పెళ్లిళ్లలో అతిథులను కట్టిపడేసేలా ఆతిథ్యం ఇవ్వడం గురించి విని ఉంటారు గానీ ఇలాంటిది విని ఉండరు. ఏకంగా పెళ్లికి వెళ్లగానే అక్కడ కాస్త ఎక్కువ తిని, తాగి అలసిపోతాం కామన్. అలా అలసిపోయి హ్యాంగోవర్కి గురికాకుండా ఉండేలా అక్కడే ట్రీట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లగ్జరీ ట్రెండ్ హవా వివాహాల్లో హైలెట్గా నిలవనుంది. వామ్మో ఇదేంటి ఆఖరికి వచ్చిన అతిథుల ఆరోగ్యం బాగోగుల కూడా అంటే తడిసిమోపుడవుతుందా కదా అంటారా..! అయినా సరే డోంట్ కేర్ అంటూ ..ఈ ట్రెండ్కే సై అంటోంది యువత.
అలాంటి ట్రెండ్ న్యూడిల్లీలోని రాజౌరి గార్డెన్‌లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన హెయిర్ క్లినిక్ కయాన్ ఆ పెళ్లికి వచ్చేసిన అతిధులకు ఐవీ బార్(క్లినిక్ మాదిరి సౌకర్యం) ఏర్పాటు చేశారు.
IV బార్ అంటే..
విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ వంటి వాటిని నేరుగా సిరల్లోకి ఎక్కించేందుకు (IV ఇన్ఫ్యూషన్) వీలు కల్పించే ఒక క్లినిక్ లేదా సౌకర్యం. ఇది ఎందుకంటే పెళ్లికి విచ్చేసిన అతిధులు అక్కడ వడ్డించే భోజనం, ఆల్కహాల్ ఎక్కువగా లాగించేసి ఉత్సాహంతో ఆడిపాడి సందడి చేస్తారు. దాంతో కాసేపటికే అలిసిపోయి హ్యాంగోవర్ లేదా తలనొప్పితో బాధపడుతుంటారు. అలా ఇబ్బంది పడకూడదని ఈ ఐవీ బార్లు ఏర్పాటు చేస్తున్నారట. వీటి సాయంతో తలనొప్పి లేదా హ్యాంగోవర్తో ఇబ్బందిపడే వాళ్లకు ఈ గ్లూటాతియోన్ షాట్లను అందిస్తారు.
దీని వల్ల రీహ్రైడ్రైట్ అయ్యి..యాక్టివ్గా మారతారట. అలాగే పెళ్లిళ్లలో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారని ప్రస్తుతం ఈ ట్రెండ్ని ఎక్కువగా ఫాలోఅవుతున్నారట. సదరు కయాన్ బృందానికి హ్యాంగోవర్ రాకుండా ఉండేలా చేయలేమని, కేవలం నిర్వహిస్తామని క్లియర్గా స్పష్టం చేసింది. పాపం ఆ పెళ్లిలో సర్వీస్ అందిస్తున్న ఐవీబార్ కయాన్ బృందానికి ఇప్పటికీ వందలకొద్ది ప్రశ్నలు వచ్చాయట ఆ హ్యంగోవర్ సమస్యపై.
తాము ఆల్కహాల్ తాగొద్దు అని సలహ ఇవ్వలేం గానీ దానివల్ల వచ్చే హ్యాంగోవర్ని తగ్గించే ప్రయత్నం చేయగలమని సమాధానం చెప్పడం విశేషం. అంతేకాదండోయ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి చెల్లుబాటు అయ్యే హెల్త్ ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఐవీ బార్ బృందాన్నే ఏర్పాటు చేస్తున్నారట. అంటే డీ హైడ్రేషన్ బారిన పడకుండా పెళ్లిళ్లల్లో సేవలు కూడా అందించేస్తున్నారన్నమాట. ఆఖరికి హైడ్రేషన్ సేవ కూడా వచ్చేస్తోందన్నమాట. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడమా? లేక అతిథుల పట్ల కేరింగ్నా తెలియని కన్ఫ్యూజన్ అంటూ కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.
(చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!)


