బాలీవుడ్‌ మూవీలో విలన్‌గా కరీంనగర్‌ కుర్రాడు! | Karimnagar Young Boy Pragyan Play Villain Role In Bollywood Movie Kaala Barbarian | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ మూవీలో కరీంనగర్‌ కుర్రాడు.. విలన్‌గా రాణించేనా!

Oct 14 2023 3:36 PM | Updated on Oct 14 2023 3:59 PM

Karimnagar Young Boy Pragyan Play Villain Role In Bollywood Movie Kaala Barbarian - Sakshi

 ఓటీటీలో ఇటీవల విడుదలైన ‘కాలా బార్‌ బేరియన్‌ చాప్టర్ 1’ అనే హిందీ చిత్రానికి మంచి స్పందల లభిస్తోంది.ఈ చిత్రంలో కరీంనగర్‌కు చెందిన ప్రజ్ఞన్‌ విలన్‌గా నటించాడు. ఒక సైకో, మల్టీ పర్సనాలిటీ... ఇలా చాలా వేరియషన్స్‌ ఉన్న పాత్రలో ప్రజ్ఞన్‌ అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ యువ నటుడు ఓ తెలుగు సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. తన తొలి చిత్రానికే మంచి గుర్తింపు రావడం పట్ల ప్రజ్ఞన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’లో  చయనిక చౌదరితో కలిసి నేను నటించిన సన్ని వేశాలకు చక్కటి ప్రశంసలు వచ్చాయి. పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన పలువురు దర్శకులు ఫోన్ చేసి పశ్రంసించారు. అది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాకుండా నేను కొంతమంది దర్శకులకు ఈ సినిమా చూపించినప్పుడు  చూసిన వెంటనేతెలుగు సినిమాలో ఒక ప్రముఖ హీరో సరసన అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీని గారికి ధన్యవాదాలు .

మల్టీపుల్ డిజార్డర్ క్యారెక్టర్‌కి స్కోపున్న పాత్ర దొరికింది. ఒక మంచి నటుడికి ఇంత కంటే కావలసిందేముంది. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూ‌ట్‌లో యాక్టింగ్ కోర్సు ముగించుకోగానేఈ అవకాశం వచ్చింది. నా తొలి చిత్రానికే ఇంతటి పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని ఆయన అన్నా రు.  చాకో శామ్యూల్‌  దర్శకత్వం వహించిన  కాలా బార్‌ బేరియన్‌ చాప్టర్ 1 చిత్రంలో  వరుణ్ సింగ్ రాజ్‌పుత్, స్తుతి త్రివేది జంటగా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement