ఏ రంగంలోనైనా మొదటి వ్యక్తి కావడం అంత ఈజీ కాదు. తనకంటూ సొంత మార్గాన్ని ఏర్పరచుకుని, అందులో తొలి వ్యక్తిగా నిలిచేందుకు ఎలాంటి మార్గదర్శకులు ఉండరు. అయినా సరే గెలవాలనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగి సక్సెస్‌ని అందుకుని సరికొత్త మైలురాయిని సృష్టిస్తారు అంటూ పారిశ్రామిక దిగ్గజం టెక్ మహీంద్రా తన సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా నిలిచిని టెన్జిన్ యాంగ్‌కిని ప్రశంసిస్తూ మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. ఈసారి మనకు ప్రేరణ ఈ ఐపీఎస్ అధికారిణి అంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో టెంజిన్ యాంగ్‌కి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా..!.
తవాంగ్‌కు చెందిన టెంజిన్ యాంగ్‌కి(Tenzin Yangki ) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికే తొలి మహిళ ఐపీఎస్ ఆఫీసర్‌గా(Arunachal's First Woman IPS Officer) చరిత్ర సృష్టించారు. ఇక్కడ ఆమె, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, వారసత్వంగా సక్రమించిన ప్రజాసేవ తదితరాలతో సాగిన ఆమె సక్సెస్ జర్నీ ప్రతిఒక్కరిని ఆకర్షించింది, కదిలించింది.
టెంజిన్ ఎవరంటే..
ఆమె దివంగత తండ్రి తుప్టెన్ టెంపా, IAS అధికారి, మాజీ మంత్రి, తల్లి జిగ్మి చోడెన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక టెంజిన్ విద్య నేపథ్యం వచ్చేసి..జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. ఆమె 2017లో ఏపీపీఎస్సీలో ఉత్తీర్ణురాలై, సియాంగ్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ఆ తర్వాత 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 545వ ఆల్ ఇండియా ర్యాంక్‌ను సాధించి ఐపీఎస్ క్యాడర్‌కి ఎంపికైంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకొని.. ఇటీవల అక్టోబర్ 17న, జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. 77వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల కోసం నిర్వహించిన ఈ శిక్షణలో 36 శాతం మహిళలు చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా..టెంజిన్‌ను ప్రశంసిస్తూ పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారామె.
సేవా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది..
ఈ ఐపీఎస్ అధికారిణి టెంజిన్ యాంగ్‌కి తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకువెళ్తోంది. తనకంటూ ఒక వినూత్న మార్గాన్ని ఏర్పరచుకుని అందులో తానే తొలి వ్యక్తిగా నిలవడం అంత సులభం కానిదే అయినా..ఆమె సాధించి చూపించింది. పైగా ఎందరో తన మార్గంలో నడిచేలా స్ఫూర్తిని రగిలించింది.
ఈ రోజు ఒంటిరిగా నడుస్తున్నా అని భయపడ్డా..ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు, త్వరలో వారికి మీరు మార్గదర్శకులుగా మారేరోజు వస్తుంది. అందుక ఉదహరణ టెంజిన్ యాంగ్‌కి అంటూ సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. కాగా, టెన్జిన్ సాధించిన ఈ విజయం ఈశాన్య ప్రాంతానికి చెందిన మహిళలకు ఒక గొప్ప ఒక మైలురాయి క్షణం. ఎందుకంటే అక్కడ జాతీయ నాయకత్వ పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ.
Tenzin Yangki from Tawang has become the first woman from Arunachal Pradesh to join the Indian Police Service.
An academician, a civil servant, and now an IPS officer, she carries forward the legacy of service from her parents while carving her own path of excellence.
Being… pic.twitter.com/YWt8TCLadF— anand mahindra (@anandmahindra) October 27, 2025
(చదవండి: Success Story: కాలేజ్‌కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..)


