ఈ భూమ్మీద ఉండే ప్రతి జీవి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని విచిత్రమైన జీవులు మనం రోజూ చూసే జీవుల మాదిరిగా ఉండి, అత్యంత విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఎలుక మాదిరి ఈ మార్సుపియల్. ఇది చూడటానికి అచ్చం ఎలుకను పోలి ఉంటుంది. దీనికున్న ప్రత్యేక లక్షణాలు గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి అవేంటో చకచక చూసేద్దామా..!.
ఆ జీవి పేరు ఆంథెకనస్. ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే చిన్న ఎలుక లాంటి మార్సుపియల్. వీటిని పెద్ద పాదాల మార్సుపియల్స్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇవి ఎలుకలు మాత్రం కాదట. వీటిలో అత్యంత విలక్షణమైనది సంతానోత్పత్తి కాలం.
సంవత్సరానికి రెండు నుంచి మూడు వారాలు మాత్రమే ఉండే ఈ సంతానోత్పత్తి కాలంలో మగ ఆంథెకనస్ కోసం తీవ్రంగా అన్వేషిస్తుందట. అయితే ఈ మగ మార్సుపియల్ ఆడ మార్సుపియల్లతో ఏకంగా 14 గంటల వరకు సంభోగం చేస్తుందట. అందుకోసం మగ మార్సుపియల్లు నిద్రను సైతం పక్కనపెట్టేస్తాయట. దాంతో వాటి శరీరంలో టెస్టోస్టెరాన్, ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు అమాంతం పెరిపోతాయి.
దాంతో వాటి అంతర్గత అవయవాల పనితీరు దెబ్బతిని, రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా మగ ఆంథెకినేసులు ఏడాది వయసు కూడా రాకమునుపే చనిపోతాయట. అలాగే ఈ ఆడ ఆంథెకినేసులు పునరుత్పత్తి వ్యవస్థ సైతం ఇతర జీవుల కంటే భిన్నంగా ఉంటుందట. అచ్చం కంగారుల మాదిరిగా పూర్తి స్థాయి బొడ్డు సంచి ఉండదట. కేవలం చర్మ సంచి మాత్రమే ఉంటుందట.
గర్భధారణ కాలం దాదాపు 25 నుంచి 35 రోజులు. ఆ తర్వాత అపరిపక్వ పిల్లలను అనేక వారాల పాటు తల్లి శరీరాన్ని అంటిపెట్టుకుని పెరుగుతాయట. వీటికి బీటిల్స్, సాలెపురుగులు, స్లగ్స్, వంటి కీటకాలు ఆహారం, ఒక్కోసారి చిన్న చిన్న సరీసృపాలను కూడా వేటాడతాయట. ఇవి టార్పోర్ అనే ప్రత్యేకమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయట. అంటే.. శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటుని తగ్గించి శక్తిని ఆదా చేసేలా ఒక రకమైన లోతైన నిద్రలాంటిది ఈ టార్పోర్. ఇక వీటి తోకలు వాటి శరీరం కంటే చాలా పొడవుగా ఉండి, మందపాటి బూడిద లేదా గోధుమ వర్ణం బొచ్చుని కలిగి ఉంటాయి.
(చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్‌మేట్స్..ఇవాళ శబరిమలలో..!))


