హిందీలో డియర్‌ కామ్రేడ్‌? దాని జోలికే వెళ్లనన్న హీరో | Siddhant Chaturvedi Reacts on Dear Comrade Movie Hindi Remake | Sakshi
Sakshi News home page

డియర్‌ కామ్రేడ్‌ హిందీ రీమేక్‌? స్పందించిన బాలీవుడ్‌ హీరో

Jan 3 2026 12:26 PM | Updated on Jan 3 2026 12:31 PM

Siddhant Chaturvedi Reacts on Dear Comrade Movie Hindi Remake

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ 'అర్జున్‌ రెడ్డి' సినిమా బాలీవుడ్‌లో 'కబీర్‌ సింగ్‌'గా రీమేకై సంచలన విజయం సాధించింది. ఇదే క్రమంలో విజయ్‌ పాత మూవీ 'డియర్‌ కామ్రేడ్‌' ఇప్పుడు హిందీలో రీమేక్‌ కానుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో సిద్దాంత్‌ చతుర్వేది, ప్రతిభ రంత హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

రీమేక్స్‌ జోలికి వెళ్లను
తాజాగా ఈ రూమర్స్‌పై సిద్దాంత్‌ చతుర్వేది స్పందించాడు. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇకపై రీమేక్స్‌ చేయదల్చుకోలేదన్నాడు. ఒరిజినల్‌ సినిమాలకు, అందులో నటించిన యాక్టర్స్‌కు అభిమాని అయినప్పటికీ రీమేక్స్‌ జోలికి వెళ్లదల్చుకోలేదన్నాడు. అయితే ప్రతిభతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టాడు.

అంతా గందరగోళం
అటు ప్రతిభ మాత్రం భిన్నంగా స్పందించింది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగమని కోరుతోంది. చాలా సినిమాల్లో నేను నటిస్తానని ప్రచారం జరగడం.. చివరకు వాటిలో నేను లేకపోవడంతో గందరగోళం ఏర్పడుతోంది. కాబట్టి ఏ విషయమైనా అఫీషియల్‌గా చెప్పిన తర్వాతే నమ్మండి అని పేర్కొంది.

సినిమా
సిద్దాంత్‌ చతుర్వేది చివరగా 'ధడక్‌ 2' సినిమాలో నటించాడు. ఇది తమిళ చిత్రం 'పెరియేరుమ్‌ పెరుమాల్‌' (2018)కి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ మూవీ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. 'డియర్‌ కామ్రేడ్‌' విషయానికి వస్తే.. ఇందులో విజయ్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. భరత్‌ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement