ఉత్సాహానికి ఉల్లాసానికి లైన్‌ డ్యాన్సింగ్‌ | Line dancing is becoming more and more popular | Sakshi
Sakshi News home page

ఉత్సాహానికి ఉల్లాసానికి లైన్‌ డ్యాన్సింగ్‌

Dec 13 2025 5:20 AM | Updated on Dec 13 2025 5:20 AM

Line dancing is becoming more and more popular

ట్రెండ్‌

డాన్స్‌ చేయడమంటేనే ఉత్సాహం. అందరూ కలిసి ఒక వరుసలో చేస్తూ ఉంటే భలే ఉల్లాసం. ఇవాళ రేపు లైన్‌ డాన్సింగ్‌  చిన్నా పెద్దల్లో ట్రెండ్‌ అవుతోంది. మన పల్లెల్లో ఎప్పటి నుంచో కోలాటం,  భజనల్లోఉండే లైన్‌డాన్స్‌ ఇప్పుడు ఫిట్‌నెస్‌ మంత్రగా ఉంది. వివరాలు.

చిన్నప్పుడు పాఠశాలల్లో ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు టీచర్లు పిల్లల చేత డ్యాన్స్  చేయించేవారు. అందర్నీ ఒక వరసలో నిలబెట్టి, వారికి తగ్గ స్టెప్పులు నేర్పించి, అందరూ ఒకేలా చేసేందుకు శిక్షణ ఇచ్చేవారు. దీన్ని ‘లైన్‌ డ్యాన్సింగ్‌’ అనేవారు. అందరూ ఒకే లైన్ లో నిల్చుని చేసే డ్యాన్స్  ఇది. ప్రస్తుతం ఇది సరికొత్త ట్రెండ్‌గా మారింది. చిన్నాపెద్దా, యువత, ముసలి అనే తేడా లేకుండా చాలామంది ఇందులో పాల్గొంటున్నారు. ఈ లైన్‌ డ్యాన్స్ ను వీడియోలు తీసి నెట్లో ట్రెండ్‌ అవుతున్నారు.

ఈ ట్రెండ్‌ ఎలా మొదలైంది?
లైన్‌ డ్యాన్సింగ్‌ అనేది కొత్త పద్ధతి కాదు. అయితే కొవిడ్‌ అనంతర కాలంలో ఈ డ్యాన్స్  ట్రెండ్‌గా మారింది. ఒంటరితనంతో ఇబ్బంది పడేవారు, తోడు లేదని బాధపడేవారు, ఇతర మానసిక సమస్యలున్నవారు ఒకచోట చేరి లైన్‌ డ్యాన్స్  క్లబ్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. వరుసగా  నిలబడి, సంగీతానికి తగ్గట్లు లయబద్ధంగా నృత్యం చేయడం ద్వారా తాము ఒంటరివాళ్లం కాదు అనే భావనను పెంచుకున్నారు. మెల్లగా ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో చాలామంది ఈ లైన్‌ డ్యాన్సింగ్‌ను ఒక విధానంగా పాటిస్తున్నారు. అందరిముందూ డ్యాన్స్  చేసేందుకు భయపడేవారు, సిగ్గు, మొహమాటం కలిగినవారికి ఇది సౌకర్యవంతంగా మారింది. డ్యాన్స్  రాకపోయినా ఇతరుల నుంచి స్టెప్స్‌ నేర్చుకొని నాట్యం చేయడం మొదలుపెట్టారు.

శారీరక ఆరోగ్యానికి మేలుగా..
లైన్‌ డ్యాన్సింగ్‌ అనేది శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇందులో భారీ స్టెప్స్, స్పీడ్‌ మూమెంట్స్‌ ఉండవు. చేసేవారి వయసు, వారి శరీరాకృతి, వయసును బట్టి కొందరు ఈ లైన్‌ డ్యాన్సింగ్‌కి డ్యాన్స్  కంపోజ్‌ చేస్తుంటారు.  ఒక్కోసారి ఎవరికి నచ్చినట్లు వారు కూడా డ్యాన్స్  చేయొచ్చు. ఒకరితో కలిసి మరొకరు డ్యాన్స్  చేయడం వల్ల శరీరంలోని పలు సమస్యలు దూరమవుతాయి. యువత ఎక్కువగా కొత్త రకాల స్టెప్స్‌ ఫాలో అవుతుండగా, వయసు పైబడినవారు నిదానంగా, హాయిగా సాగే డ్యాన్స్ ని ఇష్టపడుతున్నారు. వారి ఆరోగ్యాన్ని బట్టి, వారికి అనువైన రీతిని ఎంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా కీళ్లనొప్పులు, నడుమునొప్పి తగ్గి శరీరం చురుగ్గా ఉంటుందని వారు అంటున్నారు.

మానసిక ఆరోగ్యానికి ఊతం
లైన్‌ డ్యాన్స్  కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. అందరూ కలిసి డ్యాన్స్  చేయడం ద్వారా శరీరంలో నొప్పి, బాధ తగ్గించే రసాయనాలు విడుదలై వారిని ఉల్లాసంగా ఉంచుతాయి. ఈ నృత్యం చేసిన తర్వాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తమలో ఆందోళనలు తగ్గాయని అంటున్నారు. లైన్‌ డ్యాన్స్  చేసేవారే కాదు, చూసేవారు కూడా ఆహ్లాదాన్ని ΄÷ందుతున్నామని అంటున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి కొందరు వైద్యులు ఈ డ్యాన్స్ చేయమని సలహా ఇస్తున్నారు.

సామాజిక బంధాలూ పదిలం
లైన్‌ డ్యాన్సింగ్‌ ద్వారా సామాజిక బంధాలూ పదిలమవుతున్నాయి. ఒంటరిగా బాధపడే లైన్‌ డ్యాన్స్  చేయడం ద్వారా ఇతరులతో కలిసిపోతున్నారు. తమ మనసులోని బాధల్ని దూరం చేసుకుంటున్నారు. సుమారు 43 శాతం మంది యువత ఇదే మాట చెప్తున్నారు. ఈ లైన్‌ డ్యాన్స్  తమకు బోలెడంత మంది మిత్రుల్ని దగ్గర చేసిందనేది వారు చెప్పే మాట. వయసు మళ్లినవారు సైతం ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు ఇటువంటి లైన్‌ డ్యాన్స్  క్లబ్‌లలో చేరుతున్నారు. ఇతర వ్యాపకాలతో పోలిస్తే మానసిక ఆందోళన, ఒంటరి భావనలు దూరం చేసుకునేందుకు ఇది మేలైన మార్గం అని నిపుణులు అంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement