'బోర్డర్‌-2' .. సైనికులకు సెల్యూట్‌ చేసేలా సాంగ్‌ | BORDER 2 Movie Ghar Kab Aaoge Song Out Now | Sakshi
Sakshi News home page

'బోర్డర్‌-2' .. సైనికులకు సెల్యూట్‌ చేసేలా సాంగ్‌

Jan 3 2026 10:19 AM | Updated on Jan 3 2026 11:02 AM

BORDER 2 Movie Ghar Kab Aaoge Song Out Now

సన్నీ డియోల్, వరుణ్‌ ధావన్‌ కలిసి నటిస్తున్న చిత్రం బోర్డర్‌-2.. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  1997లో వచ్చిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని నిర్మించారు. తొలి పార్ట్‌ను జె.పి. దత్తా తెరకెక్కించగా.. రెండో భాగాన్ని అనురాగ్‌ సింగ్‌ రూపొందించారు. ‘విజయ్‌ దివస్‌’ని పురస్కరించుకుని విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

తాజాగా విడుదలైన సాంగ్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 1997 నాటి బోర్డర్‌ మూవీలోని ఐకానిక్ సాంగ్‌ 'సందేశే ఆతే హై'ని రీమేక్‌ చేశారు. ఆధునిక హంగులతో చాలా చక్కగా రీమేక్‌ చేశారంటూ ఈ పాటను నెటిజన్లు ప్రశంసించారు. కానీ, వరుణ్ ధావన్ పాత్ర పెద్దగా కనెక్ట్‌ కాలేదని చెబుతున్నారు. భారత్‌- పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement