బాలీవుడ్‌లో స్టార్ హీరో అని గుర్తించాలంటే కచ్చితంగా లగ్జరీ కారు ఉండాల్సిందే అంటున్నాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. మలయాళ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న దుల్కర్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాలీవుడ్ ఎంట్రీ అనుభవాన్ని పంచుకున్నాడు. హిందీలో స్టార్ హీరో అని చూపించుకోకపోతే.. కనీస మర్యాదలు కూడా చేయరని దుల్కర్(Dulquer Salmaan) అన్నారు.
బాలీవుడ్‌లో నటించేటప్పుడు నా చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్లు. నేను సెట్‌లోకి వచ్చినప్పుడు వాళ్లు నన్ను రౌండప్ చేసి ఎవరూ దగ్గరకు రాకుండా చూసుకునేవాళ్లు. నేను స్టార్ హీరో అని నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది. అక్కడ స్టార్ హీరో అని నిరూపించుకోకపోతే.. కనీసం కూర్చొవడానికి కుర్చీ కూడా వేయరు. మోనిటర్ చూడడానికి స్థలం కూడా ఇవ్వరు. చుట్టూ జనాలు..లగ్జరీ కారు ఉంటేనే మనల్ని స్టార్ అనుకుంటారు.
మలయాళంలో అలాంటి పరిస్థితి ఉండదు. సెట్‌కి ఎలా వచ్చినా సరే.. గౌరవిస్తారు. లగ్జరీకి ప్రాధాన్యత ఉండదు. ఇంటి నుంచే అన్నీ తెచ్చుకుంటాం. ఎక్కువ వరకు సొంత ఖర్చులే పెట్టుకుంటాం’ అని దుల్కర్ చెప్పుకొచ్చాడు. 2018లో కార్వాన్ చిత్రంలో దుల్కర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఆయన ‘కాంత’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


