
బుల్లితెర ప్రియులను అలరించే బిగ్బాస్ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే హోస్ట్గా మరోసారి ఆ స్టార్ హీరోనే అలరించనున్నారు. ఈ బిగ్బాస్ షోకు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో వచ్చిన ఈ రియాలిటీ షో బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిందీలో బిగ్బాస్ సీజన్-19కు సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ప్రకటించింది.
ఆగస్టు 24 నుంచి బిగ్బాస్-19 సీజన్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఈ సీజన్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో జియో హాట్స్టార్తో పాటు కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.
రెమ్యునరేషన్ తగ్గించుకున్న సల్మాన్ ఖాన్..
అయితే ఈ ఏడాది సీజన్కు సల్మాన్ ఖాన్ భారీగా పారితోషికం తగ్గించుకున్నారు. ఈ ఏడాది వీకెండ్‌కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్‌బాస్ 17వ సీజన్‌కు రూ.200 కోట్లు, 18వ సీజన్‌కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం తగ్గించుకోవడం గమనార్హం.
Bhai ke saath laut aaya hai Bigg Boss ka naya season!
Aur iss baar chalegi - Gharwalon Ki Sarkaar👑
Dekhiye #BiggBoss19, 24th August se, sirf #JioHotstar aur @colorstv par.@BeingSalmanKhan @danubeprop #VaselineIndia#BiggBossOnJioHotstar#BB19OnJioHotstar pic.twitter.com/MxqX8s0Cor— JioHotstar (@JioHotstar) July 31, 2025