ఎవరనేది మాత్రం పేర్లు వెల్లడించలేదు.కొందరు నటులు తమకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే వారు చెఫ్ వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారని కశ్యప్ అన్నారు. అంతే కాకుండాహెయిర్, మేకప్ ఆర్టిస్టులు రోజుకు రూ.75,000 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది సాంకేతిక నిపుణుల కంటే ఎక్కువని కశ్యప్ పేర్కొన్నాడు. తాను హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అయి ఉంటే ఇప్పటికే ధనవంతుడు అయ్యి ఉండేవాడినని తెలిపారు.ఇదంతా నిర్మాతలు, వారి ఏజెంట్ల తప్పు వల్లే జరుగుతోందని.. నిర్మాతలు ఇలాంటి వారిని సెట్స్‌పై ఎందుకు అనుమతిస్తారో నాకు అర్థం కావడం లేదన్నారు. కానీ నా సెట్స్‌లో ఇలాంటివి జరగవని చెప్పాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ సెట్‌కు మైళ్ల దూరంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బర్గర్ తీసుకురావాలని తమ డ్రైవర్‌ను ఓ నటుడు కోరినట్లు కశ్యప్ తెలిపారు. ఇలాంటి ఖర్చులు సినిమా మొత్తం నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.కాగా.. కశ్యప్ ఇటీవలే బాడ్ కాప్ సిరీస్‌లో నటించాడు. ఇందులో గుల్షన్ దేవయ్యకు విలన్‌గా నటించారు. -
హీరో ఇంటిని రెంట్‌కు తీసుకోనున్న స్టార్ జంట!
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, నటాషా దలాల్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆయన భార్య నటాషా దలాల్ ఈ ఏడాది జూన్ 3న బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వీరికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్లో తెగ వైరలవుతోంది. త్వరలోనే ఈ జంట కొత్త బంగ్లాకు మారుతున్నట్లు తెలుస్తోంది.ముంబయిలోని జుహులో హృతిక్ రోషన్‌కు చెందిన విలాసవంతమైన ఫ్లాట్‌కు షిఫ్ట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని విలువ రూ. 50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హృతిక్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసించాడు. కానీ ప్రస్తుతం ఆయన రూ.100 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్‌కు మారిపోయారు.దీంతో వరుణ్ ధావన్ ఆ ఇంటిని రెంట్‌కు తీసుకోబోతున్నట్లు సమాచారం. సముద్రం పక్కనే ఉండే ఇల్లు అక్షయ్ కుమార్ లాంటి ప్రముఖుల ఇళ్ల పక్కనే ఈ ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం వరుణ్ తన కుటుంబంతో కలిసి 2017లో కొనుగోలు చేసిన జుహు అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. సినిమాల విషయానికొస్తే వరుణ్ ధావన్ అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్‌లో కనిపించనున్నారు. -
కోట్ల రూపాయల కారు గిఫ్ట్.. ఎలుకల వల్ల నష్టపోయానన్న హీరో!
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 2022లో భూల్ భూలయ్యా- 2తో సక్సెస్ అందుకున్నారు. అంతేకాకుండా గతేడాది షెహజాదా, సత్యప్రేమ్ కీ కథ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం చందు ఛాంపియన్. ఈ సినిమాను కబీర్ ఖాన్ తెరకెక్కించారు. భారత తొలి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.అయితే భూల్ భూలయ్యా- 2 ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఏకంగా రూ. 4.72 కోట్ల విలువైన మెక్లారెన్ కారును బహుమతిగా అందుకున్నారు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ కారును కార్తీక్‌కు బహుమతిగా ఇచ్చారు.అయితే ఆ కారే ఇప్పుడు హీరోకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆ కారులోని మ్యాట్‌ను ఎలుకలు పాడుచేశాయని ఆయన తెలిపారు. కేవలం మ్యాట్స్ వేసేందుకే లక్షల రూపాయల్లో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని అతను వెల్లడించాడు. ప్రస్తుతం ఆ కారును గ్యారేజీలో పార్క్ చేసినట్లు పేర్కొన్నారు. కార్తీక్ నటించిన తాజా చిత్రం చందు ఛాంపియన్ జూన్ 14న విడుదల కానుంది. -
రెంట్ కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది.. స్టార్ హీరో మాజీ భార్య!
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు ఇటీవల లపత్తా లేడీస్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఏకంగా రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ మూవీని దాటేసింది. కొద్ది రోజుల్లోనే టాప్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అమిర్ ఖాన్ మాజీ భార్య అయిన కిరణ్ రావు 2010లో ధోబీ ఘాట్ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. ముంబయిలో బతికేందుకు చాలా ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అధిక జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు రెండు, మూడు ఉద్యోగాలు చేశానని వెల్లడించారు.కిరణ్ రావు మాట్లాడుతూ..'ముంబయిలో ఖర్చులు ఎక్కువ కావడంతో చాలా ఉద్యోగాలు చేశా. కేవలం ఇంటి అద్దె కోసమే అడ్వర్టైజింగ్ సంస్థల్లో పనిచేశా. లగాన్ లాంటి ఫీచర్ ఫిల్మ్‌కు పని చేసినప్పుడు నాకు ఎలాంటి డబ్బులు రాలేదు. అడ్వర్టైజింగ్ జాబ్స్‌తో వచ్చే డబ్బుతోనే ముంబయిలో నివసించా. ఆ ఉద్యోగాల వల్లే కంప్యూటర్లు, కారు వంటి ఖరీదైన వస్తువులు కొన్నా. మా నాన్న నుంచి లక్ష రూపాయలకు మొదటి కారు కొన్నా' అని తెలిపింది. కాగా.. కిరణ్ రావు.. హీరో అమిర్ ఖాన్‌కు పెళ్లైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. -
లపతా లేడీస్ అచ్చం నా సినిమాలా ఉంది: డైరెక్టర్ తీవ్ర ఆరోపణలు
అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం లపతా లేడీస్. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి టాక్ రావడంతో ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఇటీవలే యానిమల్ చిత్రాన్ని దాటేసి అత్యధిక వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అమిర్ ఖాన్ కూడా నిర్మాతగా ఉన్నారు. అయితే సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై ప్రముఖ డైరెక్టర్, జాతీయ అవార్డ్ గ్రహీత అనంత్ మహదేవన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో సీన్స్ అచ్చం గున్గట్ కే పట్ ఖోల్ లాగే ఉన్నాయని అన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనంత్ మహదేవన్ మాట్లాడుతూ.. 'లపతా లేడీస్ చూశా.. ప్రారంభం నుంచి సినిమాలో చాలా సీన్స్ ఓకేలా ఉన్నాయి. మా సినిమాలో సిటీకి చెందిన ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి గ్రామానికి వెళ్తాడు. ఘున్‌ఘట్ రైల్వే స్టేషన్లో వధువును బెంచ్‌పై వేచి ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మరో వధువుతో చేరతాడు. ఆ మహిళ ఘున్ఘట్లో ఉన్నందున పోలీసులు ఆమె ఫోటోను చూసే సన్నివేశం నా సినిమాలో ఉంది. ఇందులో పోలీసు పాత్రలో మరొకరు ఉన్నారు అంతే. మిగిలినదంతా సేమ్ టూ సే మ్. అంతే కాకుండా రైల్వే స్టేషన్లో వధువు ముసుగుతో కప్పి ఉన్న సీన్ అంతా మా సినిమాలాగే ఉంది.' అని అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఘున్‌ఘట్ కే పట్ ఖోల్ చిత్రం ఇప్పుడు లేదన్నారు.స్పందించిన రైటర్లపతా లేడీస్ కథ రాసిన బిప్లబ్ గోస్వామి ఈ విషయంపై స్పందించారు. నేను దశాబ్దం క్రితమే ఈ కథ రాశానని తెలిపారు. నా కథ, స్క్రిప్ట్, డైలాగ్స్, క్యారెక్టరజేషన్, సీన్స్ అన్నీ వంద శాతం ఒరిజినల్‌గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కథను ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందలేదని అన్నారు. అంతేకాకుండా అనంత్ మహదేవన్ జీ సినిమాని చూడలేదని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2001లో జరిగిన లపాతా లేడీస్ రైలు ప్రయాణంలో విడిపోయే ఇద్దరు యువ వధువుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. -
సందీప్ వంగాకు ఒకలా భన్సాలీకి మరోలా ఇదేనా బాలీవుడ్ నీతి
-
సిద్ధార్థ్ మల్హోత్రా, కృతీ సనన్ జంటగా రొమాంటిక్ కామెడీ మూవీ!
సిద్ధార్థ్ మల్హోత్రా, కృతీ సనన్ హీరో హీరోయిన్లుగా హిందీలో ఓ కొత్త సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘దస్వి’ ఫేమ్ తుషార్ జలోట దర్శకత్వం వహిస్తారట. దినేష్ విజన్ నిర్మించనున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, ఈ ఏడాదిలో చిత్రీకరణను ప్రారంభించాలని అనుకుంటున్నారని భోగట్టా. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట దినేష్ విజన్. మరి... ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో సిద్ధార్థ్, కృతీ సనన్ జోడీగా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
రెండోసారి తండ్రైన ప్రముఖ నటుడు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు హర్మన్ బవేజా రెండోసారి తండ్రయ్యారు. ఆయన భార్య సాషా రాంచందనీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ హర్మన్ బవేజా జంటకు అభినందనలు చెబుతున్నారు. డిసెంబరు 2022లోనే వీరిద్దరికి ఓ కుమారుడు జన్మించగా.. తాజాగా ఆడిబిడ్డకు జన్మనిచ్చారు.కాగా.. హర్మన్ బవేజా, సాషా రాంచందనీ 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికొస్తే హర్మన్ బవేజా చివరిసారిగా స్కూప్లో కనిపించాడు. సన్యా మల్హోత్రాతో కలిసి ది గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్‌లో కనిపించనున్నారు. 2008లో లవ్ స్టోరీ 2050 చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు హర్మన్. ఇందులో ప్రియాంక చోప్రా కూడా ప్రధాన పాత్రలో నటించింది. అంతే కాకుండా వాట్స్ యువర్ రాషీ, విక్టరీ, దిష్కియావూన్, ఇట్స్ మై లైఫ్ చిత్రాల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Rowena Baweja (@rowenabaweja) -
బుల్లితెర నటిపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. కానీ!
బాలీవుడ్ బుల్లితెర భామ దీపికా కక్కర్ బీటౌన్‌లో సుపరిచితమే. ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్- 12లో కంటెస్టెంట్‌గా పాల్గొని విజేతగా నిలిచింది. అయితే 2018లో రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ గతేడాది జూన్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఇదిలా ఉండగా దీపికా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఆమె ఇటీవలే తన బిడ్డ రుహాన్‌ను తన చేతుల్లో పట్టుకుని వీడియోలో కనిపించింది. అందులో దీపికా వదులుగా ఉన్న తెల్లటి సూట్ ధరించి కనిపించింది. ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ 'బేబీ బంప్' దుపట్టాతో దాచి ఉంచారంటూ కామెంట్స్ చేశారు. అయితే దీపికా కక్కర్ తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించలేదు. కాగా.. దీపికకు ఇప్పటికే రౌనక్ సామ్సన్ అనే వ్యక్తితో మొదటి పెళ్లి కాగా.. అతనితో 2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2018లో షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. -
స్త్రీవాదమే సమాజాన్ని నాశనం చేసింది: నటి కామెంట్స్ వైరల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ ఇటీవల మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ఇటీవల బాలీవుడ్ జంటలపై సంచలన కామెంట్స్ చేసింది. వారంతా కేవలం డబ్బు, పేరు కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారని విమర్శించింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. అందుకే ఎవరితోను డేటింగ్లో చేయడం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ బాలీవుడ్ భామ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ఓ పాడ్‌కాస్ట్‌లో నోరా మాట్లాడుతూ ఫెమినిజంపై విమర్శలు గుప్పించింది. స్త్రీవాదం అనేది సమాజాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించింది. అది కేవలం మహిళలనే కాకుండా పురుషులను కూడా బ్రెయిన్‌వాష్ చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫెమినిజంపై నోరా మాట్లాడుతూ..'ఇలాంటి ఆలోచన ఎవరికీ అవసరం లేదు. స్త్రీవాదమనే ఈ విషయాన్ని నేను అస్సలు నమ్మను. నిజంగా స్త్రీవాదమే మన సమాజాన్ని పూర్తిగా నాశనం చేసింది. మహిళలు పెళ్లి చేసుకోకూడదు. పిల్లలను కనకూడదనే ధోరణిని తాను విశ్వసించను. ఇది పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి. ఇక్కడ పురుషులు డబ్బు, ఫుడ్ కోసం పనిచేస్తుంటే.. ఒక స్త్రీ పిల్లలు, ఇల్లు చూసుకోవడం, వంట చేయడం లాంటివి చేస్తున్నారు. మహిళలు బయటకు వెళ్లి పని చేయాలి.. వారు సొంతంగా జీవించాలని కోరుకుంటున్నారు.. కానీ అది కొంత వరకేనని' చెప్పుకొచ్చింది. ప్రస్తుత సమాజంలో చాలా మంది పురుషుల ధోరణి మారింది. ఇప్పుడు చాలా మంది ఫెమినిజం ద్వారా బ్రెయిన్‌వాష్‌కు గురయ్యారంటూ నోరా తెలిపింది. మనమందరం సెంటిమెంట్స్‌లో సమానమే కానీ.. సామాజికపరంగా సమానం కాదని నోరా పేర్కొంది. స్త్రీవాదం అంతర్లీనంగా, ప్రాథమిక స్థాయిలో గొప్పదే.. నేను కూడా మహిళల హక్కుల కోసం వాదిస్తానని.. బాలికలు పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటానని తెలిపింది. అయితే, స్త్రీవాదం రాడికల్‌గా మారినప్పుడే సమాజానికి ప్రమాదకరంగా మారుతుందని వెల్లడించింది. అయితే ఫెమినిజం పునాదులు గట్టిగానే ఉన్నప్పటికీ .. గత 20 ఏళ్లలో పోలిస్తే చాలా ప్రమాదకరంగా మారిందని అన్నారు. అయితే నోరా ఫతేహీ చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మీ మాటలు చాలా కామెడీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీవాదం లేకపోతే ఇండియాలో నీకు పని చేసే అవకాశం లభించేది కాదని అంటున్నారు. అలా అయితే మీరు వెంటనే పని మానేసి పెళ్లి చేసుకోండి.. అలాగే మీరు ఐటెం సాంగ్స్‌లో డ్యాన్స్ చేయకుండా భర్తపైనే ఆధారపడి జీవించండి అంటూ ఓ నెటిజన్ చురకలంటించారు. అసలు మహిళలు కేవలం సంరక్షకులుగా ఉండాలని.. పురుషులే పోషించాలని.. స్త్రీవాదం సమాజాన్ని నాశనం చేసిందని నోరా ఫతేహి ఎలా మాట్లాడాతారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించింది. ప్రస్తుతం నోరా చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
Hrithik Roshan: ఈ బాలీవుడ్ యాక్టర్ ముద్దు పేరు వింటే షాకే..!
ఒక్కొక్కరికి ఒక్కో ముద్దుపేరు ఉండటం సహజం. వారి ప్రవర్తనతో గానీ, అలవాట్లు.. ఇష్టాలతోగానీ, కనిపించే తీరుతోగానీ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. చాలా రకాలుగా మారుపేర్లు, ముద్దుపేర్లు వస్తూంటాయి. కొన్ని ముద్దు పేర్లు మాత్రం స్థిరపడిపోతాయి కూడా. ఇలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోషన్‌కి కూడా ఓ చిన్న కథ ఉంది. అదేంటో చూద్దామా! బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ పెట్ నేమ్ దుగ్గూ. ఈ ముద్దు పేరుకీ.. హృతిక్ వాళ్ల నాన్న.. బాలీవుడ్ ఒకప్పటి అందాల హీరో రాకేశ్ రోషన్ పెట్ నేమ్కీ ఏదో కనెక్షన్ ఉండే ఉంటదని బాలీవుడ్ వర్గాలు.. తన పేరునే కాస్త తిరగేసే కొడుకును పిలుచుకుంటున్నాడా ఏంటీ అని హృతిక్ ఫ్యాన్స్ డౌట్ పడతారట. ఇంతకీ రాకేశ్ రోషన్ ముద్దు పేరేంటంటే.. గుడ్డూ! ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
ఇండస్ట్రీలో కలకలం.. సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్రవాహనపై వచ్చిన అగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గతంలో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాప్ టెన్ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది ఎన్ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే. #WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning. Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J — ANI (@ANI) April 14, 2024 -
Tamannaah Bhatia: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మిల్కీ బ్యూటీ (ఫొటోలు)
-
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
ఆ ఒక్క సినిమాతో ప్రతిష్టాత్మక అవార్డ్ కొట్టేసిన నటుడు!
చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న చిత్రం 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్‌తోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎస్ కావాలనే కలను నిజం చేసుకున్న నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఐపీఎస్ కల కోసం మనోజ్ కుమార్ శర్మ కష్టపడిన తీరును చక్కగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే మెప్పించారు. తాజాగా ఈ చిత్రంలో అతని నటనకుగానూ ప్రతిష్టాత్మక అవార్డ్‌కు ఎంపికయ్యారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను(ఉత్తమ నటుడు) అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్టీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఈవెంట్లో ఈ అవార్డ్‌ను బహుకరించారు. కాగా.. ధరమ్ వీర్, బాలికా వధు, బాబా ఐసో వర్ ధూండో, యే హై ఆషికి వంటి కొన్ని సీరియల్స్‌లో విక్రాంత్ మాస్సే నటించారు. అంతే కాకుండా ఎ డెత్ ఇన్ ది గంజ్, ఛపాక్, హసీన్ దిల్రూబా, గ్యాస్‌లైట్ వంటి చిత్రాలలో కనిపించారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్, క్రిమినల్ జస్టిస్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. కాగా.. ప్రస్తుతం 12th ఫెయిల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
స్వరమే కాదు.. అందంతో కూడా ఆహా అనిపించే ఈ సింగర్ తెలుసా! (ఫోటోలు)
-
పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు!
ప్రముఖ సంగీత నిర్మాత, కంపోజర్ యశ్‌రాజ్ ముఖాటే వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు అల్పనాను ఆయన పెళ్లాడారు. ఈ జంట తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్‌రాజ్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రముఖ నటి సుప్రియా పిల్గావ్కర్, కుషా కపిల, తన్మయ్ భట్, జామీ లీవర్ ఈ జంటను అభినందించారు. కాగా.. యష్‌రాజ్ తన రసోదే మే కౌన్ థా మాషప్ తర్వాత ప్రసిద్ధి చెందాడు. అప్పటి నుంచి యష్‌రాజ్ వినోదభరితమైన సంగీతం, రీమిక్స్‌లు, వీడియోలను సృష్టిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అతనికి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు. డైలాగ్‌లను ఆకట్టుకునే ట్యూన్లుగా మార్చడంలో అతనిది ప్రత్యేకమైన శైలి. వినోదాత్మక కంటెంట్‌ను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గత రెండేళ్లలో అజయ్ దేవగన్, షెహనాజ్ గిల్ వంటి ప్రముఖులు కూడా యష్రాజ్తో కలిసి పనిచేశారు. View this post on Instagram A post shared by Yashraj Mukhate (@yashrajmukhate) -
Pankaj Udhas: గజల్ గంధర్వుడు
‘ముజ్ కో యారో మాఫ్ కర్నా, మై నషేమే హూ’ ‘థోడి థోడి పియా కరో’ ‘షరాబ్ చీజ్ హి ఐసీ’ ‘సబ్కో మాలూమ్ హై మై షరాబీ నహీ’ ‘చాందీ జైసా రంగ్ హై తేరా’ ‘కభీ సాయా హై కభీ ధూప్’ ‘దివారోంసే మిల్ కర్ రోనా అచ్ఛా లగ్తా హై’ ‘ఆయియే బారిషోం కా మౌసం హై’... ఒక్కటా రెండా పంకజ్ ఉధాస్ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో. గజల్స్‌ను ఎప్పుడూ వినే వాళ్లతో పాటు, ఎప్పుడూ వినని వాళ్లను కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు గజల్ మేస్ట్రో పంకజ్ ఉధాస్. ఎప్పుడూ వినని వాళ్లు ఆయన గొంతు నుంచి ఒక్కసారి గజల్ వింటే మంత్రముగ్ధులయ్యే వారు. మళ్లీ మళ్లీ వినాలని తపించేవారు. ‘ఆహత్’ ఆల్బమ్‌తో ఆనందాశ్చర్యాలకు గురి చేసిన పంకజ్ గజల్ ప్రపంచంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన భౌతికంగా దూరమైనా ప్రతి శ్రోతలో, అభిమానిలో సజీవంగా నిలిచే ఉంటాడు. గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో పుట్టిన పంకజ్ ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అన్న నిర్మల్ ఉధాస్తో ఆ ఇంట్లో గజల్ గజ్జె కట్టింది. మరో అన్న మన్హర్ ఉధాస్ బాలీవుడ్లో కొన్ని సినిమాలకు పాడాడు. తండ్రి కేశుభాయిదాస్ ప్రభుత్వ ఉద్యోగి. వైణికుడు. ప్రసిద్ధ వైణికుడు అబ్దుల్ కరీమ్ ఖాన్ దగ్గర దిల్రుబా నేర్చుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇల్లు ఒక సంగీత పాఠశాలలాగ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల పాటల నుంచి గజల్స్ వరకు ఆ ఇంట్లో ఎన్నో వినిపించేవి. రాగాలు, స్వరఝరుల గురించి చర్చ జరిగేది. తనకు ఏమాత్రం సమయం దొరికినా పంకజ్ తండ్రి దిల్రుబా వాయించేవాడు. దిల్రుబా నుంచి వచ్చే సుమధుర శబ్దతరంగాలు పంకజ్‌ను సంగీతం వైపు నడిపించాయి. ‘చక్కగా స్కూలు పాఠాలు చదువుకోకుండా ఈ సంగీత పాఠాలు నీకు ఎందుకు నాయనా’ అని తండ్రి మందలించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ తెలియదుగానీ గజల్స్ గురించి, దిల్రుబాపై వినిపించే రాగాల గురించి సందేహాలు అడిగినప్పుడు కుమారుడి సంగీతోత్సాహానికి ఆ తండ్రి మురిసిపోయేవాడు. ఒక్క సందేహం అడిగితే మూడు సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు ముగ్గురు కుమారులను రాజ్‌కోట్(గుజరాత్)లోని‘సంగీత్ అకాడమీ’ లో చేర్పించాడు. ఆ కళాశాలలో తబాలా వాయించడం నేర్చుకున్న పంకజ్ గులామ్ ఖదీర్ ఖాన్ సాహెబ్ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిగ్రీ కోసం ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరిన పంకజ్ ‘క్లాస్‌లో సైన్స్ పాఠాలు’ కాలేజీ తరువాత శాస్త్రీయ సంగీత పాఠాలపై శ్రద్ధ పెట్టేవాడు. తొలిసారిగా ‘కామ్నా’ (1972) అనే సినిమాలో పాడాడు పంకజ్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గాయకుడిగా పంకజ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ మంచి పేరు తనకు వెంటనే మరో అవకాశాన్ని తీసుకు రాలేదు. ‘ఇది కూడా మంచికే జరిగింది. పంకజ్‌కు బోలెడు అవకాశాలు వచ్చి ఉంటే తనకు అత్యంత ఇష్టమైన గజల్స్‌కు అనివార్యంగా దూరం కావాల్సి వచ్చేది’ అంటారు పంకజ్ అభిమానులు. అవకాశాల సంగతి ఎలా ఉన్నా పంకజ్‌లో గజల్స్‌పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. ‘ఉద్యోగం చెయ్ లేదా వ్యాపారం చెయ్’ లాంటి సలహాలు అదేపనిగా వినిపిస్తున్న కాలంలో ఒక అద్భుత అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. అమెరికా, కెనడాలలో పది నెలల పాటు ఉన్న పంకజ్ అక్కడ ఎన్నో గజల్ కచేరీలు చేశాడు. ‘వాహ్వా వాహ్వాల’తో కూడిన ప్రేక్షకుల చప్పట్లు అతడి ప్రతిభను ప్రశంసించే సర్టిఫికెట్లు అయ్యాయి. ఇండియాకు డబ్బులతో కాదు ఉత్సాహంతో... ఆత్మవిశ్వాసంతో వచ్చాడు. ‘గజల్స్’ కోసమే ఉర్దూ నేర్చుకున్నాడు పంకజ్. గజల్స్ గానంలో మరింత పట్టు సాధించాడు. పంకజ్ ఉధాస్ అనే శబ్దం వినబడగానే ‘గజల్’ అనేది అతడి పేరు ముందు వచ్చి మెరిసేది. 1980లో తొలి గజల్ ఆల్బమ్ ‘ఆహత్’ను తీసుకువచ్చాడు. ఈ గజల్ ఆల్బమ్ తనకు తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పదేళ్ల పోరాటం తరువాత పంకజ్ తొలి ఆల్బమ్ అనూహ్యమైన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి 50 వరకు ఆల్బమ్‌లను తీసుకువచ్చాడు. మ్యూజిక్ ఇండియా 1987లో లాంచ్ చేసిన పంకజ్ ‘షా గుఫ్తా’ మన దేశంలో కంపాక్ట్ డిస్క్‌పై రిలీజ్ అయిన తొలి ఆల్బమ్. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ఘాయల్’ సినిమా కోసం 1990లో లతా మంగేష్కర్తో కలిసి మెలోడియస్ డ్యూయెట్ పాడాడు. ఇక ‘నామ్’ సినిమాలో ‘చిఠ్ఠీ ఆయీ హై’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట సూపర్ హిట్ అయిన తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పంకజ్ ఎప్పుడూ అనుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడు. రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇచ్చాడు. బహుశా ఇలాంటి విలువలే సంగీత చరిత్రలో అతడికి సమున్నత స్థానం ఇచ్చాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కోసం ‘ఆదాబ్ అర్జ్ హై’ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాడు పంకజ్. సినిమా కోసం పాడినా, నటించినా, టీవీ షోలు నిర్వహించినా గజల్స్‌పై తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను ఎప్పుడూ కాపాడుకునేవాడు పంకజ్. అందుకే గజల్స్‌ను ప్రేమించే వాళ్ల మదిలో చిరస్థాయిగా, ఇంకో వందేళ్ళయినా సజీవంగానే ఉంటాడు. పంకజ్ ఫేవరెట్ సాంగ్ రేడియోలో వినిపించే బేగం అఖ్తర్ గానామృతానికి చాలా చిన్న వయసులోనే ఫిదా అయ్యాడు పంకజ్. ‘ఆమెది ఒక వినూత్న స్వరం’ అంటాడు. భావాలు, భావోద్వేగాలు పాటలో ఎలా పలికించాలో ఆమె గొంతు వినే నేర్చుకున్నాడు. ‘యే మొహబ్బత్ తేరే అంజామ్ సే’ తనకు ఇష్టమైన పాట. ఎప్పుడు వినాలనిపించినా వినేవాడు. పద్దెనిమిది సంవత్పరాల వయసులో పంకజ్‌కు ప్రసిద్ధ గజల్ గాయకుడు మెహదీ హాసన్‌తో పరిచయం అయింది. చాలాకాలానికి యూకే టూర్లో స్నేహితుడి ఇంట్లో హాసన్‌ను కలుసుకున్నాడు. పంకజ్ గానప్రతిభకు కితాబు ఇచ్చాడు హాసన్. ఈ కితాబు కంటే హాసన్‌తో కలిసి పర్యటించడం, అతడి గొంతును గంటల తరబడి వినడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు పంకజ్. అదర్ సైడ్ హీరో జాన్ అబ్రహం పంకజ్‌కు వీరాభిమాని. విద్యాబాలన్, జాన్ అబ్రహమ్, సమీరా రెడ్డిలాంటి వారికి తన మ్యూజిక్ వీడియోలతో బ్రేక్ ఇచ్చాడు పంకజ్. ఎప్పుడూ సంగీత ప్రపంచంలో తేలియాడినట్లు కనిపించే పంకజ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీలలో బాగా ఆడేవాడు. పంకజ్ ఫేవరెట్ బౌలర్ బీఎస్ చంద్రశేఖర్. సంగీతం తప్ప ఏమీ తెలియనట్లు ఉండే పంకజ్ మ్యాచ్‌లకు సంబంధించి చేసే విశ్లేషణ ఆకట్టుకునేది. ‘మీరు క్రికెట్ వ్యాఖ్యాతగా బ్రహ్మాండంగా రాణించవచ్చు’ అని సరదాగా అనేవారు సన్నిహితులు. పంకజ్‌ను చూసీచూడగానే అంతర్ముఖుడు(ఇంట్రావర్ట్) అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా సరదా మనిషి అని, చుట్టు పక్కల వాళ్లను తెగ నవ్విస్తారని చెబుతుంటారు సన్నిహితులు. డాక్టర్ కావాలనేది పంకజ్ చిన్నప్పటి కల. అయితే సంగీతం అతడిని వేరే దారిలోకి తీసుకువెళ్లింది. డాక్టర్ కాకపోయినా ఆయన పాడే గజల్స్ ఔషధాలలాగే పనిచేసి మనసుకు స్వస్థతను చేకూరుస్తాయి. ముక్కు సూటి మనిషి సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ‘నిక్కచ్చిగా మాట్లాడే ధోరణి’ ఉండకూడదు అంటారు. అయితే పంకజ్ మాత్రం ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. బాలీవుడ్ మ్యూజిక్ ప్రస్తావన వస్తే.... ‘మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. నాన్–ఫిల్మ్ మ్యూజిక్‌ను పట్టించుకోవడం లేదు. సర్వం బాలీవుడ్ అన్నట్లుగా ఉంది. బాలీవుడ్లో తొంభై శాతం మ్యూజిక్ హిప్ హాప్, పంజాబీ, ర్యాప్. ఆర్డీ బర్మన్ క్లాసిక్స్లాంటివి ఇప్పడు వినే పరిస్థితి లేదు. పాటలు స్క్రీన్‌ప్లేలో భాగంగా ఉండడం లేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా ఉంటున్నాయి. బాలీవుడ్‌లోని ఒకప్పటి స్వర్ణ శకం తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాలీవుడ్ గాయకుల్లో పాప్ సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఖవ్వాలి ఎవ్వరికీ పట్టని కళ అయింది’ అని నిట్టూర్చేవాడు పంకజ్. -
Talat Mahmood: ఆ చిరు లేత గానానికి నూరేళ్లు
జల్తే హై జిస్కే లియే... ఆ పాట చిరుకెరటాల అలికిడిలా ఉండేది. ఫిర్ వహీ షామ్.. వహీ గమ్... ఆ గొంతు సాయం సంధ్యలో వీచే వీవెన వలే ఉండేది. సీనే మే సులగ్తే హై ఆర్మాన్... ఆ గానం పడగ్గది దీగూటిలో శిఖను కంపించే దీపంలా అనిపించేది. తలత్ మెహమూద్.. గజల్ నవాబ్. మృదుగాన చక్రవర్తి. హిందీ సినిమా గోల్డెన్ ఎరాలో వెలిగిన త్రిమూర్తులు... రఫీ, ముఖేష్, తలత్లలో ఒకడు. నేడు అతని శతజయంతి. భారతీయ సినిమా సంగీతంలో మెత్తని గొంతును ప్రవేశపెట్టి శ్రోతలను సమ్మోహితులను చేసిన తొలి గాయకుడు తలత్ మెహమూద్. అతడు గజల్ గానానికి మార్గదర్శకుడు. నిరుపమానమైన గజల్ గాయకుడు మెహదీహసన్ కు కూడా తొలిదశలో తలత్ మెహమూదే స్ఫూర్తి. తలత్ది ఘనమైన గాన చరిత్ర. అందుకే అతని శతజయంతి సందర్భం గాన ప్రియులకు వేడుక. 1941–44 మధ్య కాలంలో ‘తపన్ కుమార్’ పేరుతో కలకత్తాలో బెంగాలీ పాటలు పాడాడు తలత్. 1945లో కలకత్తాలో నిర్మితమైన ‘రాజలక్ష్మీ’ హిందీ సినిమాలో నటుడు–గాయకుడుగా తలత్ తన మెదటి సినిమా పాట ‘ఇస్ జగ్ సే కుఛ్ ఆస్ నహీన్’ పాడాడు. 1951లో ‘తరానా’లో పాడిన ‘సీనేమే సులగ్తే హైన్ అర్మా’ పాట తలత్ తొలి సినిమా హిట్ పాట. అంతకు ముందు ‘ఆర్జూ’లోని ‘ఏ దిల్ ముఝే ఏసీ జగ్హ లేచల్’ పాటా, ‘బాబుల్’ లోని ‘మేరా జీవన్ సాథీ భిఛడ్ గయా’ చెప్పుకోతగ్గవి. ‘సంగ్దిల్’ సినిమాలో తలత్ పాడిన ‘ఏ హవా.. ఏ రాత్... ఏ చాందినీ’ మన దేశంలో వచ్చిన ఒక ప్రశస్తమైన పాటగా నిలిచిపోయింది. ‘సంగ్దిల్’ సినిమాలోనే ‘కహాన్ హో కహాన్’ అంటూ తలత్ మరో గొప్ప పాట పాడాడు. ‘దాగ్’లో పాడిన ‘ఏ మేరే దిల్ కహీన్ ఔర్ చల్’ పాట దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. తలత్ పాడిన ‘బారాదరీ’ సినిమాలోని ‘తస్వీర్ బనాతా హూ’, ‘ఫుట్ పాత్’లోని ‘షామే గమ్ కీ కసమ్’, ‘ఠోకర్’లోని ‘ఏ గమే దిల్ క్యా కరూన్’, ‘దిల్–ఎ–నాదాన్’ సినిమాలోని ‘జిందగీ దేనే వాలే సున్’ పాటలూ, ఈ స్థాయి ఇంకొన్ని పాటలూ సినిమా గానంలో కాలాలు ప్రశంసించేవయ్యాయి. హిందీ సినిమా పాటల్లోనే పెద్ద పల్లవి పాట ‘ఉస్నే కహా థా’ సినిమాలోని ‘ఆహా రిమ్ జిమ్ కే యే ప్యారే ప్యారే గీత్ లియే’ తలత్ పాడాడు. అప్పటి వరకూ దేశం వింటూ వచ్చిన సైగల్ గానాన్ని మరపిస్తూ తలత్ క్రూనింగ్ (లాలిత్యమైన గానం) ఒక్కసారిగా దేశ గాన విధానాన్ని మార్చేసింది. 1944లో తలత్ పాడిన ‘తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్లాన సకే గీ’ గజల్ రికార్డ్ విడుదలయింది. విడుదలయిన నెల రోజుల్లోనే లక్షన్నరకు పైగా ప్రతులు అమ్ముడయింది. ఆ గజల్ గానం దేశ సినిమా, లలిత, గజల్ గాన పరిణామానికి, పరిణతికి, ప్రగతికి మార్గదర్శకమైంది. తలత్ 1941లో ‘సబ్ దిన్ ఏక్ సమాన్ నహీన్ థా...‘ గజల్‌ను రికార్డ్‌పై విడుదల చేశారు. ఆ తరువాత ‘గమ్ –ఎ–జిందగీ కా యారబ్ న మిలా కోఈ కినారా’ (1947), ‘సోయే హువే హేన్ చాంద్ ఔర్ తారేన్’ (1947), ‘దిల్ కీ దునియా బసా గయా’ (1948) వంటి గజళ్లతో సాగుతూ 1950వ దశాబ్దిలో ‘రోరో బీతా జీవన్ సారా’, ‘ఆగయీ ఫిర్ సే బహారేన్’, ‘చన్ ్ద లమ్హేన్ తేరీ మెహఫిల్ మేన్’ వంటి గజళ్లతో రాణించి రాజిల్లింది. బేగం అఖ్తర్ గజల్ ధోరణికి భిన్నంగా గజల్ గానం పరివర్తనమవడానికి తలత్ ముఖ్యకారణమయ్యాడు. అందుకే అతను ‘గజల్ నవాబ్’ అనిపించుకున్నాడు. గైర్–ఫిల్మీ (సినిమా పాటలు కాని) గానంగా తలత్ కృష్ణ భజన్ లు, దుర్గా ఆర్తి, నాత్‌లు, గీత్‌లు చక్కగానూ, గొప్పగానూ పాడాడు. ‘నిప్పులాంటి మనిషి’ సినిమాలోని ‘స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం’ పాట మనకు తెలిసిందే. ఈ పాట ‘జంజీర్’లో మన్నాడే పాడిన ‘యారీ హైన్ ఇమాన్ మేరా’ పాటకు నకలు. ఆ హిందీ పాటకు కొంత మేరకు ఆధారం ముబారక్ బేగమ్తో కలిసి తలత్ పాడిన ‘హమ్ సునాతే హైన్ మొహమ్మద్’ అన్న నాత్. ‘అమృత’ సినిమాలో ఎ.ఆర్. రహ్మాన్ చేసిన ‘ఏ దేవి వరము నీవు’ పాట పల్లవి తలత్ పాడిన గజల్ ‘రాతేన్ గుజర్ దీ హైన్’ కు దగ్గరగా ఉంటుంది. తలత్ మహ్మూద్ 1959లో విడుదలైన ‘మనోరమ’ తెలుగు సినిమాలో రమేష్ నాయుడు సంగీతంలో మూడు పాటలు ‘అందాల సీమ సుధా నిలయం’, ‘గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి’, ‘మరిచిపోయేవేమో ’ పాడాడు. అంతకు ముందు తెలుగువారైన ఈమని శంకరశాస్త్రి సంగీతంలో1951లో ‘సంసార్’ హిందీ సినిమాలో ‘మిట్ నహీన్ సక్తా’, ‘యే సంసార్ యే సంసార్ ప్రీత్ భరా సంసార్’ పాటలూ, 1952లో వచ్చిన ‘మిస్టర్ సంపత్’ సినిమాలో ‘ఓ మృగనయనీ...‘, ‘హే భగవాన్’ పాటలూ పాడారు. హిందీలోకి డబ్ ఐన తెలుగు సినిమాలు ‘పాతాళభైరవి’, ‘చండీరాణి’ సినిమాలలో ఎన్.టి.రామారావుకు తలత్ పాడారు. 1964లో వచ్చిన ‘జహాన్ ఆరా’ సినిమాలోని ‘ఫిర్ వోహీ షామ్...‘ పాట తరువాత తలత్ చెప్పుకోతగ్గ పాటలు పాడలేదు. అంతకు ముందు 1963లో ‘రుస్తమ్ సొహరాబ్’ సినిమాలో తలత్ ‘మాజన్దరాన్ మాజన్దరాన్’ అంటూ ఒక విశేషమైన పాట పాడాడు. తలత్ పాడిన చివరి గొప్ప సినిమా పాట అది. అన్నీ కలుపుకుని తలత్ మొత్తం 747 పాటలు పాడాడు. తలత్ 16 సినిమాల్లో నటించాడు. పలు పురస్కారాలతో పాటు 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు తలత్. 1924 ఫిబ్రవరి 24న పుట్టిన తలత్ 1998లో తది శ్వాస విడిచాడు. తలత్ క్రూనింగ్ను దక్షిణ భారతదేశంలో పి.బి. శ్రీనివాస్ అర్థం చేసుకుని అందుకుని అమలు చేశారు. పి.బి. శ్రీనివాస్ నుండి అది కె.జె.ఏసుదాస్‌కు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు, ఇతరులకూ చేరింది. మనదేశంలో క్రూనింగ్ ఉంది అంటే అది తలత్ మెహమూద్ వచ్చింది అన్నది చారిత్రికం. 1968లో అమెరికాలో జరిగిన ఒక టాక్ షోలో తలత్‌ను ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు ఫ్రాంక్ సినాట్రాతో పోల్చి ‘ఫ్రాంక్ సినాట్రా ఆఫ్ ఇండియా‘ అని అన్నారు. ఇవాళ్టికీ దేశ వ్యాప్తంగా తలత్ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి; ఎప్పటికీ మన దేశంలో తలత్ గానం వినిపిస్తూనే ఉంటుంది. ఒక మెత్తని పాటలా తలత్ ఈ మట్టిపై వీస్తూనే ఉంటాడు. – రోచిష్మాన్ -
నటుడి నగ్న ఫోటోలు.. మీరు అలా ఎందుకు చేయకూడదు?
గతంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నగ్నంగా ఓ మేగజైన్ కవర్ ఫోటోగా ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఆయన బాటలోనే మరో బాలీవుడ్ నటుడు కనిపించి అందరికీ షాకిచ్చాడు. గతేడాది విద్యుత్ జమ్వాల్ తన పుట్టిన రోజు సందర్భంగా హిమాలయల్లో నగ్నంగా కనిపిస్తూ ఉన్న ఫోటోలను పంచుకున్నారు. అతని ఫోటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వచ్చాయి. కొందరు విమర్శించగా.. మరికొందరు మద్దతుగా పోస్టులు పెట్టారు. తాజాగా విద్యుత జమ్వాల్ ఆ ఫోటోలపై స్పందించారు. అలా ఉండడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. విద్యుత్ జమ్వాల్ మాట్లాడుతూ..' నాకు సొంత పనులు చేయడం అంటే చాలా ఇష్టం. నాకు నచ్చినట్లు లైఫ్‌ను ఎంజాయ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. ఇష్టమైన పుస్తకాన్ని చదవడం చాలా ఇష్టం. మీరు చూసిన ఈ ఫోటోలు నేను గత 14 ఏళ్లుగా సందర్శించిన వాటిలో ఒక భాగం మాత్రమే. ఈ విషయంలో నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ నగ్నంగా ఉండి తమ కోసం సమయం ఎందుకు కేటాయించకూడదు. మీరు అలా చేస్తే ఈ ప్రపంచంలో సిగ్గుపడని ఏకైక వ్యక్తి మీరు మాత్రమే.' అని అన్నారు. మీ నగ్న చిత్రాలపై వచ్చిన కామెంట్స్ బాధించాయా అని ప్రశ్నించగా.. 'ఇలాంటి చిన్న విషయాలు కేవలం దోమ కుట్టినట్లుగా మాత్రమే అనిపిస్తాయని అన్నారు. ఇలాంటి విమర్శలు నన్ను ఏ విధంగా బాధించవని చెప్పారు. ఎందుకంటే అది తన గురించి ఒకరి అభిప్రాయం మాత్రమేనని కొట్టిపారేశారు. కాగా.. విద్యుత్ జమ్వాల్ ప్రస్తుతం క్రాక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. My retreat to the Himalayan ranges - “the abode of the divine” started 14 years ago. Before I realised, it became an integral part of my life to spend 7-10 days alone- every year. pic.twitter.com/HRQTYtjk6y — Vidyut Jammwal (@VidyutJammwal) December 10, 2023 -
హిట్ కొట్టారు సరే.. కానీ ఆ స్టార్స్‌ను మరిపిస్తారా?
గత కొన్నేళ్లుగా దక్షిణాది చిత్రాలు విజయాల సంఖ్య బాగానే పెరిగిందనే చెప్పాలి. కొన్ని భారీ చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టి చిత్ర పరిశ్రమ మనుగడకు అండగా నిలిచాయి. ముఖ్యంగా దక్షిణాది సినీతారలు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ విశేషం. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ తొలిసారిగా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్ సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారా దక్షిణాది లేడీస్ సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. దర్శకుడు అట్లీ, నటి నయనతార, నటుడు విజయ్ సేతుపతికి అక్కడ జవాన్ చిత్రం మైల్‌స్టోన్‌గా మిగిలింది. అంతకు ముందు వరకు దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు పాన్ ఇండియా కథానాయకిగా తన స్థాయిని విస్తరించుకున్నారు. మరోవైపు డిసెంబర్ 1 విడుదలైన యానిమల్ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించగా.. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అయితే సందీప్‌కు హిందీలో ఇదే తొలి చిత్రం కాగా.. నటి రష్మికకు మూడవ చిత్రం కావడం గమనార్హం. ఈమె ఇంతకు ముందే నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. అయినా నటి రష్మిక మందన్నకు నటిగా మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇక్కడ విజయమే కొలమానం కాబట్టి యానిమల్ చిత్ర విజయం ఈమెకు చాలా కీలకంగా మారింది. కాగా ఈ చిత్ర విషయం రష్మికలో నూతనోత్సాహం వచ్చిందనే చెప్పాలి. గతంలో వహిదా రెహమాన్, హేమమాలిని, శ్రీదేవి వంటి నటీమణులు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా రాణించారు. ఇటీవల నటి దీపికా పదుకొణె లాంటి బాలీవుడ్ తారలు టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్నా ఆ స్థాయిలో పేరు రాలేదు. కాగా ఈ ఏడాది విడుదలైన దక్షిణాది హీరోయిన్లు నటించిన రెండు హిందీ చిత్రాలు సంచలన విజయాలను సాధించడంతో రష్మిక, నయనతారలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. అలాగని ఈ ఇద్దరికి హిందీలో కొత్తగా అవకాశాలేమీ రాలేదు. రష్మిక తెలుగులో, నయనతార తమిళంలో వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. -
అందుకే నా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి: సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ హీరోగా ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో ‘ది బుల్’ అనే సినిమా తెరకెక్కనుంది. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మార్చిలో ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో పారా మిలిటరీ ఆఫీసర్‌గా సల్మాన్ ఖాన్ నటిస్తారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక తన సినిమాల వైఫల్యాల (‘అంతిమ్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లను ఉద్దేశిస్తూ..) గురించి కూడా సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నా సినిమాలు విడుదలైనప్పుడు, ఆ సినిమాల టికెట్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ధరలతో విడుదల చేస్తే ఆ సినిమాల కలెక్షన్స్ కూడా భారీగానే ఉంటాయి. నా తర్వాతి సినిమాను అలాగే రిలీజ్ చేయాలనుకుంటున్నాను’ అని సల్మాన్ అన్నారు. అంతేకాదు.. తక్కువ సినిమా టికెట్ ధరలతో ప్రజల డబ్బును మేం సేవ్ చేస్తున్న విషయం అందరికీ సరిగ్గా అర్థం కావడం లేదని కూడా సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. -
'మొదటిసారి అక్కడే కలుసుకున్నాం'.. ప్రియురాలితో పెళ్లిపై రణ్‌దీప్!
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా పెళ్లిబంధంలోకి అడుగు పెడుతున్నారు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను నవంబర్ 29న పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సరదాగా కనిపించారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ప్రియురాలి సంప్రదాయంలోనే వీరి పెళ్లి వేడుక జరగబోతోంది. మరి కొన్ని గంటల్లో మూడుముళ్లతో ఒక్కటి కాబోతున్న ఈ జంట పెళ్లికి ముందు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లిన్ లైష్రామ్ పెళ్లికి ముందు ఎలా కలుసుకున్నారో రణ్‌దీప్ గుర్తు చేసుకున్నారు రణ్‌దీప్ మాట్లాడుతూ.. 'వధువు సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం మాత్రమే గౌరవప్రదమని నేను భావించా. మైటీ సంప్రదాయం ప్రకారం ప్రేమ వివాహాల్లో వరుడు చాలా సేపు కూర్చోవాలని విన్నా. ఆ సంప్రదాయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా జీవిత భాగస్వామి సంస్కృతిపై గౌరవంతోనే ఈ రోజు ఇక్కడ ఉన్నా. మణిపురి సంప్రదాయాలను ఆస్వాదిస్తున్నా. నేను, లిన్ మణిపురి సంస్కృతి గురించి మాట్లాడుకునేవాళ్లం. భవిష్యత్తులో మా జంట పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. రణదీప్, లిన్ ప్రేమకథ లిన్ లైష్రామ్‌తో పరిచయంపై చెబుతూ.. 'మేము చాలా కాలంగా స్నేహితులం. థియేటర్లలో ఉన్నప్పుడే కలిశాం. మా మధ్య మంచి స్నేహం ఉంది. అదే ఇప్పుడు పెళ్లిబంధంగా మారింది' అని అన్నారు. కాగా.. నసీరుద్దీన్ షా థియేటర్ గ్రూప్‌లో రణదీప్‌ను కలిశానని లిన్ తెలిపింది. అక్కడ రణదీప్ తన సీనియర్ అని వెల్లడించింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఇవాళ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. -
లేటు వయసులో పెళ్లి పీటలెక్కనున్న హీరో..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 2001లో మాన్సూన్ వెడ్డింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్టెయిల్, కిక్ (బాలీవుడ్), రసియా, హైవే , సర్బ్జిత్ లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీని తానే స్వయంగా తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో డేటింగ్లో ఉన్న బాలీవుడ్ నటుడు లేటు వయసులె పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను రణ్‌దీప్ పెళ్లి చేసుకోనున్నారు. నవంబర్ 29న మణిపూర్‌లో వీరి వివాహం జరగనుంది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే వేడుకకు హాజరు కానున్నారు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు వివాహాబంధంతో ఒక్కటి కాబోతున్నారు. డిఫరెంట్ స్టైల్లో వెడ్డింగ్! అయితే ఈ రోజుల్లో సెలబ్రిటీల పెళ్లి అంటే గ్రాండ్ డిస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ వివాహాం ఇటలీలో అలాగే జరిగింది. అయితే ఈ జంట మాత్రం అందరికంటే భిన్నంగా మహాభారతం పౌరాణిక నేపథ్యంతో వివాహాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లిన్ మణిపూర్‌కు చెందిన నటి కాగా.. తనకు కాబోయే భార్య సొంత ఊర్లోనే ఈ వేడుక జరగనుంది. మణిపూర్ సంప్రదాయంలో వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్ ప్లాన్ చేశారు. అయితే దీనిపై పెళ్లి తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. సీక్రెట్‌గా డేటింగ్! వీరిద్దరు డేటింగ్‌పై సోషల్ మీడియాలో చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ రణదీప్, లిన్ తమ రిలేషన్‌ను ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. 2022లో దీపావళి వేడుకల తర్వాత ఈ జంట తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రణ్‌దీప్ అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో ఇలియానాతో కలిసి నటిస్తున్నారు. ఆ తర్వాత స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు లిన్ చివరిసారిగా కరీనా కపూర్, విజయ్ వర్మ నటించిన జానే జాన్‌లో కనిపించారు. అంతే కాకుండా ఓం శాంతి ఓం, మేరీ కోమ్, మాతృ కి బిజిలీ కా మండోలా, రంగూన్ ఆక్సోన్ వంటి చిత్రాలలో కూడా నటించారు. -
ప్రియాంక చోప్రా సినిమాలో నటించాడు.. ఇప్పటికీ పండ్లు అమ్ముతూ!
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కలల ప్రపంచం. సినిమాల్లో ఛాన్సుల కోసం ఎంతో మంది వేచి చూస్తుంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు ఇండస్ట్రీలో తన టాలెంట్‌లో ముందుకు దూసుకుపోతుంటారు. అలా స్టార్స్ పక్కన నటించడమంటే ఇక వాళ్ల కెరీర్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ కొందరు మాత్రం స్టార్స్ సినిమాల్లో అవకాశాలొచ్చినా.. తమ వృత్తిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి వ్యక్తే ఈ సోలంకి దివాకర్. బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సోలంకి తన వృత్తిలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్, ది వైట్ టైగర్, సోంచిరియా లాంటి చిత్రాలలో సోలంకి దివాకర్ నటించారు. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన పండ్ల వ్యాపారంలోనే కొనసాగుతున్నారు. అతను సినిమాల్లోకి రాకముందు వృత్తి రీత్యా పండ్ల వ్యాపారి. ఢిల్లీలో 10 సంవత్సరాలుగా పండ్లు విక్రయిస్తున్నారు. నటనపై ఇష్టం ఉన్న సోలంకి సినిమాల్లోకి వచ్చాడు. అయితే లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో కుటుంబ పోషణ కోసం పండ్ల వ్యాపారం చేసినట్లు వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సోలంకి మాట్లాడుతూ..'నటన అంటే నాకు మొదటి నుంచే ప్రేమ. నా స్వస్థలమైన అచ్నేరా (ఉత్తరప్రదేశ్‌లోని) థియేటర్లో విరామ సమయంలో పాపడ్ అమ్ముతు ఉండేవాన్ని. అప్పుడే నటన పట్ల మక్కువ పెంచుకున్నా. ఈరోజు నేను సినిమాల్లో నటించి సరిపడా డబ్బు సంపాదించలేకపోయాను. నా కుటుంబాన్ని పోషించడానికి పండ్లు అమ్ముతున్నాను. సినిమాల్లో నాకు తగినంత జీతం వస్తే పండ్లు అమ్మను. అవకాశం దొరికితే 1000 సినిమాల్లో నటించాలనుకుంటున్నా. కానీ నాకు తరచుగా పాత్రలు రావడం లేదు. దీంతో వేరే మార్గం లేనందున నేను పండ్లు అమ్మవలసి వస్తోంది' అని అన్నారు. -
అమెరికాలో ఉద్యోగం వదిలేసి సింగర్‌గా రాణిస్తున్న లిసా
‘వీరే ది వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్ సింగర్‌గా అరంగేట్రం చేసింది లీసా మిశ్రా. యూనిక్ వాయిస్‌తో ప్రేక్షకులను మెప్పించింది. తనకు ఇష్టమైన పాటలు పాడి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేసే మిశ్రా చికాగోలో డాటా–ఎనలిస్ట్‌గా ఉద్యోగం చేసింది. సంగీతాన్నే కెరీర్ చేసుకోవడానికి అమెరికా నుంచి ముంబై వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం ప్రఖ్యాత సింగర్ లేడీ గాగాతో కలిసి మ్యూజిక్ ప్రోగ్రామ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిశ్రాకు ఎనిమిది లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. తన యూట్యూబ్ చానల్‌కు మూడు లక్షలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘మ్యూజిషియన్‌గా పేరు తెచ్చుకోవడానికి నాకు యూట్యూబ్ ఎంతో ఉపయోగపడింది. నా సంగీతం ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి పరిచయం కావడానికి సోషల్ మీడియా ఉపయోగపడింది. View this post on Instagram A post shared by Kabeer Kathpalia (@oaffmusic) కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పులా, ఒత్తిడిని జయించే శక్తిలా నా సంగీతం ఉండాలనుకుంటాను. చాలామందికి మన విజయం తప్ప ఆ విజయం కోసం గతంలో పడిన కష్టం గురించి తెలియదు. దీంతో వోవర్ నైట్ సక్సెస్ అంటుంటారు’ అంటుంది సింగర్–సాంగ్ రైటర్ లీసా మిశ్రా. View this post on Instagram A post shared by Lisa Mishra (@lisamishramusic) -
ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే టాలీవుడ్లో ఇప్పటికే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడనున్నారు. తాజాగా మరో బాలీవుడ్ జంట సైతం పెళ్లి పీటలెక్కెందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా.. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌ను ఈనెలలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. అయితే రణదీప్, లిన్ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ముంబైలోనే వివాహ వేడుకలు జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాతే ఈ జంట రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అప్పటివరకు వీరిద్దరు తమ రిలేషన్‌ను సీక్రెట్‌గానే ఉంచునున్నారు. కాగా.. లిన్ మణిపూర్‌కు చెందిన లిన్ మోడల్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గతేడాది జరిగిన దీపావళి వేడుకల సందర్బంగా తమ రిలేషన్‌ను ప్రకటించారు. లిన్ బర్త్ డే వేడుకల్లోనూ రణ్‌దీప్ హుడా కనిపించారు. సుస్మితా సేన్‌తో డేటింగ్! అయితే రణ్‌దీప్ గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. 2004లో సుస్మితాసేన్‌తో డేటింగ్లో ఉన్న రణ్‌దీప్ 2006లో విడిపోయారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాము విడిపోవడమే ఉత్తమమైన నిర్ణయమని వెల్లడించారు. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతున్న లిన్, రణ్‌దీప్ మధ్య దాదాపు పదేళ్ల వయసు తేడా ఉంది. ప్రస్తుతం రణ్‌దీప్‌కు 47 ఏళ్లు కాగా.. లిన్ 37 ఏళ్ల వయసులో ఉన్నారు. కాగా.. ప్రస్తుతం రణ్‌దీప్ హుడా అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో ఇలియానాతో కలిసి నటించనున్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఆ తర్వాత రణదీప్ లాల్ రంగ్ 2: ఖూన్ చుస్వాలో కనిపించనున్నారు. మరోవైపు.. లిన్ చివరిసారిగా కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ నటించిన జానే జాన్‌లో కనిపించారు. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, మాతృ కి బిజిలీ కా మండోలా, రంగూన్, ఆక్సోన్ వంటి చిత్రాలలో లిన్ నటించారు. View this post on Instagram A post shared by Lin Laishram (@linlaishram) -
ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటుడు!
యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటుడు అలీ మర్చంట్. తాజాగా తన చిరకాల స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని వివాహం చేసుకున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అలీ.. ముచ్చటగా మూడోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!) వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. సినీతారల కోసం ప్రత్యేకంగా నవంబర్ 15 న ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. కాగా.. అలీ మర్చంట్ ఇంతకుముందే నటి సారా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే విడిపోయారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్‌ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. తాజాగా మూడోసారి తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు. కాగా.. అలీ 'యే రిష్తా క్యా కెహ్లతా హై', 'బాందిని', 'యే హై ఆషికి' వంటి సీరియల్స్‌లో నటించారు. అంతే కాకుండా లాక్అప్ -1 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆయన భార్య ఆండ్లీబ్ మోడల్‌గా రాణిస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్!) View this post on Instagram A post shared by Ali Mercchant (@alimercchant) -
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. ఇంత వైల్డ్ ఏంట్రా బాబు!
ఇటీవలే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీతో అలరించిన నటి భూమి ఫడ్నేకర్. తాజాగా అర్జున్ కపూర్ సరసన ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఉద్వేగభరితమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్, భూమి ఫడ్నేకర్ మధ్య శృంగార సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. కొన్ని సీన్స్ అయితే మరింత వైల్డ్‌గా చూపించినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అర్జున్ కపూర్‌కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ది లేడీ కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 3న థియేటర్లలోకి రానుంది. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించనుంది. అర్జున్ చివరిసారిగా ఏక్ విలన్ రిటర్న్స్‌లో కనిపించాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో జాన్ అబ్రహం, తారా సుతారియా, దిశా పటాని నటించారు. మరోవైపు భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీలతో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం ఇటీవలే రిలీజైంది. -
టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న చిత్రం టైగర్-2. టైగర్ ఫ్రాంచైజీలో ఏక్తా టైగర్ వంటి సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన మరో చిత్రం టైగర్- 3. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబరు 12న విడుదల కానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. ఇందులో కత్రినా కైఫ్ కూడా భారీ యాక్షన్ సీన్స్‌లలో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తుండటం విశేషం. అయితే ఈ ట్రైలర్లో చూపించిన బాత్ టవల్ ఫైట్ హైలెట్‌గా కనిపించింది. (ఇది చదవండి: ప్రముఖ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోనున్న నటి ప్రగతి) తాజాగా మూవీ ప్రమోషన్స్ ఆ సీన్‌తోనే షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఆ సీన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఈ సీక్వెన్స్‌తో రూ.1000 కోట్లు ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైట్ చేసింది ఆమెనే.. అయితే ఈ బాత్ టవల్ ఫైటింగ్ సీక్వెన్స్‌లో.. కత్రినాతో ఫైట్ చేసింది ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ లీ. తాజాగా ఆమె ప్రత్యేకంగా దీని గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ సీన్ కోసం తామిద్దరం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. తామిద్దరు కలిసి రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసినట్లు ఆమె తెలిపింది. బాడీ కవర్ అయ్యేలా టవల్స్‌ను హ్యాండిల్ చేయడం బిగ్ ఛాలెంజ్‌గా అనిపించిందని పేర్కొంది. (ఇది చదవండి: గయ్యాళి గుండమ్మకు వందేళ్లు.. నమ్మినవాళ్లే మోసం చేయడంతో..!) అంతే కాకుండా ఓ చిన్న సీన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడంపై ఆశ్చర్యం కలగలేదని చెప్పింది మిచెల్. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని తెలిపింది. అసలీ ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాన్ని ఎలా చేయాలి, కొత్తగా ఎలా చేస్తే ప్రేక్షకులకు మరింత బాగా కనెక్ట్ అవుతుందనే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ కూడా చేసినట్లు చెప్పింది. ఈ టైగర్-3 దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. Katrina’s Towel fight is gonna get #Tiger3 1000CR. 💥💥💥💥 #Tiger3Trailer #KatrinaKaif #SalmanKhan pic.twitter.com/mBIv6LPG3J — SuperNest (@supernest_) October 16, 2023 -
ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్ అభిషేక్ మల్హాన్. ఇటీవలే తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన జీవితంలో మొదటిసారి పెద్దమొత్తంలో నగదును వెంట తీసుకెళ్తున్నట్లు వీడియోలో వెల్లడించాడు. రూ. 1.5 లక్షలతో ఐఫోన్ కొనాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) అభిషేక్ వీడియోలో మాట్లాడుతూ.. "నేను నా జీవితంలో ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎప్పుడూ తీసుకువెళ్లలేదు. ఈ సమయంలో నా హృదయం బాధతో ఉప్పొంగిపోతోంది. నా డబ్బు ఎలా పోయిందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆ డబ్బులతో ఒక ఐఫోన్‌ని కొనుగోలు చేయాలనుకున్నా. కానీ ప్రస్తుతం ఆ నగదు నా వద్ద లేదు. డబ్బుతో జాగ్రత్తగా ఉండమని మా నాన్న చాలా సార్లు చెప్పారు. నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటానని అనుకోలేదు. ఇది తలుచుకుంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నా" అంటూ పోస్ట్ చేశారు. కాగా.. అభిషేక్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2లో మొదటి రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లతో తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!) -
రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో మేనల్లుడు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు, అమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాను త్వరలోనే సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అతను చివరిగా కంగనా రనౌత్‌తో కలిసి 2015లో విడుదలైన కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఆదివారం ముంబయిలో జరిగిన ముంబయిలో జరిగిన ఐఎఫ్‌పీ ఫెస్టివల్ సీజన్ -13 ముఖ్య అతిథిగా హాజరైన ఇమ్రాన్ ఖాన్ తన పునరాగమనంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. "రీ ఎంట్రీపై నా దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. కానీ ప్రస్తుతం స్క్రిప్ట్‌లను చదువుతున్నా. బాలీవుడ్ చిత్రనిర్మాతలతోనూ మాట్లాడుతున్నా. వచ్చే ఏడాది రీ ఎంట్రీ ఉంటుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. సినిమాల గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'సినిమాలను చూడటం, హీరోల నుంచి ప్రేరణ పొందడం వల్ల ప్రేక్షకుల నుంచి తనకు ప్రశంసలు వచ్చాయి. సినిమా చూస్తున్న అనుభూతిని ఆస్వాదించానని.. ఈ ప్రపంచంతో తాను భావోద్వేగాలతో ముడిపడి ఉన్నట్లు చెప్పాడు. నా చిన్నప్పుడు సినిమాలు చూసి ఆనందించాను. నాకు 8 ఏళ్ల వయస్సులో ఇండియానా జోన్స్ చూడటం ఇప్పటికీ గుర్తుంది. అది నా మనసును కదిలించింది. నేను ఇండియానా జోన్స్ హీరో లాగే గోధుమ రంగు లెదర్ జాకెట్ కొన్నాను. ఇదే నేను ఓ హీరోని అనుకరించడానికి ప్రయత్నించిన తొలి జ్ఞాపకం" అని గుర్తు చేసుకున్నారు. తన సినిమా 'జానే తు యా జానే నా' సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 80వ దశకంలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ లాంటి యాక్షన్ చిత్రాలు ఉండేవి.. ఇండియన్ సినిమాలో ఈ పాత్రలు తక్కువగా ఉన్నాయని నేను భావించానని తెలిపారు. కాగా.. ఇటీవలే ఇమ్రాన్ అబ్బాస్ టైర్వాలాతో వెబ్ సిరీస్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) -
ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలా రోజుల తర్వాత తన మొహాన్ని ప్రేక్షకులను చూపించారు. ఆయన నటించిన తాజా చిత్రం యూటీ69. తన జీవితం ఆధారంగానే ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా యూటీ69 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాజ్ కుంద్రా మాట్లాడారు. వారికి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు హాజరైన రాజ్‌కుంద్రా మీడియా ప్రతినిధులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియాలో రెండు మాత్రమే ప్రధానంగా అమ్ముడవుతాయి.. అందులో ఒకటి షారుక్ ఖాన్ అయితే.. మరొకటి శృంగారం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొహాన్ని మీడియాకు చూపించారు. ఇన్ని రోజులు ఎక్కడ చూసినా మాస్క్ లేదా హెల్మెట్ ధరించి కనిపించారు. అంతే కాకుండా పోర్న్ కేసు తన కుటుంబంపై చాలా ప్రభావం చూపిందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజ్ కుంద్రా ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'ఇది నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితం ఎంతో అయోమయంగా మారింది. అందులోని ఒక భాగాన్ని ఈ సినిమా ద్వారా మీతో పంచుకుంటున్నా.' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. 2021లో పోర్న్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. -
సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్!
మైనే ప్యార్ కియా (తెలుగులో ప్రేమ పావురాలు) సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ కిసీ కీ జాన్ చిత్రంలో కనిపించింది. అంతేకాక గతేడాది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాదిలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన చత్రపతి చిత్రంలోనూ కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భాగ్యశ్రీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో పనిచేసేవారు మంచి వ్యక్తులు కాదని ప్రజలు భావిస్తారని అన్నారు. అయితే వారి అభిప్రాయాల కారణంగా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని భాగ్యశ్రీ చెప్పింది. ఇలాంటివి ఆమెను ఎలా ప్రభావితం చేస్తాయనే అనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకుంది. (ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి) బాలీవుడ్లో ఉన్న అభిప్రాయాల గురించి అడిగినప్పుడు, భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'బాలీవుడ్లో పనిచేసే వ్యక్తులు మంచి వ్యక్తులు కాదనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఈ విషయంలో మనం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉండాలి. ఎవరైనా వంట చేస్తున్నట్టు లేదా శుభ్రం చేస్తున్నట్టు సోషల్ మీడియా పోస్ట్ చేస్తే.. ప్రజలు వాటికి కూడా.. 'మీరు అవన్నీ చేయకూడదు, ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా' అని సలహాలిస్తారు. నిజంగా చెప్పాలంటే మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. మన ఆహారం మనమే వండుకోవాలి. మేము మీలాగా సాధారణ మనుషులమే. కానీ ప్రజలు మరింత రూడ్‌గా, సున్నితంగా మారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుందని' ఆమె అన్నారు. గతంలో సినిమాలపై భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'నేను 80వ దశకంలో బాలీవుడ్లో అరంగేట్రం చేశా. సినిమాల్లోకి ప్రవేశించినప్పుడే ఇలాంటి భావం ప్రజల్లో అప్పటికే ఉంది. సినిమాలు చాలా చెడ్డ ప్రపంచం. మంచి కుటుంబం నుంచి వచ్చిన ఏ వ్యక్తిని చిత్ర పరిశ్రమకు వెళ్లనివ్వరు. ఇలాంటి అభిప్రాయం 30 సంవత్సరాల క్రితమే చూశా. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రస్తుతం సెట్ డిజైనింగ్ నుంచి మేకప్ వరకు ప్రతి అంశంలోనూ మహిళలు ఉన్నారు. ఇది ఎప్పటికీ పరిశ్రమలో ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నా.' అని అన్నారు. భాగ్యశ్రీ ప్రస్తుతం సజిని షిండే కా వైరల్ వీడియోలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రాధికా మదన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో సుబోధ్ భావే కూడా నటించారు. (ఇది చదవండి: సిద్దార్థ్ ఎమోషనల్ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్నర్ ఇదే!) -
బాలీవుడ్ మూవీలో విలన్‌గా కరీంనగర్ కుర్రాడు!
ఓటీటీలో ఇటీవల విడుదలైన ‘కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’ అనే హిందీ చిత్రానికి మంచి స్పందల లభిస్తోంది.ఈ చిత్రంలో కరీంనగర్‌కు చెందిన ప్రజ్ఞన్ విలన్‌గా నటించాడు. ఒక సైకో, మల్టీ పర్సనాలిటీ... ఇలా చాలా వేరియషన్స్ ఉన్న పాత్రలో ప్రజ్ఞన్ అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ యువ నటుడు ఓ తెలుగు సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. తన తొలి చిత్రానికే మంచి గుర్తింపు రావడం పట్ల ప్రజ్ఞన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’లో చయనిక చౌదరితో కలిసి నేను నటించిన సన్ని వేశాలకు చక్కటి ప్రశంసలు వచ్చాయి. పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో శిక్షణ పొందిన పలువురు దర్శకులు ఫోన్ చేసి పశ్రంసించారు. అది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాకుండా నేను కొంతమంది దర్శకులకు ఈ సినిమా చూపించినప్పుడు చూసిన వెంటనేతెలుగు సినిమాలో ఒక ప్రముఖ హీరో సరసన అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీని గారికి ధన్యవాదాలు . మల్టీపుల్ డిజార్డర్ క్యారెక్టర్‌కి స్కోపున్న పాత్ర దొరికింది. ఒక మంచి నటుడికి ఇంత కంటే కావలసిందేముంది. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సు ముగించుకోగానేఈ అవకాశం వచ్చింది. నా తొలి చిత్రానికే ఇంతటి పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని ఆయన అన్నా రు. చాకో శామ్యూల్ దర్శకత్వం వహించిన కాలా బార్ బేరియన్ చాప్టర్ 1 చిత్రంలో వరుణ్ సింగ్ రాజ్‌పుత్, స్తుతి త్రివేది జంటగా నటించారు. -
ఒక్క పాటతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆకాశ సింగ్
డెబ్యూ పాప్ సింగిల్ ‘థగ్ రంఝా’తో సంగీత ప్రియులు ‘వాహ్వా’ అనుకునేలా చేసింది ఆకాశ సింగ్. ఈ పాట ఒక నెలలోనే 27 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ‘మోస్ట్ వాచ్డ్ ఇండియన్ వీడియో’గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ సినిమా ‘సనమ్ తేరి కసమ్’లోని ‘ఖీచ్ మేరీ ఫొటో’ పాటతో వాహ్వా వాహ్వా అనిపించేలా చేసింది. సింగర్, కంపోజర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ మీకా సింగ్‌తో తన కెరీర్ మొదలుపెట్టింది ఆకాశసింగ్. మ్యూజిక్ బ్యాండ్‌లోని పదిమందిలో తానొక్కరే అమ్మాయి. ‘ఇండియాస్ రా స్టార్’ పోటీలో పాల్గొన్న ఆకాశ గాత్రం విన్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా ‘శభాష్’ అనడమే కాదు సింగర్‌గా బాలీవుడ్లో బ్రేక్ ఇచ్చాడు. తాజాగా....‘మన్మానీ’ పాటతో ప్రశంసలు అందుకుంటుంది ఆకాశ. ‘ఇది జస్ట్ మ్యూజిక్ పీస్ కాదు. అంతకంటే ఎక్కువ. దీనిలోని ప్రేమ భావాలతో శ్రోతలు కనెక్ట్ అవుతారు. View this post on Instagram A post shared by AKASA (@akasasing) ఇందులో నా సొంత అనుభవాలు ఉన్నాయి’ అంటుంది ఆకాశ. ఆమె దృష్టిలో పాట అనేది ఇలా విని అలా మరిచిపోయేది కాదు. శ్రోతలు ఒకచోట స్థిరంగా కూర్చుంటూనే పాట రెక్కలతో విహారం చేయాలి. ఆ విహారం ఊహాల్లోకి, ప్రేమభావాల్లోకి, భవిష్యత్‌లోకి....ఎక్కడికైనా కావచ్చు. కొత్త ప్రదేశాల్లో గడపడం, కొత్త వ్యక్తులతో పరిచయం, సృజనాత్మక పనుల్లో భాగం కావడం ఆకాశ సింగ్‌కు ఇష్టమైన పని. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్‌గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!
బొమన్ ఇరానీ తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదీ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. 2003లో డర్నా మనా హై చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బొమన్ ఇరానీ.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన మున్నా భాయ్ ఎంబీబీఎస్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో విడుదలైన 3 ఇడియట్స్ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్లో అత్తారింటికీ దారేదీ మూవీతో ఫేమస్ అయ్యారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ మూవీ డంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాల్లోకి రాకముందు ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ వివరాలేంటో చుద్దాం. మధ్య తరగతి పార్సీ కుటుంబంలో జన్మించిన బోమన్ ఆరు నెలల వయస్సులోపే తండ్రిని కోల్పోయాడు. ముంబయిలో పుట్టిన పెరిగిన బొమన్ ఇరానీ.. ఆయన కుటుంబం కోసం చిన్న చిన్న పనులు కూడా చేశారు. బాలీవుడ్‌లోకి రాకముందు బొమన్ ఇరానీ తాజ్ మహల్ హోటల్లో వెయిటర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఆయన తల్లికి చిన్నపాటి చిరుతిళ్ల దుకాణం ఉండేది. అందులోనూ బొమన్ ఇరానీ పనిచేస్తూ తన తల్లికి అండగా నిలిచారు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా కూడా పనిచేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే కాకుండా తాను డైస్లెక్సియా అనే వ్యాధితో పోరాడినట్లు తెలిపారు. (ఇది చదవండి: 'నా ఇష్టం.. నేను అలాంటి సినిమాలే చేస్తా': నెటిజన్స్‌కు ఇచ్చిపడేసిన ఏక్తా కపూర్) వెయిటర్‌గా.. బోమన్ ఇరానీ మాట్లాడుతూ..' నాకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పదో తరగతి పాసయ్యాక వెయిటర్ కోర్సు చేశాను. వెయిటర్‌గా 6 నెలల కోర్సులో చేరా. వెయిటర్ ఉద్యోగం కోసం తాజ్ మహల్ హోటల్‌కు వెళ్లా. ఆ తర్వాత హోటల్లో ఆరు నెలల పాటు రూమ్ సర్వీస్‌లో పనిచేసి.. ఏడాదిన్నర తర్వాత వెయిటర్‌గా మారానని' తెలిపారు. తల్లి కోసం తన ఉద్యోగాన్ని వదిలి.. బోమన్ తల్లి ప్రమాదానికి గురికావడంతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తమ దుకాణాన్ని నడపాలని నిర్ణయించుకున్నాడు. అలా 14 ఏళ్లపాటు బోమన్ దుకాణాన్ని నడిపాడు. అదే సమయంలో వివాహం చేసుకున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. కానీ జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఉండేదని..తాను అనుకున్న లక్ష్యం కోసం శ్రమించాడు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) ఫోటోగ్రాఫర్ నుంచి నటుడిగా.. బోమన్‌కు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతని తండ్రి కూడా ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. దీంతో బోమన్ ఫోటోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. చాలా రోజుల తర్వాత బోమన్ సక్సెస్స అయ్యారు. ఆ సమయంలో ఒక స్నేహితుడు అతన్ని యాడ్‌లో నటించమని అడిగాడు. దీంతో అప్పటి నుండి అతను దాదాపు 180కి పైగా యాడ్స్‌లో కనిపించారు. ఆ తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించడానికి కూడా ఆఫర్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని నిర్మాత విధు వినోద్ చోప్రా చూశారు. ఇరానీ నటనను చూసి ఆయనకు మున్నా భాయ్ ఎంబీబీఎస్‌లో అవకాశమిచ్చారు. అలా ఆయన తన సినీ ప్రయాణం ప్రారంభించారు. ఈ మూవీ కోసం బోమన్ ఇరానికి రూ.2 లక్షలు ఆఫర్ చేశారు. ఆ తర్వాత బొమన్ ఇరానీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దృష్టిలో పడ్డారు. అందివచ్చిన అవకాశంతో బాలీవుడ్లో నో ఎంట్రీ, ఖోస్లా కా ఘోస్లా, డాన్, లగే రహో మున్నా భాయ్, 3 ఇడియట్స్, హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్, జాలీ ఎల్ఎల్బీ,ఉంచాయ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో కనిపించనున్నారు. తెలుగులోనూ అత్తారింటికీ దారేది, బెంగాల్ టైగర్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. -
'నా ఇష్టం.. నేను అలాంటి సినిమాలే చేస్తా': నెటిజన్స్‌కు ఇచ్చిపడేసిన ఏక్తా కపూర్
భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'థ్యాంక్యూ ఫర్ కమింగ్'. కరణ్ బూలానీ దర్శకత్వంలో ఏక్తాకపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే రిలీజైన ఈ అడల్ట్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో నిర్మాత ఏక్తా కపూర్ ట్విటర్ వేదికగా 'ఆస్క్ మీ ఎనిథింగ్' సెక్షన్ నిర్వహించారు. అయితే ఇందులో పాల్గొన్న నెటిజన్స్ నిర్మాతపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: నిజం కాబోతున్న సినిమా కథ.. ప్రాణాలకు ముప్పు తప్పదా?) ఓ నెటిజన్ రాస్తూ..'నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో' అంటూ కామెంట్ చేశాడు. కొందరైతే ఏకంగా.. నువ్వు, కరణ్ జోహార్ కలిసి చాలామంది చెడగొడుతున్నారు.. ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణమని పోస్ట్ చేశాడు. దీనికి ఏక్తా కపూర్ స్పందిస్తూ అవునా అని రిప్లై ఇచ్చింది. మరో నెటిజన్ రాస్తూ..దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అని విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందిస్తూ.. 'ఆ ఛాన్సే లేదు.. నేనొక అడల్ట్ కాబట్టి అలాంటి సినిమాలే చేస్తా’ అని కౌంటరిచ్చింది. నెటిజన్ల విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. (ఇది చదవండి: హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్!) కాగా.. జితేంద్ర, శోభా కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏక్తా కపూర్ సినిమాలు, సీరియల్స్‌ను కూడా నిర్మించారు. రాగిణి ఎంఎంఎస్, ది డర్టీ పిక్చర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, ఏక్ విలన్, ఉడ్తా పంజాబ్, సూపర్ సింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. -
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం.. ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే?
బాలీవుడ్లో బిగ్‌బీ పేరు తెచ్చుకున్న నటుడు అమితాబ్ బచ్చన్. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. 1970లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన దాదాపు ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా సినీరంగంలో కొనసాగుతున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఆయన పూర్తిపేరు అమితాబ్ హరివంశ్ బచ్చన్ కాగా.. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో గుర్తింపు పొందారు. అమితాబ్ బచ్చన్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో అక్టోబర్ 11, 1942లో జన్మించారు. తాజాగా 81వ వసంతంలోకి ఆయన అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి పుట్టిన రోజును జరుపుకోనున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఆమెపై సామూహిక అత్యాచారం.. బిగ్‌బాస్ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్!) అయితే ఆయన కేవలం రూ.500 జీతంతో మొదట తన కెరీర్‌ను ప్రారంభించారు. 40 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తోన్న అమితాబ్‌కు వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ అంచనాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.3,600 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలో నటించడానికి రూ.5 నుంచి 10 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నారు. కేవలం వ్యాపార ప్రకటనలకైతే దాదాపు రూ.5 కోట్లు వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా పలు స్టార్టప్ వ్యాపారాల్లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లు కూడా తెలుస్తోంది. సినిమాలు, ప్రకటనల ద్వారా ఏడాది దాదాపు రూ.60 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ముంబైలో ఖరీదైన నివాసం అమితాబ్ బచ్చన్‌కు ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన జుహు ప్రాంతంలోని జల్సా అనే బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ నివాసం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇదే కాకుండా ఆయన నగరంలో మరో మూడు బంగ్లాలు ఉన్నాయి. వీటి విలువ సైతం కోట్ల రూపాయల్లో ఉంటుంది. (ఇది చదవండి: నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్) అంతే కాకుండా ఆయన గ్యారేజీ ప్రముఖ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు ఉన్నాయి. లెక్సస్, రోల్స్ రాయిస్, బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ లాంటి ప్రముఖ బ్రాండ్స్‌తో పాటు దాదాపు 10కి పైగా ఖరీదైన కార్లు కొనుగోలు చేశారు. ఆయనకు రూ.260 కోట్లు విలువచేసే ప్రత్యేకమైన జెట్ విమానం కూడా ఉంది. కాగా.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898ఏడీ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో గణపత్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
'మీరు తప్పకుండా మా సలహా పాటించండి'.. స్టార్ హీరో విజ్ఞప్తి!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. దంగల్ సినిమాతో దక్షిణాదిలోనూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో సినిమాలతో బిజీగా అన్న హీరో.. తాజాగా తన కూతురు ఐరా ఖాన్‌తో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు సలహాలు ఇచ్చారు. ఎవరైనా సరే మానసిక ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. అంతేకాకుండా మెరుగైన సలహాల కోసం నిపుణులను సంప్రదించమని విజ్ఞప్తి చేశారు. కాగా.. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. అమీర్ ఖాన్ మాట్లాడుతూ..' వైద్యుడైనా, ఉపాధ్యాయుడు, వడ్రంగి అయినా రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి సహాయం కోసం మనం వెళ్లాల్సిందే. ఈ ప్రపంచంలో మనం చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. వాటికి నిపుణుల సహాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాదే ప్రతి మనిషి తమ మానసిక పరిస్థితి బాగా లేకపోతే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో సిగ్గపడొద్దు. మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం పొందండి. గతంలో నా కుమార్తె ఇరా, నేను ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాం. అందుకే చికిత్స తీసుకున్నాం. మీరు కూడా తప్పకుండా నా సలహా పాటిస్తారని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్' అని అన్నారు. కాగా.. ఐరా ఖాన్ కొన్నేళ్ల క్రితమే ఆమె అగాట్సు అనే ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణను పెంపొందించడం ఐరా ఖాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ఇరా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇరా గతంలో డిప్రెషన్‌తో తన బాధపడినట్లు తన అనుభవాన్ని పంచుకుంది. అగట్సు ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా కష్ట సమయాల్లో అవసరమైన వారికి సహాయం చేయడమే లక్ష్యమని ఐరా చెబుతోంది. కాగా.. అమీర్ ప్రస్తుతం లాపటా లేడీస్, లాహోర్ 1947 చిత్రాలను నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రముఖ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నుస్రత్ బరుచ్చా ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన బాలీవుడ్ భామ ఆ దేశంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం అక్కడ భీకర యుద్ధం కొనసాగుతుండడంతో ఆమెతో కమ్యునికేషన్ సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను ఎక్కడో ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఆమె నిన్న మధ్యాహ్నం చివరిసారిగా తన బృందంలోని ఒకరితో మాట్లాడుతూ.. ఓ బేస్మెంట్లో దాక్కున్నట్లు తెలిపింది. నుస్రత్ బరుచ్చా చివరిసారిగా అకెలీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె 2021లో విడుదలైన చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చోరీ- 2 అనే హారర్ చిత్రంలో నటిస్తోంది. నుస్రత్ భరూచా 2010లో తెలుగులో ‘తాజ్ మహాల్’ అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రంలో నటించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు ప్రస్తుతం హమాస్ దాడులతో ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. దీంతో హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైతం యుద్ధానికి దిగింది. దీంతో పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. కాగా.. ఈ దాడుల్లో ఇప్పటికే వందలమంది ప్రాణాలు కోల్పోయారు. -
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్‌లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్‌లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్‌లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్‌నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్‌లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్‌ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్‌తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్‌కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తండ్రి కాబోతున్న మీర్జాపూర్ నటుడు..!
మిర్జాపూర్ వెబ్ సిరీస్ నటుడు విక్రాంత్ మాస్సే తండ్రి కాబోతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో శీతల్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకున్న విక్రాంత్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట.. ఆ తర్వాత 2019 నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ వార్తలపై విక్రాంత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. గ్యాస్‌లైట్, ఫోరెన్సిక్, గిన్ని వెడ్స్ సన్నీ, ముంబైకర్, లవ్ హాస్టల్ లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన భార్య సీతల్ ఠాకూర్ పంజాబీ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో వచ్చిన బ్రిజ్ మోహన్ అమర్ రహే అనే చిత్రం ద్వారా హిందీలోనూ ఎంట్రీ ఇచ్చింది. (ఇది చదవండి: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో నటుడు నవదీప్ పేరు) విక్రాంత్ మాస్సే సినిమాలు విక్రాంత్ ఇటీవలే 'మేడ్ ఇన్ హెవెన్', 'గ్యాస్‌లైట్' 'ముంబైకర్'లో కనిపించాడు. ఈ ఏడాదిలో 'యార్ జిగ్రీ', 'సెక్టర్ 36', '12 ఫెయిల్' , 'ఆయీ హసీన్ దిల్రుబా' చిత్రాలలో కనిపించనున్నారు. మరోవైపు శీతల్ ఠాకూర్ 'బ్రిజ్ మోహన్ అమర్ రహే', 'ఛప్పర్ ఫాద్ కే' వంటి అనేక సినిమాలు, వెబ్ షోలలో పని చేశారు. 2018లో విడుదలైన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' వెబ్ సిరీస్‌లో విక్రాంత్‌తో కలిసి నటించారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్ సెట్స్‌లో ప్రేమలో పడ్డారు. కాగా.. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో బబ్లూ పండిట్ అనే పాత్రలో నటించారు. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటుడు రియో కపాడియా(66) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సప్నే సుహానే లడక్పాన్ కే, మహాభారత్ సీరియల్స్‌లోనూ నటించారు. దిల్ చాహ్తా హై, చక్ దే ఇండియా, మర్దానీ చిత్రాల్లో కనిపించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రియో మృతి పట్ల సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సంతాపం ప్రకటించింది. కపాడియా బాలీవుడ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. షారుక్ ఖాన్ నటించిన చక్ దే ఇండియాలో చిత్రంలో కనిపించారు. ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్- 2 అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ తండ్రిగా నటించారు. దాదాపు మూడు దశాబ్దాల తన కెరీర్లో కుటుంబం, జుద్వా రాజా, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. మహాభారతం సీరియల్లో గంధర్ రాజు పాత్రకు ప్రశంసలు అందుకున్నారు. CINTAA expresses its condolences on the demise of Rio Kapadia (Member since 2004) .#condolence #condolencias #restinpeace #rip #RioKapadia #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/d6GOLdtUZu — CINTAA_Official (@CintaaOfficial) September 14, 2023 -
పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో కుమార్తె.. డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడనుంది. గతేడాది సెప్టెంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. రెండేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2020లో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాలో ఇద్దరు కలిసి ఉన్న రొమాంటిక్ పిక్స్ షేర్ చేశారు. (ఇది చదవండి: 7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్’ సరికొత్త రికార్డు) ఉదయ్‌పూర్‌లో పెళ్లిసందడి ఈ ప్రేమ జంట రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగే వేడుక కోసం ఇప్పటికే ప్లాన్ చేసినట్లు సమాచారం. అమీర్ ఖాన్ సైతం తన కుమార్తె వివాహా వేడుక కోసం ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం జరిగి ఇప్పటికే ఏడాది పూర్తి కావడంతో పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేశారు. 26 ఏళ్ల ఐరా తన పెళ్లి ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జనవరి 3వ తేదీన పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు వివరించింది. ఐరా మాట్లాడుతూ..'మేం జనవరి 3న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఏ సంవత్సరం అనేది మేము నిర్ణయించుకోలేదు. జనవరి 3 మాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు మేమిద్దరం మొదటిసారి ముద్దుపెట్టుకున్న రోజు' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఓ సైక్లింగ్ ఈవెంట్ సందర్భంగా నుపుర్.. ఆమెకు ప్రపోజ్ చేశారు. అతను వృత్తిరీత్యా ఫిట్నెస్ కోచ్ కాగా.. అమీర్ ఖాన్, సుస్మితా సేన్ లాంటి ప్రముఖులకు శిక్షణ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఐరా.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమార్తె. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత, డిసెంబర్ 2005లో కిరణ్ రావును అమీర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 2022లో విడిపోయారు. అమీర్ ఖాన్ కుమార్తె 2019లో 'యూరిపిడెస్' మెడియా నాటకం ద్వారా దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. అయితే తనకు నటిగా మారడం ఇష్టం లేదని ఐరా స్పష్టం చేసింది. (ఇది చదవండి: అర డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీ.. తాజాగా మరో సినిమా..) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా(80) మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన ఉప్కార్, రోటీ కప్డా ఔర్ మకాన్, క్రాంతి లాంటి చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో బీర్బల్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు జుగ్ను మీడియాకు తెలిపారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. ఈ విషయం తెలుసకున్న సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించింది. ఖోస్లా ముఖ్యంగా హాస్య పాత్రలకు పేరు సంపాదించుకున్నారు. 'షోలే' చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. షోలేలో ఖైదీగా అతని పాత్ర చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతను నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే, అంజామ్ వంటి చిత్రాలలో కూడా నటించారు. CINTAA expresses its condolences on the demise of Birbal (Member since 1981) .#condolence #condolencias #restinpeace #rip #birbal #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/bTXH0LArRp — CINTAA_Official (@CintaaOfficial) September 12, 2023 -
మాజీ భార్యతో జతకట్టిన అమిర్ ఖాన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. అయితే తాజాగా ఆయన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో కిరణ్ రావు దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రానికి లాపాటా లేడీస్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా... దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆమె దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ధోబీ ఘాట్ తర్వాత మరోసారి అమిర్ ఖాన్ తన మాజీ భార్యతో జతకట్టడంపై బాలీవుడ్లో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!) కాగా.. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లపాటా లేడీస్ అనే చిత్రాన్ని ఇద్దరు నవ వధువుల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 2001లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని అమిర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. కిరణ్ రావు, అమిర్ ఖాన్ 2005లో వివాహం చేసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల వీరి బంధానికి 2021లో ముగింపు పలికారు. (ఇది చదవండి: బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!) View this post on Instagram A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions) -
ఆమె ఒక స్టార్ హీరోయిన్.. వామ్మో ఇన్ని కోట్ల ఆస్తులా?
సినీ ఇండస్ట్రీలో తారల ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక స్టార్స్‌గా ఎదిగినా వారికైతే కోట్లలో పారితోషికాలు ఇచ్చుకోవాల్సిందే. సినిమాలే కాకుండా ఇంకా ప్రకటనల్లో నటిస్తూ కోట్లలోనే గడిస్తూ ఉంటారు. అది సినీ ఇండస్ట్రీలోని స్టార్ ముద్ర వేసుకున్న నటీనటుల రేంజ్. సాధారణంగా హీరోయిన్ల కంటే.. హీరోల రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే పారితోషికం విషయానికి వచ్చేసరికి కాస్తా తక్కువే. అయితే కేవలం వాటితోనే కాకుండా బిజినెస్‌లోనూ కోట్లు గడించేవారు ఉన్నారు. అలాంటి వారిలో ముందువరుసలో వినిపించే పేరు ఆలియా భట్. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆదాయం హీరోలకు ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. అసలు ఆ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: హీరోయిన్‌కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!) రూ.560 కోట్ల ఆస్తులు బాలీవుడ్ భామ హీరోయిన్ మాత్రమే కాదు. మంచి బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకు దాదాపు రూ.150 కోట్ల రూపాయల విలువైన 'యాడ్-ఎ-మామా' అనే ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్‌ను కలిగి ఉంది. ఈ బిజినెస్ ద్వారా అలియా భట్ విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అలియా భట్ ఇప్పటికే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. గతేడాది బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న అలియా భట్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 560 కోట్ల విలువతో భారతదేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన హీరోయిన్గా నిలిచింది. ఆలియా భట్ ఆస్తులు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ విలాసవంతమైన మూడు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. లండన్‌లో ఒకటి ఉండగా.. ముంబైలోని జుహు, బాంద్రాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ప్రస్తుతానికి అలియా సోదరి షాహీన్ జుహూ ఇంట్లో ఉంటోంది. అలియా మొదటిసారి ఇంటిని ఇండియాలో కాకుండా లండన్‌లోనే కొనుగోలు చేసిందట. గతంలో లండన్‌లో సొంతిల్లు ఉండాలనేది తన కల అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అలియా భట్ లండన్ ఇంటి విలువ రూ.25 కోట్ కాగా.. అది కోవెంట్ గార్డెన్లో ఉంది. 2020లో అలియా భట్ బాంద్రాలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. వాస్తు పాలి హిల్స్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులో ఉన్న ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ.40 కోట్లు కాగా.. అదే బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని ఏడో అంతస్తులో రణబీర్ కపూర్‌కు కూడా ఓ ఇల్లు ఉంది. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారు రూ. 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌తో పాటు అలియా భట్‌కు ఇంకా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె వద్ద ప్రస్తుతం 3 ఆడి కార్లు ఉన్నాయి. (ఇది చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) రూ.150 కోట్ల బిజినెస్ అలియా భట్ తాన సొంతంగా 'యాడ్-ఎ-మామా' పేరుతో దుస్తుల బ్రాండ్ 2020లో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఇప్పుడు రూ. 150 కోట్లకు చేరుకుంది. ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ అలియా భట్ కంపెనీని రూ. 300-350 కోట్లకు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అంతే కాకుండా అలియా భట్ ఒక ప్రొడక్షన్ హౌస్‌కు యజమాని కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె 2019లో ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ పేరుతో దీన్ని లాంఛ్ చేసింది. ప్రొడక్షన్ హౌస్ పేరుతో ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో 38 కోట్ల రూపాయల విలువైన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసింది బాలీవుడ్ భామ. ఒకవైపు నటనతో పాటు.. మరోవైపు బిజినెస్‌లోనూ సక్సెస్ సాధిస్తూ కోట్లు గడిస్తున్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో ఆలియా భట్ కొనసాగుతోంది. ఈ రేంజ్లో సంపాదిస్తున్న ఇప్పటి స్టార్ హీరోయిన్లు నయనతార, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్, సమంత కూడా ఆలియాకు పోటీనిచ్చే స్థాయిలో లేరని తెలుస్తోంది. -
తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!
మరాఠీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ చందేకర్. 'జెండా', 'క్లాస్మేట్స్', 'బాలగంధర్వ' లాంటి చిత్రాల్లో నటించారు. మధుర దేశ్‌పాండే, స్వప్నిల్ జోషి, అమృతా ఖాన్విల్కర్తో కలిసి 'జీవ్లగా' షోలో కూడా కనిపించారు. ఇటీవలే నాగేష్ కుకునూర్ దర్శకత్వంలోని 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. తాజాగా సిద్ధార్థ్ చేసిన పనికి నెటిజన్స్ మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తన తల్లిని రెండవ వివాహం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తల్లి కోసం ఉద్వేగభరితమైన నోట్ రాసుకొచ్చారు. అంతేకాకుండా తల్లి సీమా చందేకర్ రెండో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!) సిద్ధార్థ్ నోట్లో రాస్తూ.. ' అమ్మా.. హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. నీ బిడ్డలతో పాటు నీ జీవితం ఇంకా ఉంది. నీకు స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు మా కోసం చాలా త్యాగం చేశారు. ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ విషయంలో మీ పిల్లలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. మీరు నా పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు నేను అదే చేశా. నా జీవితంలో అత్యంత ఎక్కుగా ఆనందపడే పెళ్లి. ఐ లవ్ యూ అమ్మ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తున్నారు. (ఇది చదవండి: జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్) View this post on Instagram A post shared by Siddharth Seema Chandekar (@sidchandekar) -
షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!
ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొవిడ్ నాటి పరిస్థితుల నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో అతను చేసే పాలిటిక్స్ తనకు నచ్చవని విమర్శలు చేశారు. కానీ నేను కూడా షారుక్ అభిమానినే అని ప్రస్తావించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన స్టార్ హీరోపై విమర్శలు చేయడంపై బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. షారూక్ రాజకీయాలు చేయడం వల్ల బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. (ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్) వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..' నేను కూడా షారుక్‌కు అభిమానినే. ఆయనకు చరిష్మా ఉంది. కానీ అతను చేసే రాజకీయాలే నాకు నచ్చవు. ఇలాంటి వారి వల్ల బాలీవుడ్‌కు చెడ్డ పేరు వస్తుంది. అయితే వీళ్లు స్టార్డమ్ లేకుండా దేన్నీ అంగీకరించరు. ప్రేక్షకులకు ఏమీ తెలియదని భావిస్తారు. నేను కేవలం ప్రజలకు నచ్చే సినిమాలు తీస్తా. కానీ వాళ్లు బాక్సాఫీస్ కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తారు. ఏదైనా మూవీ హిట్ అయితే.. అది షారుక్ సక్సెస్ అంటారు. కానీ నా చిత్రాలు హిట్ అయితే ప్రేక్షకుల విజయంగా భావిస్తా. మాది భిన్న వైఖరి అయినప్పటికీ.. షారుక్‌తో సినిమా తీయడానికి కూడా నేను సిద్ధం.' అని అన్నారు. మరో వైపు డైరెక్టర్ కరణ్ జోహార్‌పై విమర్శలు చేశారు. ముఖ్యంగా స్టార్ డమ్‌ను అతిగా కీర్తించడం వెనుక కరణ్ జోహార్ ఉన్నాడని వివేక్ ఆరోపించారు. అతను మధ్యతరగతి నుంచి వచ్చిన ప్రతిభావంతుల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని విమర్శలు చేశారు. కరణ్ కేవలం స్టార్ సిస్టమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే మరోవైపు షారుక్ ఖాన్‌పై కామెంట్స్ చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఈ కామెంట్స్‌కు వ్యతిరేకంగా చాలామంది కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మిస్టర్ కంగనా అంటూ విమర్శలు చేస్తున్నారు. అగ్నిహోత్రి ఓ మానసిక రోగి అంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: మరో హిట్‌కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!) -
ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: స్టార్ డైెరెక్టర్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన కెన్నెడీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నిలియోన్, రాహుల్ భట్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన బాలీవుడ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ఎదురైన పరిస్థితుల వల్ల ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!) అదే సమయంలో తనకు తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. అందుకు గల కారణాలను కూడా అనురాగ్ వివరించారు. నెగెటివిటీ కారణంగా ఒకానొక సమయంలో బాలీవుడ్ వదిలి వెళ్లిపోవాలనుకున్నానని దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నారు. నెగెటివిటీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. 'ఒకటి, రెండు సంవత్సరాల పాటు నాకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా. 2021కి ముందు రెండేళ్లపాటు ఎక్కువగా ప్రభావితమయ్యా. ఆ సమయంలో బయటకు వెళ్లాలని అనుకున్నా. దక్షిణాదికి చెందిన నా స్నేహితులు తమిళంలో సినిమాలు చేయమని ఆహ్వానించారు. కేరళకు చెందిన నా స్నేహితుడు మలయాళంలో సినిమాలు చేయమని పిలిచారు. జర్మన్, ఫ్రెంచ్ సినిమాలు చేయమని కూడా ఆహ్వానం అందింది. కానీ నాకు భాషలు తెలియక వాటిని అంగీకరించలేకపోయా. విమర్శలు అన్నింటినీ ఎదుర్కొన్నప్పటికీ.. ఈ రంగంలోనే కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా విమర్శించినా నేను పెద్దగా పట్టించుకోను. అవీ నన్ను ఏమాత్రం బాధపెట్టడం లేదు. వాళ్లు ఏం మాట్లాడినా.. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతా.' అని అన్నారు. (ఇది చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) అనురాగ్ కెరీర్ అనురాగ్ కశ్యప్ మొదట రామ్ గోపాల్ వర్మ చిత్రం సత్యలో కో- డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్, దేవ్.డి, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, అగ్లీ, రామన్ రాఘవ్ 2.0 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్ సీజన్ -2లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
మీరేమి బాడీ బిల్డర్లు కాదు.. యంగ్ హీరోలపై సన్నీ సెటైర్లు!
గదర్- 2 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్. ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్గా నటించింది. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ శర్మ తనయుడు ఉత్కర్ష్ శర్మ కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో సన్నీడియోల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కొత్త తరం నటీనటులను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. పరిశ్రమకు నటులు కావాలని.. బాడీబిల్డర్లు అవసరం లేదని చురలకలంచటించారు. గదర్ -2 సక్సెస్ కావడంతో సన్నీ నేటి యువ హీరోలకు ఓ సలహా ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యువనటులు బాడీబిల్డింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టకుండా.. నటనపైనా దృష్టి పెడితే బాగుంటుందని సూచించాడు. సన్నీ మాట్లాడుతూ.. "బాడీబిల్డింగ్, డ్యాన్స్ చేయడం మానేయండి. నటనపైనే దృష్టి పెట్టండి. మీలో ఉన్న ప్రతిభను ముందుకు తీసుకెళ్లండి. ఎందుకంటే మనకు కావల్సింది అదే. మీరేమి బాడీ బిల్డర్లు కాదు. మీరు ఫిట్‌గా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. సంగీతం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. మీరందరూ నా పాత చిత్రాలను చూశారని తెలుసు. అంతకుముందు చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇప్పడున్న చాలా మంది కొత్తవారు గొప్పగానే పని చేస్తున్నారు. మీరు కేవలం కండలు తిరిగిన వ్యక్తుల కంటే.. ప్రేక్షకులు మిమ్మల్ని హీరోలుగానే చూసేలా ఉండండి.' అంటూ సలహా ఇచ్చాడు. గదర్ -2 గురించి సన్నీ మాట్లాడుతూ.. 'ఇది చాలా పాత చిత్రంలా అనిపిస్తుంది. కానీ మేము ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా తెరకెక్కించాం. ఫిల్మ్ మేకింగ్ ఎలా అభివృద్ధి చెందిందని సన్నీని ప్రశ్నించగా.. సినిమా తీసే విధానం మారలేదు.. సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అది మరింత వేగంగా విస్తరించింది.అయినప్పటికీ మన సంస్కృతి, విలువలు, చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటాయి.' అని అన్నారు. కాగా.. గదర్- 2 అనేది 2001లో విడుదలైన గదర్: ఏక్ ప్రేమ్ కథా చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించారు. -
సెకండ్ హ్యాండ్ కారు కొన్న 'అత్తారింటికి దారేది' నటుడు..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి విలువైన మెర్సిడెస్-బెంజ్‌ను కొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అతని కుటుంబ సభ్యులతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్! ) అయితే బోమన్ ఇరానీ కొన్నకారు కొత్తదేం కాదు. ఇది మెర్సిడెజ్ బెంజ్ కొత్త మోడల్ అయినప్పటికీ.. ఈ కారును సెకండ్ హ్యాండ్‌లోనే ఆయన కొనుగోలు చేశారు. చాలా మంది సెలబ్రిటీలు ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అలాగే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ కారును బోమన్ ఇరానీ తన ఇంటికి తీసుకెళ్లారు. ఇండియాలో విరాట్ కోహ్లీతో పాటు ప్రీ-ఓన్డ్ కారును కలిగి ఉన్న చాలా మంది ప్రముఖులు ఉన్నారు. బాలీవుడ్లో, శిల్పాశెట్టికి ప్రీ-ఓన్డ్ కార్లంటే చాలా ఇష్టం ఆమె దాదాపు అన్ని లగ్జరీ కార్లు సెకండ్ హ్యాండ్ కార్లే. కాగా.. బోమన్ ఇరానీ అత్తారింటికి దారేది కీలక పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!) View this post on Instagram A post shared by Auto Hangar Advantage (@autohangar.advantage) View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
ఇంటర్వ్యూల కోసమే చీప్ ట్రిక్స్.. ఎందుకు కొడతానన్న స్టార్ నటుడు!
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ షూటింగ్లో భాగంగా ఎవరినైనా కొట్టేస్తాడని గతకొంతకాలంగా ఓ ప్రచారం జరుగుతోంది. సన్నివేశం బాగా రావడం కోసం సహనటులపై నిజంగానే చేయి చేసుకుంటాడని ఈ పుకారు చాటి చెప్తోంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న అనిల్ కపూర్ ఈ రూమర్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'ఇది నిజం కాదు. కొందరు కావాలనే కొన్నింటిని పెద్దవి చేసి చెప్తారు. అలాగైతే ఇంకా ఎక్కువమంది ఇంటర్వ్యూలకు పిలుస్తారని కాబోలు! కావాలని నేను ఎందుకు కొడతాను?' అని చెప్పుకొచ్చాడు. (ఇది చదవండి: చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య, వీడియో కాల్ చేసి..) కాగా అనిల్ కపూర్‌తో జుగ్‌జుగ్ జియోలో నటించిన మనీశ్ పౌల్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'తొలి సన్నివేశంలోనే అనిల్ చాలా చిరాకుపడ్డాడు. నన్ను చెంపదెబ్బ కొట్టబోయాడు. ఆ తర్వాత మళ్లీ మేమిద్దరం బాగానే ఉన్నామనుకోండి' అని పేర్కొన్నాడు. తొలి సన్నివేశంలోనే అంత చిరాకు పడి కొట్టేదాకా వచ్చాడంటే అనిల్ ఇప్పటివరకు ఎంతమందిని కొట్టి ఉంటాడోనని ప్రచారం నడిచింది. ఇక అనిల్ సినిమాల విషయానికి వస్తే.. అతడు ఇటీవల నటించిన ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందుతోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్‌లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ కావాల్సి ఉండగా డిసెంబర్ 1కి వాయిదా పడింది. ఇకపోతే ఫైటర్ సినిమాలోనూ అనిల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. (ఇది చదవండి: ఆ సినిమాలే ఓ పరమ చెత్త.. అందుకే ఎవరూ చూడరు: సినీ క్రిటిక్ ) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. సింగం నటుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ సావర్కర్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కౌస్తుభ్ సావర్కర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు కాగా.. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా.. జయంత్ సావర్కర్ ఎక్కువగా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. తండ్రి మరణంపై కౌస్తుభ్ సావర్కర్ మాట్లాడుతూ..'10-15 రోజుల క్రితం థానేలో లో బీపీకి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చాం. గత రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కోలుకోలేక ఇవాళ ఉదయం 11 గంటలకు మరణించారు. అని చెప్పారు. జయంత్ సావర్కర్ మరాఠీ, హిందీ సినిమాలు, టెలివిజన్‌లో దాదాపు ఆరు దశాబ్దాల పాటు నటించారు. "హరి ఓం విఠల", "గద్బద్ గోంధాల్", "66 సదాశివ్", "బకాల్", "యుగ్ పురుష్", "వాస్తవ్", "సింగం" వంటి సినిమాలు కూడా ఉన్నాయి. సావర్కర్ మొదట మరాఠీ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ప్రముఖ నాటక రచయిత విజయ్ టెండూల్కర్ తెరకెక్కించిన రంగస్థల నిర్మాణం "మనుస్ నవాచే బెట్"లో ఛాన్స్ వచ్చింది. కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి రాజశ్రీ ఠాకూర్.. సాత్ ఫేరే: సలోని కా సఫర్ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. మోడలింగ్‌పై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ.. కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. ఇండస్ట్రీలో ప్రారంభ రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని తెలిపింది. బాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. దానికి ఎవరూ అతీతులు కాదన్నారు. (ఇది చదవండి: నవదీప్‌తో వివాదం.. అందువల్లే తీవ్ర ఒత్తిడికి ఫీలయ్యా: ఎన్టీఆర్ హీరోయిన్) రాజశ్రీ ఠాకూర్ మాట్లాడుతూ..' నాకు మోడలింగ్‌పై చాలా ఆసక్తి ఉండేది. అందుకే టీవీ ప్రకటనలు, ప్రెస్ షూట్లు చేసేదాన్ని. మనల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించే కొంతమంది వ్యక్తులను నేను చూశా. అప్పుడు నాది చాలా చిన్న వయసు. అవతలి వ్యక్తి ఉద్దేశాలు ఏమిటో గుర్తించలేకపోయా. వాటి నుంచి అప్రమత్తంగా ఉంటే తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఈ వృత్తిలో చాలా అలర్ట్‌గా ఉండాలి.. అసలు ఈ రోజుల్లో ఏ వృత్తిలోనైనా మనల్ని వాడుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో పోటీ చాలా ఎక్కువ. ఒకరినొకరు తొక్కేసేందుకే ప్రయత్నిస్తున్నారు.' అన్నారు. కాగా.. రాజశ్రీ తన షో 2005 సాత్ ఫేరే: సలోని కా సఫర్తో ఫేమ్ తెచ్చుకుంది. అంతకు ముందు ఆమె ఆల్ ఇండియా రేడియోలో మరాఠీ న్యూస్ రీడర్‌గా పనిచేసి.. యాడ్స్ కూడా చేసింది. ఆమె సప్నా బాబుల్ కా...బిదాయి, అగ్లే జనమ్ మోహే బితియా హి కిజో, భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్, షాదీ ముబారక్, అప్నాపన్ - బదల్తే రిష్టన్ కా బంధన్ వంటి ఇతర షోలలో కూడా నటించింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్, వీడియో వైరల్) -
భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో!
బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని 1970ల్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత హేమ ధర్మేంద్రతో కలిసి 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలోమొదటిసారి నటించారు. ఈ సినిమాతోనే హేమమాలిని, ధర్మేంద్ర మధ్య ప్రేమ చిగురించింది. కానీ అప్పటికే ధర్మేంద్రకు పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ధర్మేంద్ర, హేమ మాలిని 1980లో వివాహం చేసుకున్నారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో ముద్దులాట.. తప్పు మీది.. నన్నెందుకు పంపించేశారు?) అయితే ఈ జంటకు మొదట ఈషా డియోల్ జన్మించింది. అయితే పాప పుట్టినప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. హేమమాలిని డెలివరీ కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసుకున్నారట. దీనికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే ఈ విషయాన్ని హేమ మాలిని స్నేహితుల్లొ ఒకరు వివరించారు. హేమ ప్రసవించిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు. ఈషా పుట్టడానికి ధర్మేంద్ర 100 గదుల ఆసుపత్రిని ఎందుకు బుక్ చేయాల్సి వచ్చిందో అప్పుడు చాలామందికి అర్థం కాలేదని వెల్లడించారు. ఓ షోలో పాల్గొన్న హేమమాలినికి ఆమె స్నేహితురాలు నీతూ కోహ్లి ఈ సంఘటనను గురించి అడిగారు. అయితే దీనిపై కొందరు భిన్నంగా స్పందించారు. దీనివల్ల ఇతరులు ఇబ్బందులు పడతారని తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు అనవసరమైనవని మండపడుతున్నారు. మరికొందరేమో ఆస్పత్రికి బదులు ఒక ఫ్లోర్ బుక్ చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ధర్మేంద్ర, హేమ లవ్ స్టోరీ కాగా.. హేమ ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో మొదటిసారి నటించారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జంట 1980లో వివాహం చేసుకున్నారు. హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. ఈ జంటకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతకుముందు 1954లో ప్రకాశ్ కౌర్‌ను వివాహం చేసుకోగా.. నలుగురు పిల్లలు జన్మించారు. (ఇది చదవండి: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు హరీశ్ మాగోన్(76) ముంబయిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ట్విట్టర్లో వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. (ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!) గోల్ మాల్, నమక్ హలాల్, చుప్కే చుప్కే, షహెన్షా, ఖుష్బూ, ఇంకార్, ముఖద్దర్ కా సికందర్ వంటి బాలీవుడ్ చిత్రాలలో హరీశ్ మాగోన్ నటించారు. ఆయన చివరిసారిగా కనిపించిన చిత్రం ఉఫ్! యే మొహబ్బత్ కాగా.. ఆ మూవీ 1997లో విడుదలైంది. కాగా.. హరీష్‌కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అతను ముంబయిలోని జుహులో హరీష్ మాగోన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను నడిపారు. స్టూడెంట్ సంతాపం ఆయన మృతికి సంతాపంగా 1975లో విడుదలైన ఆంధీ సినిమాలోని ఒక పాటలోని హరీష్ వీడియోను ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. హరీష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్‌నని.. గుల్జార్ అసిస్టెంట్ మేరాజ్‌కి సన్నిహిత మిత్రుడినని ట్విటర్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!) Harish Magon - #InMemories Will always be remembered for those cute cameos in Hindi Cinema. A graduate3 from FTII, he was a close friend of Gulzar's assistant Meraj and hence get to face the camera here in #Aandhi song for a break HarishMagon #RIP @rmanish1 @SukanyaVerma https://t.co/di3N4qCpQ7 pic.twitter.com/seyECwOh2r — Pavan Jha (@p1j) July 2, 2023 CINTAA expresses its condolences on the demise of Harish Magon (Member since JUNE. 1988) .#condolence #condolencias #restinpeace #rip #harishmagon #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/qMtAnTPThX — CINTAA_Official (@CintaaOfficial) July 1, 2023 -
పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!
ఒకప్పుడు బాలీవుడ్ పేరు చెప్పగానే మెలోడీ పాటలు, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. ఇప్పుడేమో ఘోరమైన ఫ్లాప్ సినిమాలే కనిపిస్తున్నాయి. రోజురోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఎంతలా అంటే అక్కడి ప్రేక్షకులు.. దక్షిణాది చిత్రాల కోసం ఎదురుచూసేంతలా. ఇప్పుడు అదంతా కాదన్నట్లు ఓ పాట వల్ల కొత్త విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ లోని ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. ఇతడు చేసిన సినిమాల్లో కొన్ని రీమేక్స్ ఉన్నాయి. అయినా వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇతడి సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ పలు చిత్రాల్లో నుంచి కాపీ కొట్టి తీసినట్లు అనిపిస్తాయి. ఈ ఏడాది 'షెహజాదా'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. ఇది 'అల వైకుంఠపురములో' చిత్రానికి రీమేక్. (ఇదీ చదవండి: 'కార్తీకదీపం 2'పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్‌బాబు!) ఇలా పలు మూవీల్ని రీమేక్ చేయడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న పాటని కూడా రీమేక్ చేసి పడేశాడు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో పాకిస్థానీ పాట 'పసూరి' అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తిక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' కోసం వాడేశారు. తాజాగా ఈ గీతాన్ని రిలీజ్ చేయగా నెటిజన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం దక్షిణాది సినిమాల డామినేషన్ కనిపిస్తోంది. మన దర్శకులు, హీరోలు కొత్త సినిమాలతో నార్త్ ఆడియెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు హిందీ హీరోలేమో పరాయి దేశాల పాటల్ని కూడా వదలట్లేదు. నిర్ధాక్షణ్యంగా రీమేక్ చేసి పడేస్తున్నారు. ఇదంతా చూస్తున్న నెటిజన్స్ కి బాలీవుడ్ పై రోజురోజుకీ విరక్తి కలుగుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు! (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ నిర్మాత కుల్జీత్ పాల్(90) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆదివారం ముంబయిలోని శాంతాక్రూజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. (ఇది చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ ఇంట విషాదం) బాలీవుడ్లో అర్థ్, ఆజ్, పరమాత్మ, వాస్నా, దో షికారి, ఆషియానా వంటి చిత్రాలను కుల్జీత్ పాల్ నిర్మించారు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రేఖకు మొదటి అవకాశమిచ్చిన నిర్మాతగా కుల్జీత్ పాల్ పేరు సంపాదించారు. అయితే ఆ చిత్రం రిలీజ్ కాలేదు. దీంతో ఆమెతో దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. (ఇది చదవండి: ‘సర్కిల్’తో అవకాశాలు పెరుగుతాయి : అర్షిణ్ మెహతా, రిచా పనై) -
సాయిపల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ నటుడు
హీరోయిన్ సాయిపల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేచురల్ బ్యూటీగా, లేడీ పవర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. డ్యాన్స్ స్టెప్పులతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సాయిపల్లవికి సౌత్‌లోనే కాదు, నార్త్‌లోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో సాయిపల్లవిపై బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య మనసు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరోయిన్ సాయిపల్లవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె తన క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు. సాయిపల్లవి అందం, డ్యాన్స్‌కు ఫిదా అయిపోయానని, ఆమె నెంబర్ తన వద్ద ఉన్నా ఫోన్ చేసి మాట్లాడే ధైర్యం చేయలేకపోయానంటూ తన ప్రేమ గురించి వెల్లడించాడు. 'సాయిపల్లవి అద్భుతమైన నటి, డ్యాన్సర్. కొన్నిసార్లు ఆమె పట్ల ఇన్‌ఫాచ్యువేషన్‌కు లోనయ్యాను. ఎందుకో తెలియదు కానీ ఆమె సినిమాలన్నీ చూస్తాను. ఆమెపై నాకు ఎంత పిచ్చి అంటే జీవితంలో ఒక్కసారైనా ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నా. అప్పుడు నా సంతోషానికి అవధులు ఉండవు' అంటూ గుల్షన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. -
IIFA 2023: అట్టహాసంగా ఐఫా అవార్డ్స్ 2023 వేడుక (ఫొటోలు)
-
ఐఫా ఈవెంట్లో హోయలు పోయిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
ఐఫా ఈవెంట్లో హోయలు పోయిన ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌కు చేదు అనుభవం ఎదురైంది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో విక్కీ కౌశల్‌పై బాడీగార్డ్స్‌తో పాటు సల్మాన్ కూడా దురుసుగా ప్రవర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. IIFA 2023 అవార్డు వేడుకకి పలువురు బాడీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ఈ క్రమంలో ఓ అభిమానితో విక్కీ సెల్ఫీ దిగుతుండగా సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అక్కడికి రావడంతో సల్మాన్ బాడీగార్డ్స్ అత్యుత్సాహంతో విక్కీ కౌశల్‌ను పక్కకు నెట్టివేశారు. అయినా సరే పెద్దగా పట్టించుకోని విక్కీ సల్మాన్‌ను పలకరించేందుకు ముందుకు వెళ్లగా సల్మాన్ మాత్రం ఏమీ పట్టనట్లుగా, సరిగా మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సల్మాన్‌ఖాన్ బాడీగార్డ్స్ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. అంతేకాకుండా తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో కూడా సల్మాన్‌కు తెలియదా? అంత మర్యాద లేదా అంటూ అతడి తీరుపై కూడా ఫైర్ అవుతున్నారు. -
60 ఏళ్ల వయసులో నటుడు రెండో పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా 60ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కోల్‌కతాలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుమారు 20ఏళ్ల క్రితమే ఆశిష్ విద్యార్థి నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ప్రేమించి మనువాడారు. వీరికి ఆర్త్ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. నటిగా, సింగర్‌గా రాజోషి బారువా పాపులర్. అయితే భార్యభర్తల మధ్య కొంతకాలంగా విబేధాలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రుపాలీతో ఆశీష్ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలు ఎక్కేదాకా వచ్చింది. ఈమెకు కోల్‌కతాలో పలు స్టోర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా వీరు రిలేషన్షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చినా వాటినే నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. రూపాలీని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ బంధం వెనుక పెద్ద కథే ఉందని, తర్వాత ఎప్పుడైనా చెబుతానంటూ స్వయంగా ఆశిష్ విద్యార్థి పేర్కొన్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ఆశిష్‌విద్యార్థి రెండో పెళ్లి చేసుకోవడం, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు కొత్తజంటకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వయసులో మీకిది అవసరమా? అయినా ప్రేమ గుడ్డిది అంటారు. నిజమేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. -
ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు: నటి
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది అందరికి తెలిసిన పచ్చి నిజం. ఈ సమస్య ఇప్పుడే కాదు దశాబ్దాల కాలం నుంచి ఉంది.అయితే ఈ మధ్య కాలంలో పలువురు హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి బహిరంగంగా వెళ్లడిస్తున్నారు. చాలా మంది లైగిక వేధింపుల పై పోరాటం కూడా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, ‘శుభ్ మంగళ్ మే దంగల్’ ఫేం సంగీతా ఒడ్వాని తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఓపెన్ అయింది. ఓ స్టార్ నిర్మాత తనను ఒంటరిగా ఇంటికి పిలిచాడని ఓ ఇంటర్వ్యూలో తెలిసింది. ‘కెరీర్ తొలినాళ్లలో నాకు ఇండస్ట్రీ కల్చర్ గురించి పెద్దగా తెలియదు. అందరితో సరదాగా ఉండేదాన్ని. కొన్నాళ్ల తర్వాత పైకి మంచి వాడిలా నటించే ఓ స్టార్ నిర్మాత నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఓ రోజు ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించాలని ఇంటికి ఆహ్వానించాడు. ఒంటరిగా మాత్రమే రావాలని పదే పదే చెప్పడంతో నాకు డౌట్ వచ్చింది. (చదవండి: హీరోయిన్ రంభ కూతురిని చూశారా? అచ్చం తల్లిలాగే ఉందిగా! ) ఎందుకైనా మంచిదని నా ఫ్రెండ్స్‌ని తీసుకొని ఆయన ఇంటికి వెళ్లాను.అయితే నేను సింగిల్‌గా వెళ్లకపోవడంతో అతనికి కోపం వచ్చింది. అర్జంట్‌గా వేరే పని పడిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా నన్ను ఒంటరిగా కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ నేను దూరం పెట్టేశాను. అతనికి అమ్మాయిలు అంటే పిచ్చి. సినిమాల పేరుతో వారిని లొంగదీసుకుంటాడు’ అని సంగీత చెప్పుకొచ్చింది. -
14ఏళ్లుగా భోజనం చేయడం లేదు : బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఫ్యామిలీ మ్యాన్-2తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ చిత్రంలో విలన్‌గా నటించారు. అల్లు అర్జున్ మూవీ హ్యాపీలో తనదైన నటనతో మెప్పించారు. చదవండి: అహంకారమా? అజ్ఞానమా? పవన్ పోస్టర్‌పై పూనమ్ ఫైర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే కొన్నేళ్లుగా నా లైఫ్‌స్టైల్ మొత్తం మారిపోయింది. గత 13-14ఏళ్లుగా నేను రాత్రిపూట భోజనం చేయటం లేదు. దీనివల్ల నా బరువు చాలా అదుపులో ఉంది. దీన్ని నేను మా తాత దగ్గర్నుంచి చూసి నేర్చుకున్నాను. ఆయన రాత్రుళ్లు భోజనం చేసేవారు కాదు. సన్నగా, ఫిట్‌గా, ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించేవారు. అందుకే నేను కూడా ఆయన్ను ఫాలో అయ్యాను. డిన్నర్ మొత్తం మానేయడం అంటే మొదట్లో చాలా కష్టంగా అనిపించేది. ఆకలిని కంట్రోల్ చేయడానికి బిస్కెట్లు లాంటివి తినేవాడిని. కానీ క్రమక్రమంగా అలవాటు చేసుకున్నా. ఈ రొటీన్ వల్ల నా బరువు అదుపులో ఉండటంతో పాటు చాలా వరకు ఎనర్జీతో ఉండగలుగుతున్నా అంటూ మనోజ్ బాజ్‌పాయ్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ షూటింగ్లో ఆయన పాల్గొంటారు. చదవండి: సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర, గ్లింప్స్ చూశారా? -
ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా జైలు నుంచి విడుదలైంది.‘సడక్ 2’, ‘బాట్లా హౌస్’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన క్రిసాన్.. మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయి 2 వారాల జైలు శిక్ష అనుభవించింది. అయితే ఈ కేసులో కావాలనే ఇరికించారంటూ నటి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా విచారణ అనంతరం ఆమెను నిర్దోశిగా తేల్చి జైలు నుంచి విడుదల చేశారు. చదవండి: డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే విధించిన హైకోర్టు ఇంతకీ ఏమైందంటే..నటి క్రిసాన్ పెరీరాను ట్రాప్ చేసిన నిందితులు ఆంథోనీ పాల్, అతని స్నేహితుడు రాజేష్ దామోదర్‌లు ఓ వెబ్‌సిరీస్ ఆడిషన్ కోసం కాఫీ షాపులో ఆమెను కలిసి సినిమా స్టైల్లో కథను వివరించారు. తిరిగి వెళ్లే సమయంలో ఆమెకు ఓ ట్రోఫీని అందజేశారు. దీన్ని యూఎఈలో మరొకరికి ఇవ్వాలని, ఇదంతా స్క్రిప్ట్‌లో భాగమని నమ్మబలికారు. ఎయిర్‌పోర్టులో క్రిసాన్ వద్ద నుంచి ట్రోఫీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో గంజాయి, మాదక ద్రవ్యాలను గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. అయితే తమ కూతుర్ని కావాలనే ఈ కేసులో ఇరికించారని క్రిసాన్ పేరెంట్స్ ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: 'పుష్ప-2' సెట్స్‌లో జూ.ఎన్టీఆర్.. వైరల్‌గా మారిన ఫోటో గతంలో ఓ పెంపుడు కుక్క విషయంలో క్రిసాన్ తల్లి ,ఆంథోనీ పాల్‌కు గొడవ జరిగిందని, దీంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో కూతురు క్రిసాన్‌ను ఇరికించినట్లు పోలీసుల విచారణలో తేలింది. జైలు నుంచి విడుదలైన క్రిసాన్ పేరెంట్స్‌కి ఫోన్ చేసి జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. -
తమిళంలో మాట్లాడాలన్న ఏఆర్ రెహమాన్.. నెటిజన్స్ ఫైర్!
ఏఆర్ రెహమాన్.. ఆయన పేరే ఒక బ్రాండ్. సుమారు 30 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా పరిచయమై ప్రపంచస్థాయిలో తన సత్తా చాటారు. ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను సాధించిన ఘనత రెహమాన్‌కే సొంతం. దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం సహా అనేక భాషల్లో ఆయన బాణీలు అందించారు. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆ చిత్రం కచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల ఈయన సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందది కాడు చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. (ఇది చదవండి: సమంత డై హార్డ్ ఫ్యాన్.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!) అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్- 2022 అవార్డ్ ఫంక్షన్‌కు తన భార్య సైరా భానుతో కలిసి ఆయన హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రెహమాన్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే తన భార్య సైరా భానును హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని రెహమాన్ సరదాగా కోరాడు. (ఇది చదవండి: ఏఆర్ రెహమాన్ భార్యను ఎప్పుడైనా చూశారా?) అయితే ఆమె తనకు తమిళం సరిగా రాదని.. సారీ చెబుతూ ఇంగ్లీష్‌లో మాట్లాడింది. నాకు రెహమాన్ వాయిస్ అంటే ఇష్టం. అది చూసే ప్రేమలో పడ్డాను' అంటూ మాట్లాడింది. అయితే తమిళంలో మాట్లాడాలంటూ తన భార్యకు రెహమాన్ చెప్పడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కొందరేమో హిందీ భాషలోనే పాటలు పాడి సంపాదిస్తున్నావ్.. తమిళంలో మాట్లాడమని చెబుతావా అంటూ రెహమాన్‌ను తప్పుబడుతున్నారు. మరికొందరేమో హీందీ భాష దేశవ్యాప్తంగా మాట్లాడుతారని.. తమిళంలో కూడా హిందీ సాంగ్స్ ఫేమస్ అని చెప్పారు. ఏ భాషలో మాట్లాడాలనేది వారి వ్యక్తిగత అంశమని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా భారతదేశంలో అన్ని భాషలు సమానమేనని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. கேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய் ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjID — black cat (@Cat__offi) April 25, 2023 -
మోడల్స్‌తో వ్యభిచారం.. నటి అరెస్ట్
ముంబైలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై కాస్టింగ్ డైరెక్టర్, నటి ఆర్తీ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.సినిమాలో అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలు, మోడల్స్‌ను వేశ్య వృత్తిలోకి దింపుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై నిఘా ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించారు. పక్కా సమాచారంతో దాడులు జరిపగా ఈ తతంగమంతా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది అని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతోనే ఆర్తీ మిట్టల్‌ను అరెస్ట్ చేశామని, ఈ ఘటనలో ఇద్దరు మోడల్స్‌ను రక్షించి పునరావాస కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. నిందితురాలు ఆర్తి మిట్టల్ సినిమా అవకాశాలు, డబ్బు ఆశ చూపి వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ మనోజ్ సుతార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. Maharshtra | Mumbai Crime Branch Unit 11, Dindoshi police busted a sex racket running in Goregaon area. Two models were rescued from the spot and a 30-year-old casting director, Aarti Mittal was arrested in this case: Mumbai Crime Branch — ANI (@ANI) April 17, 2023 -
సల్మాన్ ఖాన్ సెట్స్‌లో అలాంటి బట్టలేసుకోవాలంటాడు: నటి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో నటించిన నటి పాలక్ తివారీ సల్మాన్ ఖాన్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''సల్మాన్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన సెట్లో అమ్మాయిలు పద్దతిగా బట్టలు వేసుకోవాలని రూల్ పెట్టారు. డీప్ నెక్ ఉండే డ్రెస్సులు అస్సలు వేసుకోవద్దు. సల్మాన్ ఇలాంటి రూల్ పెట్టడానికి కారణం ఏమిటంటే.. ఆయన సంప్రదాయాలకు ఎక్కువగా విలువిస్తారు. తన చుట్టూ ఉండే మహిళలు సేఫ్‌గా ఉండాలని కోరుకుంటాడు.ఇకక సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ అనగానే నా తల్లి చాలా సంతోషపడింది.ఎందుకంటే ఆమెకు నా డ్రెస్సింగ్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉండేవి. కానీ సల్మాన్ రూల్స్ నేపథ్యంలో నేను నిండుగా కప్పుకొని షూటింగ్‌కి వెళ్తుంటే చూసి అమ్మ మురిసిపోయేది'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాలో సల్మాన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. -
ఇది అన్యాయం.. అప్పుడు చరణ్ తో, ఇప్పుడు హృతిక్ తో
-
మిస్టర్ సంధు.. వెంటనే డాక్టర్‌ను కలవండి.. గట్టిగా ఇచ్చిపడేసిన నటి
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ నటించిన జనషీన్ చిత్రంతో సెలీనా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే తాజాగా నటీనటులపై అదేపనిగా విమర్శలు చేస్తూ ఉండే సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నీ సమస్య త్వరలోనే నయమవుతుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారామె. కాగా.. ఉమైర్ సంధు ట్వీట్ చేస్తూ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ నటులైన తండ్రీ, కుమారులు ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌తో శారీరకంగా చాలాసార్లు కలిశారంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి ఘాటూగా స్పందించింది. సెలీనా ట్వీట్లో రాస్తూ.. 'మిస్టర్ సంధు.. ఈ పోస్ట్ చేయడం వల్ల మీరు మనిషిగా మారడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. అలాగే మీ లైంగిక పటుత్వ సమస్య నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటున్నా. మీ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. వెంటనే వైద్యుని వద్దకు వెళ్లండి. ఇలాంటి వారిపై దయచేసి ట్విటర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దివంగత నటుడు ఫిరోజ్ ఖాన్ సెలీనా జైట్లీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనషీన్ చిత్రీకరణ సమయంలో ఫిరోజ్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు తనను యువరాణిలా భావించారని నటి పేర్కొంది. ఈ చిత్రానికి ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. సెలీనా నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కూడా కనిపించింది. Dear Mr Sandhu hope posting this gave you the much needed girth & length to become a man & some hope to cure you of your erectile dysfunction. There are others ways to fix your problem..like going to a doctor, you must try it sometime! #celinajaitly @TwitterSafety pls take action https://t.co/VAZJFBS3Da — Celina Jaitly (@CelinaJaitly) April 11, 2023 -
'ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం'.. బెదిరింపు ఫోన్‌కాల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఈనెల 30న సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. రాకీ భాయ్‌గా తనను పరిచయం చేసుకున్న అతను తనది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ అని చెప్పాడట. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా సల్మాన్ ఖాన్‌కు హత్యా బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలోనూ రెండుసార్లు సల్మాన్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ ఎదుర్కొన్న సల్మాన్‌ను హత్య చేస్తానంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించిన సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపినట్లే సల్మాన్‌ను కూడా చంపేస్తామని బిష్ణోయ్ సన్నిహితుడు బెదిరించాడు. తాజాగా మరోసారి సల్మాన్ హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా కట్టుదిట్టమైన భద్రత మధ్యే బయటకు వెళ్తున్నారు. ఈ పరిణామాల మధ్య రీసెంట్గా సల్మాన్ హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
ఊర మాస్ సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ..
-
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న మాస్ మహారాజ రవితేజ
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తుంటే, మన హీరోలు బాలీవుడ్ బాట పడుతున్నారు. సౌత్ సినిమాలు పాన్ఇండియా స్థాయిలో సత్తాచాటుతుండటంతో బాలీవుడ్ మేకర్స్ దృష్టి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పడింది. దీంతో తమ సినిమాల్లో సౌత్ స్టార్స్ ఉండేలా మేకింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లో వెంకటేశ్, వార్-2లో హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లో మాస్ మహారాజ రవితేజ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తుంది. బీటౌన్ టాక్ ప్రకారం.. యంగ్ హీరో వరుణ్ ధావణ్‌తో కలిసి రవితేజ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను రానా, కరణ్ జోహార్, ఏషియన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రానుందట. -
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మాస్ మహారాజ
-
ప్రభాస్,ఎన్టీఆర్,చరణ్,బన్నీ వెనుక పడుతున్నబాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్
-
కేవలం గుడ్లు, రోటీలతోనే బతికా: సర్దార్ గబ్బర్ సింగ్ నటుడు
బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ మొదట బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. శరద్ 2004లో హిందీ సినిమా హల్ చల్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టారు. శరద్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, మరాఠి భాషా సినిమాల్లో నటించారు. టాలీవుడ్లో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో రాజా భైరోన్ సింగ్ పాత్రలో నటించారు. అయితే తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2002లో ముంబయికి వచ్చాక చిత్ర పరిశ్రమలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకున్నాడు. ఇటీవల ఆయన పాల్గొన్న సైరస్ బ్రోచా పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాలను వెల్లడించారు. శరద్ కేల్కర్ మాట్లాడుతూ.. 'నేను బాంద్రాలోని బజార్ రోడ్లో ఒక గదిలో ఉండేవాన్ని. ఒకే రూమ్‌లో తొమ్మిది మంది కలిసి ఉండేవాళ్లం. అదే రూమ్‌ను రాజస్థానీ డాబాగా ఉపయోగించేది. అక్కడ ఒక చపాతీ 2 రూపాయలకు అమ్మేవారు. అక్కడే నేను గ్యాస్ సిలిండర్లు చూసుకునేవాడిని. అందుకు వారితో నా ఒప్పందం రోజుకు నాలుగు గుడ్లు, రెండు రోటీలు. అది రెండుపూటలా ఇవ్వాలి. నేను అలా రోజుకు రూ. 25తోనే బతికా. మేము ఏదైనా పని దొరికినప్పుడు మాత్రమే పార్టీ చేసుకునేవాళ్లం. అప్పట్లో తాను పనిచేసే జిమ్‌లో నెలకు రూ. 2750 సంపాదించేవాడిని. ఆ తర్వాత ఓ ఫ్యాషన్ షోలో రూ. 5000 ఆఫర్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.' అని అన్నారు. -
మీరు కూడా అడుక్కుంటున్నారా?.. హీరోయిన్‌పై నెటిజన్ సెటైర్లు
ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీని ఎగతాళి చేసిన ఓ నెటిజన్‌పై బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మండిపడ్డారు. ఇటీవల ఆమె ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి మద్దతుగా ఓ వీడియోనూ రిలీజ్ చేసింది. ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆమె ట్వీట్లో జత చేశారు. ఇది చూసిన ఓ నెటిజన్ స్పందించారు. 'ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి వారే అడుక్కుంటారు' సెలీనా ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన సెలీనా జైట్లీ నెటిజన్‌పై ఘూటుగా స్పందించింది. 'అసలు అందులో తమాషా ఏముంది సార్ ???? ఎవరైనా లింగమార్పిడి చేసుకుని మరీ అడుక్కునే స్థాయికి దిగజారడం చూస్తే గుండె పగిలేలా లేదు ??? మీలాంటి వారే ట్రాన్స్ విజిబిలిటీ మేటర్స్ కావడానికి కారణం. " అంటూ ట్వీట్ చేసింది. మరో ట్వీట్లో నెటిజన్ రాస్తూ..'వారు ఎలా అడుక్కుంటారో మీరు చూశారా? వారు అడుక్కోరు. పబ్లిక్‌లో తప్పుగా ప్రవర్తిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఈ ప్రత్యేకమైన జెండర్ గల వ్యక్తులు చేసే పనిని మరొకరు చేస్తే మీకు ఓకేనా? ఆర్ యూ బెగ్గింగ్? బహుశా ఇది నీ పెంపకం వల్ల కావచ్చు.' అంటూ రిప్లై ఇచ్చాడు. మార్చి 31న అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ సందర్భంగా,సెలీనా వారికి మద్దతును తెలియజేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. "ప్రపంచంలోని ధైర్యవంతులైన కొంతమంది లింగమార్పిడి వ్యక్తులు. వారిపై జరిగే అన్ని వివక్ష, హింసకు వ్యతిరేకంగా నేను పోరాడతా. మన ప్రపంచానికి వారి సహకారాన్ని అభినందిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. Have you seen how they beg? They don't beg. They misbehave in public. And would you be ok if man did what these "special" gender people do at Traffic signals 🚦 under the pretext of begging? Maybe you would because of your poor upbringing 😎 I pity your parents 😊 https://t.co/rOfrg7PFHY — Naam Kya Hay (@NaamKyaHay) April 1, 2023 దీనికి సెలీనా జైట్లీ స్పందిస్తూ.. 'నా పెంపకం గురించి నువ్వు అస్సలు చింతించకు. నేను 4 తరాల భారత సాయుధ బలగాల కుటుంబంలో పెరిగాను.ట్రాన్స్ కమ్యూనిటీ ఇప్పటికీ మన దేశంలో చాలా వెనుకబడి ఉంది. వారి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మీలాంటి వ్యక్తులే వారి బహిష్కరణకు, దుస్థితికి బాధ్యులు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. సెలీనా జైట్లీ మిస్ యూనివర్స్-2003లో రన్నరప్‌గా నిలిచింది. జనాషీన్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కనిపించింది. ఆమె గత రెండు దశాబ్దాలుగా ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీతో కార్యకర్తగా పని చేస్తున్నారు. I'm reminded of this gender only at Traffic signals 🚦🤣 — Naam Kya Hay (@NaamKyaHay) March 31, 2023 -
ముంబై : నీతా అంబానీ ‘ఎన్ఎంఏసీసీ’లో తారల తళుకులు (ఫొటోలు)
-
బాలీవుడ్లో విలువలు ఉండవు..కాజల్ అగర్వాల్ సంచలన కామెంట్స్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్.. సౌత్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై మాట్లాడుతూ.. ''హిందీ పరిశ్రమలో క్రమశిక్షణ, నైతిక విలువలు కనిపించవంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. నేను పుట్టి పెరిగింది ముంబైలో అయినా నా కెరీర్ ప్రారంభమైంది మాత్రం హైదరాబాద్‌లోనే. మాతృభాష హిందీ అయినప్పటికీ ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. దీంతో హైదరాబాద్, చెన్నై నగరాలను తన నివాసంగా భావిస్తాను. సౌత్ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉంటే ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే అక్కడ అద్భుతమైన టెక్నీషియన్లు, దర్శకులు ఉన్నారు. బాలీవుడ్లో కొన్ని మంచి సినిమాల్లో నటించినప్పటికీ దక్కిణాదిలో ఉన్నట్లు ఫ్రొఫెషనలిజం,నైతిన విలువలు లొపించాయి'' అని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం కాజల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇటీవలె ప్రియాంక చోప్రా సైతం బాలీవుడ్లో రాజకీయాలు ఎక్కువ అని, వాళ్లతో విసిగిపోయి అమెరికా వెళ్లిపోయానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాజల్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీపై నిప్పులు చెరగడంతో బీటౌన్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. -
షూటింగ్లో ప్రమాదం.. గాయపడ్డ స్టార్ హీరో అక్షయ్‌కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ గాయపడ్డారు. షూటింగ్ సెట్లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా అనుకోకుండా అక్షయ్‌కు గాయమైంది. ప్రస్తుతం అక్షయ్ స్కాట్లాండ్లో బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో భాగంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టంట్ సీన్ చేస్తుండగా అక్షయ్ మోకాలికి గాయమైంది. అయినప్పటికీ అక్షయ్ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించడం విశేషం. గాయం తీవ్రత అంతగా లేకపోవడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం. కాగా టైగర్ జిందా హై, సుల్తాన్ వంటి పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్, టైగర్లతో పాటు సోనాక్షి సిన్హా ఇందులో నటిస్తుంది. ఇటీవలె ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు మూవీ టీం స్కాట్లాండ్కు పయనమయ్యారు. -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్(68)కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమశారు. ఈ విషయాన్ని ఆయన బంధువు, నటి నీతు చంద్ర శ్రీవాత్సవ వెల్లడించారు. పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి సూపర్ హిట్ చిత్రాలకు ప్రదీప్ దర్శకత్వం వహించారు.ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రదీప్ సర్కార్ మృతి పట్ల పలవురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. The news of Pradeep Sarkar’s demise, ‘Dada’ to some of us is still hard to digest. My deepest condolences 💐. My prayers are with the departed and his family. RIP Dada 🙏 — Ajay Devgn (@ajaydevgn) March 24, 2023 Very sad to know about our dearest director @pradeepsrkar dada. I started my career with him. He had an aesthetic talent to make his films look larger than life. From #Parineeta#lagachunrimeindaag to a no. Of movies. Dada, you will be be missed. #RestInPeace 🙏😔 @SrBachchan pic.twitter.com/TDxUOP2quG — Nitu Chandra Srivastava (@nituchandra) March 24, 2023 -
నేను వారిలాగా హీరోల రూములకు వెళ్లను: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా స్టార్ డమ్ సొంతం చేసుకుందామె. ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే పలు సినిమాల్లో నటించిన కంగనా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఉంటుంది కదా. వారి కుటుంబమంతా ముంబయిలో లగ్జరీ లైఫ్ ఉంటుంది కదా. బాలీవుడ్ నటులు కోట్ల రూపాయల విల్లాలు కొనుగోలు చేయడం మనం వార్తల్లో వింటుంటాం. కంగనా కూడా అదే ఆ జాబితాలోకే వస్తుంది. కానీ ఇదంతా కంగనా వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే. కానీ ఆమె కుటుంబం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది బాలీవుడ్ నటి. తన అమ్మ ఓ సాధారణ మహిళగా, పొలంలో పని చేస్తుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను తన ట్విటర్లో షేర్ చేసింది కంగనా. ఇది చూసిన ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. మీరు ధనవంతురాలిగా ఉన్నప్పుడు.. ఇంత సింపుల్‌గా ఎలా ఉంటున్నారని అడిగాడు. దీనికి కంగనా స్పందించింది. అతని ట్వీట్‌కు కంగనా రనౌత్ సమాధామిచ్చారు. కంగనా మదర్ పొలంలో పనిచేస్తున్న ఫోటోను జతచేస్తూ.. 'దయచేసి గమనించండి. ఇక్కడ నేను మాత్రమే ధనవంతురాలిని.. నా తల్లి ధనవంతురాలు కాదు. నేను రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తల కుటుంబం నుండి వచ్చా. మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్‌గా ఉంది. పొలంలో ప్రతి రోజు ఎనిమిది గంటలు పనిచేస్తుంది. సినిమా మాఫియాకు నా వైఖరి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకోవాలి. నేను వారిలాగా పెళ్లిళ్లలో ఎందుకు చవక వస్తువులు ధరించను. అలాగే వారిలా పెళ్లిల్లలో డ్యాన్స్ చేయలేను.' అంటూ పోస్ట్ చేసింది. ఇది ఆమె అభిమానులు మీ అమ్మ అందరికీ ఆదర్శం అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా సినీ వర్గాల నుంచి తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. తన శత్రువులను ఉద్దేశించి భిఖారీ సినీ మాఫియా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. చాలా మంది వ్యక్తులు తనను అహంకారి అని పిలిచారు. నేను ఇతర అమ్మాయిల లాగా కబుర్లు చెప్పను. పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయను. అలాగే హీరోల గదులకు వెళ్లను. కాబట్టి వారు నన్ను పేర్లు పెట్టి పిచ్చిదానిగా ముద్ర వేశారు. ఈ రోజు నా దగ్గర ఏమీ లేదు. కానీ మా అమ్మ పొలాల్లో పని చేయడం చూస్తే నాకు అన్నీ ఉన్నాయని అనిపిస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. కంగనా రనౌత్ ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్ ఎమర్జెన్సీలో నటిస్తోంది. Yeh meri Mata ji hain roz 7-8 ghante kheti karti hain, aksar ghar pe log aate hain aur unse kehte hain humein Kangana ki mummy se milna hai, badi vinamrta se haath dhokar woh unhein chai pani dekar kehti hain, Main he unki Maa hoon, unki aankhein fati reh jati hai, woh hairan 1/2 pic.twitter.com/RTQX1jIG93 — Kangana Ranaut (@KanganaTeam) February 26, 2023 Please note my mother is not rich because of me, I come from a family of politicians, bureaucrats and businessmen. Mom has been a teacher for more than 25 years, film mafia must understand where my attitude comes from and why I can’t do cheap stuff and dance in weddings like them https://t.co/SH8eUfe8ps — Kangana Ranaut (@KanganaTeam) February 27, 2023 -
మోడ్రన్ డ్రెస్సులు వేసుకోనిచ్చేవారు కాదు, ఎన్నో చిత్రహింసలు : నటి
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం అక్కర్లేదు. వెరైటీ డ్రెస్సులతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ భామ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, గోనెసంచి.. ఇలా ఒకటేమిటి ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అన్నట్లు రకరకాల కాస్ట్యూమ్స్‌తో దర్శనం ఇస్తుంది. తన బోల్డ్ ఫ్యాషన్‌తో సోషల్ మీడియాను షేక్ చేసే ఉర్ఫీ తాజాగా చిన్నతనంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్‌పై మక్కువ ఉండేది, టీవీ షోస్ చూస్తున్నప్పుడు అలాంటి మోడ్రన్ డ్రస్సులు వేసుకోవాలని, ఇంకా అందంగా తయారవ్వాలని అనిపించేది. కానీ మా నాన్న అందుకు అంగీకరించేవాడు కాదు. పైపెచ్చు మమ్మల్ని హింసించేవాడు. అమ్మను ఎప్పుడూ తిడుతూ, కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడు. తండ్రి చేస్తున్న అరాచాకలను భరించలేక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. కానీ ఇప్పుడు నాకు నచ్చిన బట్టలు వేసుకుంటూ నాకు తెలిసిన ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. -
సెట్లో ప్రేమించుకున్నారు.. పెళ్లి సెట్ చేసుకున్నారు
ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు ప్రపంచంలోని ప్రేమికులంతా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వాలెంటైన్స్ డేకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రేమ తర్వాత పెళ్లి వరకు చేరిన జంటలు మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. కానీ బాలీవుడ్లో అలాంటి ప్రేమజంటలు ఎక్కువగానే ఉన్నాయి. తెరపై చూసిన ప్రేమ కథలే నిజ జీవితంలో ఒక్కటయ్యాయి. ప్రేమ పెళ్లిళ్లతో బాలీవుడ్ జంటలు అభిమానులకు సర్ప్రైజ్లు కూడా ఇచ్చాయి. కొన్ని జంటలు ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లడంలో విఫలమైనా.. మరికొన్ని జంటలు మాత్రం పెళ్లి బంధంలో అడుగుపెట్టాయి. బాలీవుడ్లో ఇటీవలే పెళ్లి చేసుకున్న కియారా-సిద్ధార్థ్ జంట నుంచి ఇప్పటిదాకా ఒక్కటైనా జంటలు ఏవో తెలుసుకుందాం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెట్లో ప్రేమించి పెళ్లి సెట్ చేసుకున్న బాలీవుడ్ ప్రేమ జంటలపై ఓ లుక్కేద్దాం పదండి. కాజోల్, అజయ్ దేవగన్ : కాజోల్, అజయ్ దేవగన్ 1995 చిత్రం హల్చల్ షూటింగ్ సెట్లో కలుసుకున్నారు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత 1999లో పెళ్లి చేసుకున్నారు. కాజోల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజయ్‌ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించికున్నప్పుడు నెలల తరబడి తన తండ్రి తనతో మాట్లాడలేదని ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత సంతోషంగా వివాహం చేసుకున్నారు. కాగా వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ పొందిన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ జంట 1970లో మొదటిసారి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కలుసుకున్నారు. అయితే ఆ గుడ్డి సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఏక్ నాజర్ సెట్స్‌లో ఉన్నప్పుడు వారి బంధం మరింత బలపడింది. చివరికి జూన్ 3, 1973న వివాహం చేసుకున్నారు. జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ సెట్లో పరిచయమై పెళ్లిదాకా వెళ్లిన జంటల్లో జెనీలియా డిసౌజా, రితీష్ దేశ్‌ముఖ్. ఈ జంట2003లో తుజే మేరీ కసమ్ సెట్స్‌లో మొదటిసారి పరిచయంతోనే మంచి స్నేహితులయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రేమ జంట ఫిబ్రవరి 3, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తేరే నాల్ లవ్ హో గయా, మస్తీ, లై భారీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. ట్వింకిల్ కన్నా, అక్షయ్ కుమార్ షూటింగ్ సెట్లో పరిచయంతో ఒక్కటైన జంట అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నా. మొదటిసారి ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ షూటింగ్లో ఈ జంట కలుసుకున్నారు. ఆ తర్వాత అక్షయ్‌కి ట్వింకిల్‌పై ప్రేమ ఏర్పడింది. ఈ జంట ప్రేమ వ్యవహారం 1999లో ఇంటర్నేషనల్ ఖిలాడీ మేకింగ్ సమయంలో మొదలైంది. రెండేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన బాలీవుడ్ జంట చివరికి జనవరి 17, 2001న వివాహం చేసుకున్నారు. దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ జంటల్లో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఒకరు. వీరి ప్రేమ 2013లో గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా సెట్స్‌లో చిగురించింది. దాదాపు ఆరేళ్ల పాటు కలిసి ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత పద్మావత్, ఫైండింగ్ ఫ్యానీ, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో కనిపించారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ బాలీవుడ్లో మరో పవర్ ఫుల్ కపుల్ ఎవరంటే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. ఈ జంట డిసెంబర్ 2021లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్లో జరిగిన అతిపెద్ద వివాహాలలో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్. దాదాపు ఐదేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఏప్రిల్ 2022లో ఒక్కటైంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ జోడికి నవంబర్‌లో ఓ పాప కూడా జన్మించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మణిరత్నం చిత్రం గురు షూటింగ్ సమయంలో కలుసుకున్న జంట ఐశ్వర్య అభిషేక్. ఈ జంట సెట్లోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటచు ప్రేమలో ఉన్న జంట ఏప్రిల్ 10, 2007న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు ఉమ్రావ్ జాన్, ధూమ్ 2 వంటి చిత్రాలలో పనిచేశారు. ఈ జంట 2011లో ఆరాధ్య జన్మించింది కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో మరో ప్రేమజంట షాహిద్ కపూర్, కరీనా కపూర్. మొదట ఆమె తాషాన్ సెట్లో సైఫ్‌ను కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సైఫ్, కరీనా రెండేళ్ల పాటు డేటింగ్ అనంతరం అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఈ ఏడాదిలో ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. రాజస్థాన్‌లో సూర్యగడ్లో ఫిబ్రవరి 7న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమకథ మొదటి చిత్రం షేర్షా సెట్స్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా పుట్టినరోజు సందర్భంగా కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా తెలియజేసింది. -
విడాకులు తీసుకున్న స్టార్ హీరో మాజీ భార్య సోదరి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ భార్య సుసానే ఖాన్ సోదరి ఫరా ఖాన్ అలీ విడాకులు తీసింది. తన భర్త డీజే అకీల్‌తో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. కాగా.. 2021లోనే తామిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. జువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ భర్త అకీల్‌తో ఉన్న చిత్రాలను పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మేము అధికారికంగా విడాకులు తీసుకున్నాం. ఈ విషయంలో మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. మేము ఒకరికొకరు చాలా ప్రేమ, సంతోషంతో ఉన్నాం. ఇకముందు ప్రయాణంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఎల్లప్పుడూ మా పిల్లలు అజాన్, ఫిజాలకు తల్లిదండ్రులుగానే ఉంటాం. ఇన్ని రోజుల మా ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇదే విషయాన్ని అకీల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. మీ ఇద్దర్నీ ప్రేమిస్తూనే ఉంటా సుసానే ఖాన్ కామెంట్ చేసింది. ఈ విడాకులు తీసుకున్న జంటపై బాలీవుడ్ నటులు ట్వింకిల్ ఖన్నా, నందితా మహతాని, సైషా షిండే, దియా మీర్జా, భావన పాండే, మోజెజ్ సింగ్, ఎల్నాజ్ నొరౌజీ తదితరులు స్పందించారు. ఫరా, అకీల్ కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 20, 1999న పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు అజాన్, ఫిజా ఉన్నారు. View this post on Instagram A post shared by Farah Khan Ali (@farahkhanali) -
దర్శకుడితో హీరోయిన్ డేటింగ్..!
బాలీవుడ్ నటి ఆకాంక్ష రంజన్ కపూర్ గిల్టీ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. అంతకుముందే పలు టీవీ సీరీస్‌ల్లోనూ కనిపించింది భామ. 2019లో టెలివిజన్ ఫ్యాషన్ సిరీస్, తేరే దో నైనా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లోనూ కనిపించింది. తాజాగా ఈ నటికి సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శకుడు శరణ్ శర్మతో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ మై డార్లింగ్ సినిమాలో చివరిసారిగా కనిపించిన నటి గుంజన్ సక్సేనా దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఆరు నెలలకు పైగా డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. శరణ్ శర్మ తన ఇన్‌స్టాలో చేసిన రంజన్ కపూర్‌తో ఉన్న ఫోటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు లవ్ సింబల్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు. గతేడాది ద్వితీయార్థంలో వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించినప్పటికీ ఎక్కడ గానీ ఈ విషయాన్ని బయటపెట్టలేదు ఈ జంట. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే వేడుకల్లోనూ రంజన్ కపూర్, శరణ్ శర్మ తరచుగా హాజరవుతుంటారు. ఈ విషయంపై సన్నిహితుడొకరు మాట్లాడుతూ..'వారు కచ్చితంగా డేటింగ్ చేస్తున్నారు. వారు తమ సంబంధాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని నేను అనుకోను. వాస్తవానికి ఈవిషయంలో వారు చాలా ఓపెన్‌గా ఉంటారు. అని అన్నారు. కాగా.. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో రంజన్ కపూర్‌ను ప్రశ్నించగా నో కామెంట్స్ అంటూ బదులిచ్చారు. కాగా.. ది గుంజన్ సక్సేనా: కార్గిల్ గర్ల్ దర్శకుడు శరణ్ శర్మ ప్రస్తుతం మిస్టర్ & మిసెస్ మహీ చిత్రీకరణలో ఉన్నారు. View this post on Instagram A post shared by Sharan Sharma (@sharanssharma) -
భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి..!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్ పెళ్లి అచ్చం సినిమాలాగే రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు ఆదిల్ దురానీతో పెళ్లయినట్లు ప్రకటించాక టన్నుల కొద్ది ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఇటీవలే మరో అమ్మాయితో ఆమె ప్రియునికి సంబంధాలు ఉన్నాయని రాఖీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ సావంత్ అతనిపై ముంబయి పోలీసులను ఆశ్రయించింది. ఓషివారా పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆదిల్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది రాఖీ సావంత్. ఆదిల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టును మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. అయితే రాఖీ సావంత్ మాత్రం ఆదిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని మీడియాకు తెలిపింది. రాఖీ సావంత్ మాట్లాడుతూ..'ఆదిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశా. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా నాటకం కాదు. అతను నా జీవితాన్ని నాశనం చేశాడు. అతను నన్ను కొట్టి నా వద్ద డబ్బు తీసుకున్నాడు. నిన్నెవరు నమ్ముతారని కొట్టేవాడు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. తన తల్లి మరణానికి కూడా ఆదిల్ కారణం.'అంటూ ఆరోపించింది. కాగా.. రాఖీ సావంత్, ఆదిల్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో తన పెళ్లిని అఫీషియల్‌గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతేడాది జూలైలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Telly Talk (@tellytalkindia) View this post on Instagram A post shared by Filmymantra Media (@filmymantramedia) -
డ్రెస్సుపై ఒక్క చిరుగూ లేకుండా అలాంటి సీన్లో నటించా: హీరోయిన్
రవీనా టాండన్.. 90వ దశకంలో బాలీవుడ్లో స్టార్ హీయిన్‌గా రాణించిన వారిలో ఆమె ఒకరు. అప్పట్లో తెరపై ఈ పేరు కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయేవారు. తూ ఛీజ్ బడి హై మస్త్ మస్త్ అంటూ ‘మొహ్రా’ సినిమాలో ఆమె వేసిన స్టెప్పులో ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆమె అందానికి బాలీవుడ్ ఫియా అయింది. వరుస సినిమాలతో అదరగొట్టేసింది. కానీ ఒకనొక దశలో ఆమెపై అహంకారి అనే ముద్రపడింది. దర్శక నిర్మాత మాట వినదనే అపవాదు ఆమెపై పడింది. ఫలితంగా కొన్ని సినిమాలు ఆమె చేతి నుంచి జారిపోయాయి. తాజాగా ఈ విషయాలపై రవినా టాండన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు అంగీకరించకపోవడంతో తనపై అహంకారి అనే ముద్ర వేశారని చెప్పారు. ‘కొన్ని విషయాల్లో నేను అసౌకర్యంగా ఉండేదాన్ని. స్విమింగ్ డ్రెస్ ధరించడం నాకు నచ్చదు. అలాగే ముద్దు సన్నివేశాలు కూడా చేయలాని ఉండేది కాదు. సినిమా ఒప్పందానికి ముందే నేను ఈ కండీషన్ పెట్టేదాన్ని. అందుకే నాపై అహంకారి అనే ముద్ర వేశారు. సినిమా అవకాశాలు రాకపోయినా కూడా.. నేను అలాంటి సీన్స్ చేయలేదు. రెండు రేప్ సీన్స్‌లో నటించినప్పటికీ.. ఎలాంటి అసభ్యతకు తావివ్వకుండా జాగ్రత్త తీసుకున్నా. డ్రెస్సుపై ఒక్క చిరుగూ కూడా లేకుండా రేప్ సీన్స్‌లో నటించిన ఏకైక నటిని నేనే. అలాంటి సీన్స్ ఉన్నాయని చాలా సినిమాలు వదులుకున్నాను. ‘డర్’ సినిమా అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని సన్నివేశాలు అసౌకర్యంగా అనిపించాయి. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించనని దర్శక,నిర్మాతలకు చెప్పేశా. ప్రేమ్ ఖైదీ చిత్రాన్ని కూడా అలానే వదిలేశా’అని రవినా టాండర్ చెప్పుకొచ్చారు. తెలుగులో బాలయ్య ‘బంగారు బుల్లోడు’, వినోద్‌కుమార్ ‘రథసారథి’, నాగార్జున ‘ఆకాశవీథిలో’ సినిమాలలో రవీనా నటించింది. -
వాళ్లు నన్ను పట్టించుకోలేదు.. అలా ఎవరకీ జరగకూడదు: వాణీ జయరామ్
ఏ వృత్తిలో అయినా పోటీ సహజం. అలా వాణీ జయరామ్ బాలీవుడ్‌కి తన వాణి వినిపించడానికి వెళ్లినప్పుడు అప్పటికే అక్కడ ‘స్టార్ సింగర్స్’గా వెలుగుతున్న అక్కచెల్లెళ్లు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల నుంచి గట్టి పోటీ ఎదురైంది. హిందీ చిత్రం ‘గుడ్డి’ (1971)లో పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాట ద్వారా బాలీవుడ్‌కి పరిచయమై ‘మధురమైన కంఠం’ అని శ్రోతల నుంచి కితాబులు అందుకున్నారు వాణీ జయరామ్. అయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. లత, ఆశాలు వాణీకి అవకాశాలు రాకుండా చేశారనే ఓ టాక్ ఇప్పటికీ ఆ నోటా ఈ నోటా వినిపిస్తుంటుంది. (చదవండి: మూగబోయిన వాణి) ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరామ్ మాట్లాడుతూ – ‘‘కెరీర్ పరంగా నేను ఎవరి పేర్లూ ఉద్దేశించి మాట్లాడను. లతాజీ, ఆశాజీ గొప్ప గాయనీమణులు. వాళ్లు నాకేమైనా చేశారా? చేయలేదా? అనే విషయం గురించి నేను మాట్లాడను. ఒకరు ఏం చేశారనే విషయంపై నేను ఓ నిర్ణయానికి రాకూడదు. అయితే హిందీలో నేను విజయాలు సాధించినప్పటికీ నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అది దురదృష్టం. అలా ఎవరికీ జరగకూడదు’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె గాయనీమణులు శంషాద్ బేగం, సుమన్ కల్యాణ్‌పూర్‌ల పేర్లను ప్రస్తావించారు. ‘‘శంషాద్, సుమన్‌లు మంచి సింగర్స్ అయినప్పటికీ అనుకున్నంతగా రీచ్ కాలేకపోయారు. ఇలా ఎందరికో జరిగి ఉండి ఉంటుంది. వారిలో నేను ఒకదాన్ని... అంతే. అయితే ఇలా జరగడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది’’ అని కూడా వాణి అన్నారు. -
ఆ హీరోతో పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్!.. రాయల్ వెడ్డింగ్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి 6న సిద్-కియారాల వివాహం జరగనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ, రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఫోర్ట్‌లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయట. ప్రస్తుతం వీరు తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని, ఓ ప్రైవేట్ జెట్‌లో వీరు రాజస్థాన్ చేరుకుంటారని సమాచారం. కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మనీష్ మల్హొత్రా సహా సిద్-కియారాల పెళ్లికి వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. కాగా షేర్షా మూవీలో తొలిసారి నటించిన ఈ జంట ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. -
కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు.. నటుడిపై సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య ఆలియా సిద్ధిఖీతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పాస్‌పోర్ట్ సమస్యలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలియా ముంబయి బాంద్రాలోని సిద్ధిఖీ ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఆమెకు ఇక్కడ ఉండే అర్హత లేదంటూ నవాజుద్దీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆలియా ఆరోపించింది. కనీసం అన్నం కూడా తిననివ్వడం లేదని.. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వట్లేదని వాపోయింది. తాజాగా తన లాయర్‌తో ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ దాదాపు రెండేళ్లుగా తన భార్య ఆలియా సిద్ధిఖీతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఆలియా తరఫు న్యాయవాది రిజ్వాన్ స్టేట్మెంట్ సంచలనంగా మారింది. ఆలియా న్యాయవాది స్టేట్మెంట్లో రాస్తూ..' నా క్లైంట్‌ను అవమానిస్తున్నారు. ఆమెకు ఆహారం తిననివ్వడం లేదు. వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు. ఆమె చుట్టూ బాడీగార్డ్స్‌ను ఉంచారు. ఆస్తి విషయంలో కావాలనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేయిస్తామని బెదిరించారు. ప్రతి రోజూ పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. నవాజుద్దీన్, అతని కుటుంబ సభ్యులు గత ఏడు రోజులుగా నా క్లయింట్‌కు ఆహారం లేదు. ఆమె ఉన్న హాలులో సీసీ కెమెరాలను అమర్చారు. ఆమె ఇద్దరు పిల్లలు కూడా మైనర్లు.' అంటూ రిలీజ్ చేశారు. నవాజుద్దీన్-ఆలియాల వివాహం నవాజుద్దీన్, ఆలియా 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షోరా, కుమారుడు యాని సిద్ధిఖీ ఉన్నారు. 2021లో ఆలియా నవాజుద్దీన్ విడాకుల నోటీసులు పంపించింది. తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. లాక్డౌన్ సమయంలో ఇది ఒక అవకాశంగా భావించానని ఆమె వెల్లడించింది. నవాజుద్దీన్, అతని కుటుంబం గృహ హింసకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. -
వదినతో మాట్లాడుతున్నా.. ఆ తర్వాతే ప్లాన్ చేద్దాం: వరుణ్ ధావన్
వరుణ్ ధావన్ బాలీవుడ్లో ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కృతిసనన్‌తో కలిసి ఆయన నటించిన బేఢియా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఆలియా భట్‌తో కలిసి ముంబయిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు యంగ్ హీరో. ఈ సందర్బంగా ఆలియా భట్‌తో పాటు పాల్గొన్న వరుణ్ ధావన్‌కు ఉహించని ప్రశ్న ఎదురైంది. ఆలియా భట్ ఇటీవలే తల్లి అయ్యారు కదా.. మీరెప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారంటూ వరుణ్ ధావన్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ..'నేను కూడా ప్లాన్ చేయాల్సిందే. ఈ విషయంపై వదినతో మాట్లాడుతున్నా.. ఈరోజు నుంచే ప్లాన్ షురూ చేద్దాం.' నవ్వుతూ సమాధామిచ్చారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అలియా తల్లి అయినందుకు అభినందనలు తెలిపారు. కాగా.. ఇటీవల అలియా, రణబీర్ కపూర్ జంటకు నవంబర్ 2022లో ఆడపిల్లను జన్మించిన సంగతి తెలిసిందే. వారి కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు. వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను జనవరి 24, 2021న అలీబాగ్‌లో వివాహం చేసుకున్నారు. కాగా.. ఆలియా.. కరణ్ జోహార్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో రణ్వీర్ సింగ్, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీలతో నటించనుంది. మరోవైపు వరుణ్ చివరిగా భేదియాలో కృతి సనన్‌తో కనిపించాడు. తర్వాత జాన్వీ కపూర్‌తో కలిసి బవాల్‌లో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
Hyderabad: బాలీవుడ్లో నటన.. కూతురికి మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ..
సాక్షి,హైదరాబాద్: మోడలింగ్ పేరుతో ప్రముఖ మాల్స్‌లో ర్యాంప్ షోలు నిర్వహించి, ప్రముఖ యాడ్స్‌లో సినీ తారలు, క్రికెటర్లతో కలిసి నటించే అవకాశాలు కల్పిస్తానని అమాయకులకు టోకరా వేస్తున్న ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాంప్ షోలో పాల్గొనే వారితో మేకప్ ఛార్జీలు, కాస్ట్యూమ్స్ ఇతర ఉపకరణాల పేరుతో ఖాతాలలో డబ్బు జమ చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన అపూర్వ అశ్విన్ దౌడ అలియాస్ అర్మాన్ అర్జున్ కపూర్ గతంలో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. కాస్మోపాలిటన్ మోడల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన అతను చైల్డ్ మోడలింగ్ షోలు నిర్వహించేవాడు. ఈ నేపథ్యంలో మదీనా గూడకు చెందిన గోపాలకృష్ణన్ కృష్ణానంద్ కుమార్తెను తాను నిర్వహించిన షోలో ఎంపిక చేశాడు. అనంతరం ఆమెకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి యాడ్‌లో నటించే అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. ఇందుకుగాను క్యాస్టూమ్స్, షూటింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.14 లక్షలు తన ఖాతాలో జమచేయించుకున్నాడు. అయితే తన కుమార్తెకు అవకాశం కల్పించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.15.60 లక్షల నగదు, 4 యాపిల్ ఫోస్లు, ల్యాప్‌ట్యాప్, 3 సిమ్ కార్డులు, 2 ఆధార్‌కార్డులు స్వాధీదీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే మంబైలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. చదవండి: కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం! -
సినిమాలు లేకపోతే మీ పరిస్థితేంటి?.. కరీనా కపూర్
బాయ్‌కాట్ బాలీవుడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలపై వరుసగా వివాదాలు తలెత్తుతున్నాయి. రెండేళ్లుగా వస్తున్న బాయ్‌కాట్ వివాదం మరోసారి షారుక్ ఖాన్ మూవీ పఠాన్‌తో ట్రెండ్ అవుతోంది. ఈ అంశంపై ఏకంగా ప్రధాని మోదీ దృష్టికి వెళ్లిందంటే దీని ప్రభావం ఏమేరకు ఉందో అర్థమవుతోంది. బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ఈ వివాదంపై తాజాగా స్టార్ నటి, సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. సినిమాలు లేకపోతే ప్రేక్షకులకు వినోదం ఎక్కడ లభిస్తుందని కరీనా ప్రశ్నించారు. ఇటీవల కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన నటి ఈ వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్ మాట్లాడుతూ.. 'బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌ను ఏమాత్రం ఒప్పుకోను. ఒకవేళ సినిమాలపై నిషేధం విధిస్తే.. మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా దొరుకుతుంది. మీ జీవితంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వినోదం ప్రతి ఒక్కరికీ అవసరం.' అని అన్నారు. రెండేళ్లుగా ఈ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. తాజాగా మరోసారి ట్విట్టర్లో ట్రెండ్ పెరిగింది. 2020లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం మరింత పుంజుకుంది.షారుఖ్ ఖాన్ పఠాన్, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్, రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర వంటి అనేక పెద్ద చిత్రాలు బాయ్‌కాట్‌ను ఎదుర్కొన్నాయి. మొదట నటీనటులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన నెటిజన్లు.. ఆ తర్వాత సినిమాలు విడుదలయ్యే సమయంలో నిషేధించాలంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. సినిమాలపై ఈ విధమైన ద్వేషాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిశారు. కరీనా కపూర్ దర్శకుడు సుజోయ్ ఘోష్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌లో కనిపించనుంది. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా, దర్శకుడు హన్సల్ మెహతా చిత్రంలో కనిపించనుంది. -
ఆ సినిమా దెబ్బకు ఉన్న ఇల్లు కూడా అమ్మేశా: మహేశ్
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మహేష్ కొఠారే మరాఠీ, హిందీలో పలు చిత్రాలను తెరకెక్కించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆయన పలు సినిమాలు నిర్మించారు. కొఠారే రాజా ఔర్ రంక్, ఛోటా భాయ్, మేరే లాల్, ఘర్ ఘర్ కి కహానీ వంటి చిత్రాలలో నటించారు. ఆ తర్వాత ధూమ్ ధడకా (1985) సినిమాతో దర్శకత్వం ప్రారంభించారు. అయితే ఆయన తాజాగా తన జీవితంలోని అనుభవాలను వివరిస్తూ ఓ పుస్తకాన్ని రచించారు. గతవారమే ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. తన జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్ట పరిస్థితులను మహేశ్ కొఠారి వివరించారు. హిందీ, మరాఠీలో పలు హిట్ చిత్రాలు నిర్మించిన మహేశ్ 'యామ్ ఇట్ ఆనీ బరాచ్ కహి' పేరుతో గతవారం పుస్తకం విడుదల చేశారు. తన జీవితంలోని అత్యంత కష్టతరమైన దశ గురించి పుస్తకంలో వివరించారు. తన 60 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. మహేశ్ పుస్తకంలో వివరిస్తూ..' నేను 1962లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ వన్, ఇప్పుడు డిజిటల్ సినిమాలు చేశా. నా జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూశా. నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో నేను చాలా అవమానానాలు ఎదుర్కొన్నా. నేను 1999లో లో మైన్ ఆగయా అనే హిందీ సినిమా తీశా. ఈ చిత్రంలో గోవింద మేనల్లుడు విజయ్ ఆనంద్ హీరో. అది నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ ప్రభావం నాపై దాదాపు 15 ఏళ్లు కొనసాగింది. ఆ కష్టకాలాన్ని అధిగమించేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ దెబ్బకు మా ఇంటిని కూడా అమ్మేశాం. నా కొడుకు ఎంబీఏ అడ్మిషన్ కోసం ఫీజు చెల్లించలేని పరిస్థితి. కానీ నా పరిస్థితిని కొడుకు అర్థం చేసుకుని డబ్బులు అడగలేదు. కానీ ఈ ప్రభావం నా కుటుంబంపై పడకుండా ఉండేందుకు నేను నా వంతు ప్రయత్నం చేశా.' అని వివరించారు. -
ప్రియురాలిని పెళ్లాడనున్న దృశ్యం-2 దర్శకుడు
దృశ్యం-2 దర్శకుడు అభిషేక్ పాఠక్ తన ప్రియురాలిని వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరిలో గోవాలో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. గోవాలోని బీచ్ టౌన్లో పెళ్లి రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాలు ధృవీకరించాయి. కాగా.. అజయ్ దేవగణ్, శ్రియాశరణ్ నటించిన దృశ్యం-2 మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టర్కీలోని ఓ పర్వత ప్రాంతంలో ఖుదా హాఫీజ్ ఫేమ్ శివలీకా ఒబెరాయ్‌కి అభిషేక్ పాఠక్ ప్రపోజ్ చేశాడు. వీరి పెళ్లి వార్తలు రావడంతో ప్రస్తుతం శివాలికా ఒబెరాయ్‌కి ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిబ్రవరిలో జరగనున్న బాలీవుడ్ జంట గ్రాండ్ వెడ్డింగ్‌కి సినీ ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అభిషేక్‌తో రిలేషన్‌పై ఓ ఇంటర్వ్యూలో శివాలికా మాట్లాడుతూ.. 'మా రిలేషన్ గురించి విని అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి కొంతమందికి ఈ విషయం తెలుసు. నేను ఖుదా హాఫీజ్ కోసం ఆడిషన్‌కు వెళ్లా. అభిషేక్‌ను కలవడానికి ముందే కుమార్జీ (కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ తండ్రి)ని కలవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని తర్వాత తెలుసుకున్నా. మేము ఒకరినొకరు తెలిసుకుని చాలా కాలం కాలేదు. కానీ ఏదైనా మనసుకు నచ్చితే అదే సరైందని నమ్ముతా. అప్పుడు అభిషేక్ దృశ్యం-2 షూటింగ్లో ఉన్నాడు. ఎన్నో ఆంక్షలున్నా కలిసేందుకు రెండేళ్లుగా తగిన సమయాన్ని వెచ్చించా.' అని తెలిపింది. కాగా.. అభిషేక్ పాఠక్ ఇటీవలే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దృశ్యం-2 సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్ నటించారు. మరోవైపు శివాలీకా ఒబెరాయ్ బాలీవుడ్లో అమ్రిష్ పూరి మనవడు వర్ధన్ పూరి సరసన యే సాలి ఆషికితో అడుగుపెట్టింది. ఆమె ఖుదా హాఫీజ్, ఖుదా హాఫీజ్- 2 వంటి చిత్రాలలో కూడా నటించింది. అభిషేక్ పాఠక్ నిర్మాతగా వ్యవహరించిన ఖుదా హాఫీజ్ సెట్లోనే ఈ జంట మొదటిసారి కలుసుకున్నారు. View this post on Instagram A post shared by ABHISHEK PATHAK (@abhishekpathakk) -
అమితాబ్ బచ్చన్ సినిమాతో విసిగిపోయా.. ఇంకెన్నిసార్లు వేస్తారు..!
ఓ సినిమాను అభిమానులెవరైనా ఎన్నిసార్లు చూస్తారు. మహా అయితే ఒకటి లేదా రెండుసార్లు. ఇక హీరో ఫ్యాన్స్ అయితే ఎక్కువసార్లు చూస్తారని మనకు తెలుసు. కానీ కొన్ని ఛానెల్స్‌లో పదే పదే వేసినా సినిమా వేసి మీకు ఎప్పుడైనా బోరు కొట్టించారా?. ఏదైనా ఛానెల్ చూస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా?. కానీ ఓ వ్యక్తికి అలాంటి అనుభవం ఎదురైంది. అలా విసిగిపోయిన ఓ ప్రేక్షకుడు ఏకంగా ఆ ఛానెల్ యాజమాన్యానికే లేఖ రాశారు. బాలీవుడ్ దిగ్గజం నటించిన సూర్యవంశం మూవీ పునరావృత ప్రసారాలతో విసిగిపోయిన ఓ సామాన్యుడు లేఖ ద్వారా తన బాధను వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ సినిమా సూర్యవంశం. సోనీ మ్యాక్స్ టీవీలో ఇప్పటికే చాలా సార్లు ప్రసారమైంది. అయితే మిగతా సినిమాల కంటే ఎక్కువగా ప్రసారం చేశారు. ఈ సినిమాకి ఉన్న భారీ డిమాండ్ కారణంగా ఛానెల్ అధికారులు తరచుగా ప్రసారం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా యాజమాన్యానికే లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది. లేఖలో రాస్తూ.. 'నాదొక విన్నపం. మీ ఛానెల్లో సూర్యవంశం అనే సినిమా ప్రసారం అవుతోంది. ఆ సినిమాను మా కుటుంబమంతా కలిసి చూస్తాం. ఎన్నోసార్లు మేం వీక్షించాం. నేను మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మీ ఛానెల్లో ఎన్నిసార్లు ఈ సినిమా ప్రసారం చేశారు. భవిష్యత్తులో ఇంకెన్ని సార్లు ఈ సినిమాను ప్రసారం చేస్తారు. ఇది మా మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. దీనికి బాధ్యులు ఎవరు? ఈ విషయం చెప్పేందుకు చాలా కష్టంగా ఉంది.' అంటూ లేఖలో వివరించారు. ఈ లేఖ చూసిన నెటిజన్స్ అతన్ని ప్రశంసిస్తున్నారు. కొందరేమో ఛానెల్ మార్చుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. కాగా.. సూర్యవంశం మూవీ 1999లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేశారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రాఖీ సావంత్ పెళ్లి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు..!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి రాఖీసావంత్ వివాహం కీలక మలుపు తిరిగింది. మొదట ఈ పెళ్లి ఫేక్ అని కొట్టి పారేసిన ఆమె ప్రియుడు ఆదిల్ ప్లేట్ ఫిరాయించాడు. ఆమెతో వివాహం జరిగిన మాట వాస్తవమేనని తాజాగా అంగీకరించారు. తన ప్రియుడు ఆదిల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. కానీ ఈ పెళ్లి ఫేక్ అంటూ ఆదిల్ ప్రకటన చేయడంపై రాఖీ బోరున విలపిస్తూ మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. (ఇది చదవండి: 'పది రోజుల్లో నా పరువు తిరిగొస్తుందా'.. బోరున ఏడ్చేసిన నటి) ఆదిల్ ఖాన్ దురానీ జులై 2022లోనే పెళ్లి చేసుకున్నట్లు రాఖీ సావంత్ ఇటీవల మీడియాతో వెల్లడించింది. ఆదిల్ ఫేక్ అంటూ చేసిన ప్రకటనపై కన్నీటి పర్యంతమైంది. రాఖీ జీవితంలో ఈ షాకింగ్ ట్విస్ట్‌ల తర్వాత.. ఆమె భర్త ఆదిల్ ఖాన్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నట్లు ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆదిల్ తన ఇన్,స్టా ద్వారా వెల్లడించారు. ఆదిల్ తన ఇన్స్టాగ్రామ్ రాఖీతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. ఆమెతో వివాహం చేసుకోనని తాను ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నాడు. రాఖీని తాను ముద్దుపేరుతో కూడా పిలుస్తానని తెలిపారు. ఆదిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' చివరగా ఇవాళ ప్రకటన వచ్చింది. నేను వివాహం చేసుకోనని రాఖీతో ఎప్పుడూ చెప్పలేదు. కేవలం కొన్ని విషయాలను చర్చించాల్సి వచ్చింది. అందుకే నిశ్శబ్దంగా ఉండవలసి వచ్చింది. మనకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాఖీ (పప్పుడి).' అంటూ పోస్ట్ చేశారు. ఈ చూసిన వెంటనే రాఖీ స్పందిస్తూ "ధన్యవాదాలు జాన్" అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మరో నటి దేవోలీనా భట్టాచార్జీ కూడా వీరి పెళ్లికి శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Adil Khan Durrani (@iamadilkhandurrani) -
అప్పట్లో స్టార్ హీరోయిన్.. కానీ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?
సినీ పరిశ్రమలో ఎందరో తారలు కనుమరుగై పోవడం మనం చూస్తుంటాం. అలాగే ప్రతి ఏటా కొత్తగా పదుల సంఖ్యలో ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడేం చేస్తోందో తెలుసా? ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ హీరోయిన్ కథేంటో చదివేద్దాం. నేహా పెండ్సే.. ఈ పేరు చాలామందికి తెలియదు. టాలీవుడ్లో సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ముంబయి భామ. ఆమెకిదే తెలుగులో మొదటి సినిమా. ఆ తర్వాత 2003లో వచ్చిన గోల్మాల్, 2008లో వచ్చిన వీధిరౌడీ సినిమాలోనూ కనిపించింది. కానీ సినిమాలతో ఆమె పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు హిందీ, మరాఠీ, తమిళ, మలయాళంలోనూ నటించింది. ఆమె 2018లో బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా కనిపించింది. కాగా.. మొదట 1995 నుంచి సీరియల్స్‌లో నటిస్తోంది. ప్రస్తుతం కూడా హిందీలో పలు సీరియళ్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘బాబీజీ ఘర్ పర్ హై’ అనే హిందీ సీరియల్ చేస్తోంది. అనితా విభూతి నారాయణ్ మిశ్రా పాత్ర పోషించినందుకు ఫేమ్ సాధించింది. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది భామ. ఇప్పుడున్న నేహాను చూస్తే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోవచ్చు.. కానీ ముంబై బ్యూటీ టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేసుంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. -
ఆలియా భట్ సినిమాతో రూ.20 కోట్లు నష్టపోయా: కరణ్ జోహార్
బాలీవుడ్ దర్శకుడు, చిత్రనిర్మాత కరణ్ జోహార్ గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2012లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఆ సినిమాతో దాదాపు రూ.20 కోట్లు నష్టపోయామని కరణ్ జోహార్ వెల్లడించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అయినప్పటికీ ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. కరణ్ దర్శకత్వం వహించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఈ చిత్రంపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కంటే ముందు ఆలియా, వరుణ్, సిద్ధార్థ్‌లతో మరో 3 చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మిగిలిన చిత్రాలను తక్కువ బడ్జెట్‌తో చేయడంతో నష్టం తిరిగి వచ్చిందని చిత్రనిర్మాత వెల్లడించాడు. సిద్ధార్థ్ 'హసీతో ఫసీ'లో నటించగా, అలియా, వరుణ్ 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' చిత్రంలో నటించారు. కరణ్ నిర్మించిన '2 స్టేట్స్'లో ఆలియా కథానాయికగా నటించిందని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌లు కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణ్వీర్ సింగ్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్, అలియా నటిస్తోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నటుడికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఇన్స్పెక్టర్ అవినాష్ షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి అతనికి పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. నటుడి ఎడమ కాలికి గాయం కావడంతో దీనికి శస్త్రచికిత్స చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ సల్మాన్ ఖాన్‌తో రాధే సినిమా కోసం యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు రణదీప్ గాయపడ్డాడు. అప్పుడు ఆయన కుడి కాలుకు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. రణదీప్ నటించనున్న ప్రాజెక్ట్‌లు రణ్‌దీప్ నటించబోయే వీర్ సావర్కర్ తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. తన రాబోయే చిత్రంలోని సావర్కర్ పాత్ర కోసం రణ్‌దీప్ హుడా చాలా బరువు తగ్గాడు. వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రకు సరిపోయేలా కఠినమైన డైట్‌ని పాటిస్తూ 22 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఇప్పటికీ వరకు షెడ్యూల్ ప్రకటించలేదు. చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ క్యాట్‌లో కనిపించాడు. ఆ తర్వాత తేరా క్యా హోగా లవ్లీలో ఇలియానా డి'క్రూజ్‌తో కలిసి కనిపించనున్నాడు.