చాలామంది పండక్కి ఊరు వెళుతుంటారుగానీ, ఇలా వెళ్లి అలా తిరిగి వస్తుంటారు. ఈసారి మీరు పండక్కి వెళుతున్నట్లయితే అలా చేయకండి... ఇలా చేయండి...
⇒ హైస్కూల్‌లో మీతో చదివిన వారు ఎక్కడెక్కడో ఉండి ఉంటారు. అయితే వారిలో కొందరైనా ఊళ్లో ఉంటారు. వారిని కచ్చితంగా కలుసుకొని మాట్లాడండి. ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లండి
⇒ మీకు చదువు చెప్పిన మాస్టర్లను తప్పనిసరిగా కలుసుకోండి. యోగక్షేమాలు కనుక్కోండి
⇒ చాలామంది హైస్కూల్ వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ విషయాలను, నిన్న మొన్నటి విషయాలను షేర్ చేసుకుంటున్నారు. మీకు ఇలాంటి వాట్సాప్ గ్రూప్ లేకపోతే అర్జంటుగా ఏర్పాటు చేసుకోండి
⇒ ‘స్నేహాలు ఆ సమయానికే’ అన్నట్లుగా ఉంది ఈనాటి ఉరుకుపరుగుల జీవితం. దీని నుంచి బయట పడాలంటే పాత స్నేహాల జాడలను వెదుక్కుంటూ తిరిగి వెళ్లాల్సిందే!
చదవండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేకపోయాం


