కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నాడు. దర్శకుడిగా తొలి చిత్రం (కోమాలి)తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ తర్వాత తను హీరోగా తెరపైకి వచ్చాడు. అలా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్‌టుడే సినిమా చేశాడు. యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఈ తర్వాత డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. అయితే, మరోసారి దర్శకుడిగా ఒక భారీ చిత్రాన్ని ప్రదీప్ ప్లాన్ చేస్తున్నాడు.

ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. ఇప్పుడు ప్రదీప్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి పాత్ర చాలా బలంగా ఉండనుందని టాక్.. ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


