పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్ఫూర్తిదాయకమైన స్టోరీలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు అయినప్పటికీ..ఆయన చాలా సాదాసీదాగా ఉండేందుకే ఇష్టపడుతుంటారు. కష్టపడి పనిచేసేవాళ్లన్న, నిజాయితీగా వృద్ధిలోకి వచ్చిన వాళ్లను తనవంతుగా ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తుంటారు. వ్యాపార పంరంగానే దాతృత్వంలోనూ ఆయనకు ఆయనే సాటి. అలాంటి ఆనంద్‌మహింద్రా తన భార్య గురించి, కుటుంబం గురించి పెద్దగా ఎక్కడ ప్రస్తావించారు. అలాగే వారి కుటుంబ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ షేర్ చేయరు కూడా ఆయన. అంత గోప్యంగా ఉండే ఆయన తన కాబోయే కోసం సెమిస్టర్ పరీక్షలనే పక్కనపెట్టి ప్రేమించి ఆమె మనుసుని గెలుచుకుని మరి పెళ్లి చేసుకున్నారు. చెప్పాలంటే సినిమానే తలపించే స్టోరీ. అంతేగాదు బంధాలకు ఆయన ఎంత ప్రాముఖ్యత ఇస్తారనేది ఆయన అందమైన ప్రేమకథ వింటే ఇట్టే అర్థమవుతుంది. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఈ ఫిబ్రవరి మాసం సందర్భంగా ఈ వాలెంటైన్స్ డే వీక్ స్పెషల్‌గా ఆనంద్ మహీంద్రా బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ గురించి తెలుసుకుందామా..!
అప్పట్లో ఆనంద్ మహీంద్రా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతుండేవారు. ఒకసారి ఆయన కాలేజ్ ఎసైన్‌మెంట్ కోసం ఒక ఫిల్మ్ షూట్ చేయడానికి ఇండోర్‌కు వచ్చారు. అక్కడే ఆయన ఓ 17 ఏళ్ల అందమైన అమ్మాయిని చూశారు. చూసీచూడంగానే ఆమెతో ప్రేమలో పడిపోయారు. ఆ అమ్మాయి పేరు అనురాధ. ఆమెను చూసింది మొదలు ఆనంద్ మహీంద్రాకు తిరిగి హార్వర్డ్‌కు వెళ్లాలనిపించలేదు.
ఆమెతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆమెతో ఆనందంగా గడపడం కోసం ఏకంగా ఒక సెమిస్టర్ పరీక్షలను కూడా రాయకుండా వదిలేశారు. అప్పట్లో ఆ విషయం చాలా పెద్ద సంచలన నిర్ణయమో చెప్పాల్సిన పనిలేదు. అనురాధతో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఆనంద్ మహీంద్రా ఏమాత్రం ఆలస్యం చేయలేదు. బాలీవుడ్ మూవీ తరహాలో తన అమ్మమ్మ ఇచ్చిన ఉంగరంతో ఆమెకు లవ్ ప్రపోజ్ చేశారు.
అంతే.. ఆనంద్ మహీంద్రా ప్రపోజల్‌ను అనురాధా మహీంద్రా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిపోయింది. దాంతో 1985 జూన్ 17న పెద్దల సమక్షంలో ఆనంద్ అనురాధల పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగింది. దాంతో అనురాధ పేరు కాస్తా అనురాధా మహీంద్రాగా మారిపోయింది. ఇప్పుడు అనురాధ మహీంద్రా ఆనంద్ మహీంద్రాకు భార్య మాత్రమే కాదు. ఒక ప్రసిద్ధ లగ్జరీ లైఫ్‌స్టైల్ మ్యాగజీన్ ‘వెర్వ్’ వ్యవస్థాపకురాలు. ‘మ్యాన్స్ వరల్డ్’ మ్యాగజీన్‌కు సహ వ్యవస్థాపకురాలు.
ఎవరీ అనురాధ..?
అనురాధా ముంబైలో జన్మించారు. ప్రతిష్ఠాత్మక సోఫియా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆనంద్ మహీంద్రాతో పెళ్లి తర్వాత దంపతులిద్దరూ బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా వెళ్లారు. అనురాధ మహీంద్రా బోస్టన్ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ చేశారు. అనంతరం జర్నలిజం, పబ్లిషింగ్‌లో తన కెరియర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత రోలింగ్ స్టోన్ ఇండియాకు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా, ఆర్టిసాన్స్‌తో సలహాదారుగా పనిచేశారామె.
వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకునేందుకే ఇష్టపడతారు అనురాధ. అందువల్ల ఆనంద్ మహీంద్రా చాలా అరుదుగా తన కుటుంబ వివరాలను బహిర్గతం చేస్తుంటారాయన. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు దివ్య, ఆలిక. వారి వివాహమై నాలుగు దశాబ్దాలు గడిచినా..ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా చేదుడువాదోడుగా ఉంటారు. ఈ తరం ప్రేమికులకు ఆదర్శమైన జంట.
పైపై ఆకర్షణలు కాదు ప్రేమ అంటే..జీవితాంతం తోడు, నీడగా వెన్నంటి ఉంటూ.. కంటికి రెప్పలా కాచుకోవాలి బంధాన్ని అని ఈ జంటను చూస్తే అవగతమువుతోంది. అదీగాక మహింద్రా సైతం ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నానంటే అందుకు అనురాధనే కారణమని, ఆమె ఫుల్ సపోర్టే వల్లేనని తరుచుగా చెబుతుంటారు ఆనంద్. కలతలు లేని కాపురం సాగిస్తే..ఎంత పెద్ద విజయాలైనా.. సునాయాసంగా అందుకోగలం అనేందుకు ఈ జంటే ఉదహరణ కదూ..!.
(చదవండి: పాలల్లో యూరియా.. ఐస్‌క్రీమ్‌లో డిటర్జెంట్: ఆహార కల్తీపై రాఘవ్ చద్దా ఫైర్)


