'ఆ 15 నిమిషాల పాత్ర.. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది'.. ది రాజాసాబ్ డైరెక్టర్ | The Raja Saab Director Maruthi reveals Boman Irani role in this Movie | Sakshi
Sakshi News home page

The Raja Saab Movie: 'ఆ 15 నిమిషాల రోల్.. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది'.. ది రాజాసాబ్ డైరెక్టర్

Jan 2 2026 9:07 PM | Updated on Jan 2 2026 9:25 PM

The Raja Saab Director Maruthi reveals Boman Irani role in this Movie

ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్‌కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే శుక్రవారమే రెబల్ స్టార్‌ థియేటర్లలో సందడి చేయనున్నాడు రాజాసాబ్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన విశేషాలను డైరెక్టర్ మారుతి పంచుకున్నారు. ఈ మూవీ క్రేజీ రోల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ మూవీలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ పాత్రలో రివీల్ చేశారు మారుతి. ఆయన వచ్చాక మూవీ టోన్ మారుతుందని అన్నారు. ట్రైలర్‌లో చూస్తే ఆయన మేకప్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని.. ఆయన రోల్ ఎక్కువగా లైబ్రరీలో షూట్ చేశామని తెలిపారు. ఇందులో ఆయన ఒక సైక్రియాటిస్ట్‌గా కనిపిస్తారని వెల్లడించారు. బోమన్ ఇరానీ ఎంట్రీ ఇచ్చాకే హారర్‌ కామెడీ నుంచి అస్సలు ఎవరూ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుందన్నారు. 

ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసే యాక్టర్స్‌లో బోమన్ ఇరానీ ఒకరు.. 3 ఇడియట్స్‌లో వైరస్‌ అనే క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ చిత్రంలో బోమన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉంటారని తెలిపారు. ఆయన ఉన్నంత సేపు అలా ఒక స్పెషల్‌ జోన్‌లో వెళ్లిపోతామన్నారు. నేను చెప్పడం కంటే.. మీరు తెరపై చూసినప్పుడే ఈ విషయం అర్థమవుతుందని మారుతి అన్నారు. ఈ వీడియోను ది రాజాసాబ్ టీమ్ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement