తమిళ నటుడు రజనీకాంత్ కొత్త సినిమాను ప్రకటించారు. తలైవర్ 173 పేరుతో ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ హీరో కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా తెలిపారు. రీసెంట్గా కూలీ సినిమాతో వచ్చిన రజనీ.. త్వరలో జైలర్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత రజనీ నుంచి వచ్చే సినిమా ఇదే కావడం విశేషం.
రజనీకాంత్ 173వ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ యంగ్ దర్శకుడు శిబి చక్రవర్తికి దక్కింది. అయితే, ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నట్లు గతంలో ప్రకటన వెలువడింది. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవడంతో శిబి చక్రవర్తికి అవకాశం వరించింది. గతంలో ఆయన దర్శకత్వం వహించిన డాన్ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. అయితే, ఇప్పుడు రజనీకాంత్ కోసం అదిరిపోయే కథతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీతో కూడిన ఓ కమర్షియల్ యాక్షన్ సినిమాను రూపొందింస్తున్నట్లు టాక్. ఈ మూవీకి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. 2027 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటన చేశారు.
Celebrations begin#Arambikalama #Thalaivar173 #SuperStarPongal2027 @rajinikanth @Dir_Cibi @anirudhofficial #Mahendran @APIfilms @homescreenent@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/abzvPfuEf9
— Kamal Haasan (@ikamalhaasan) January 3, 2026


