మ్యూజిక్‌ అంటే ఇష్టంతో..అమెరికాలో ఉద్యోగాన్నే వదిలేసింది

Singer And Song Writer Lisa Mishra Debut Into Bollywood - Sakshi

‘వీరే ది వెడ్డింగ్‌’ సినిమాతో బాలీవుడ్‌ సింగర్‌గా అరంగేట్రం చేసింది లీసా మిశ్రా. యూనిక్‌ వాయిస్‌తో ప్రేక్షకులను మెప్పించింది. తనకు ఇష్టమైన పాటలు పాడి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్‌ చేసే మిశ్రా చికాగోలో డాటా–ఎనలిస్ట్‌గా ఉద్యోగం చేసింది. సంగీతాన్నే కెరీర్‌ చేసుకోవడానికి అమెరికా నుంచి ముంబై వచ్చింది.

రెండు సంవత్సరాల క్రితం ప్రఖ్యాత సింగర్‌ లేడీ గాగాతో కలిసి మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిశ్రాకు ఎనిమిది లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. తన యూట్యూబ్‌ చానల్‌కు మూడు లక్షలమంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ‘మ్యూజిషియన్‌గా పేరు తెచ్చుకోవడానికి నాకు యూట్యూబ్‌ ఎంతో ఉపయోగపడింది. నా సంగీతం ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి పరిచయం కావడానికి సోషల్‌ మీడియా ఉపయోగపడింది.

కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పులా, ఒత్తిడిని జయించే శక్తిలా నా సంగీతం ఉండాలనుకుంటాను. చాలామందికి మన విజయం తప్ప ఆ విజయం కోసం గతంలో పడిన కష్టం గురించి తెలియదు. దీంతో వోవర్‌ నైట్‌ సక్సెస్‌ అంటుంటారు’  అంటుంది సింగర్‌–సాంగ్‌ రైటర్‌ లీసా మిశ్రా.
 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top