ఒకప్పుడు వాళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. సాధారణంగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత..ఉన్నత చదువుల రీత్యా లేదా మరేదైనా కారణాల వల్ల విడిపోవడం అనేది కామన్. అలానే ఈస్నేహితులు వారి లక్ష్యాల దృష్ట్యా వేరయ్యారు ఆ మిత్రులు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు శబరిమల సన్నిధానంలో తారసపడి..వేర్వేరుగా విధులు నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకరు భద్రతా బాధ్యతలైతే మరొకరు స్వామి సేవలో తరిస్తుండటం విశేషం.
ఆ స్నేహితులే ప్రసాద్ నంబూద్రి, షోజులు. ఎరన్నూర్లోని చాలకుడికి చెందిన ప్రసాద్ నంబూద్రి, మేలూర్‌కి చెందిన షోజులిద్దరూ. 1997 నుంచి 99 వరకు ఐటీఐలో కలిసి చదువుకున్నారు. రెండు సంవత్సరాల అనంతరం పై చదువుల దృష్ట్యా ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. కట్ చేస్తే..26 ఏళ్లకు అదే స్నేహితులు అయ్యప్పస్వామి సేవలో తరిస్తుండటం చూస్తే..ఎవరిని ఎప్పుడూ కలపాలో అప్పుడే కలుపుతాడు అనేందుకు ఈ ఫ్రెండ్సే ఉదాహరణ.
ఈ ఇద్దరు యాదృచ్ఛికంగా శబరిమలలోనే విధులు నిర్వరిస్తుండటం అత్యంత ఆసక్తికర అంశం. ఇక్కడ షోజు ఏఎస్‌ఐగా శబరిమలలో భద్రతా బాధ్యతలు చూసుకుంటే..నంబూద్రి యాత్రికులను నియంత్రించడం, స్వామి దర్శనం అయ్యేలా చూసే మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంటే ఇక్కడ షోజు తన స్నేహితడు మేల్శాంతిగా విధులు నిర్వర్తిస్తున్న నంబూద్రికే భద్రత కల్పిస్తూన్నాడు.
ప్రస్తుతం షోజు త్రిస్సైర్ జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తుండగా, అదేసమయంలో నంబూద్రి శబరిమల మేల్శాంతిగా ఎన్నికయ్యారు. దాంతో ఆయనకు సెక్యూరిటీగా యాదృచ్ఛికంగా చిన్ననాటి స్నేహితుడు షోజునే నియమాకం అయ్యాడు. అలాగే నంబూద్రి వచ్చే ఏడాది వరకు ఈ పదివిలో కొనసాగనున్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత విధుల రీత్యా ఒకచోటే ఆ ఇద్దరు నేస్తాలు కలిసి ఉండటం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం కాదు కదూ..!.
తంత్రి, మేల్శాంతి అంటే..
'తంత్రి', 'మేల్శాంతి' అనే పదాలు ఆలయ పూజలో అత్యున్నత స్థానాలను సూచిస్తాయి. ముఖ్యంగా శబరిమల వంటి ఆలయాలలో. 'తంత్రి' అంటే ప్రధాన పూజారి. ఆయన ఆలయ నిర్వహణ, నియామకాల తోపాటు ముఖ్యమైన క్రతువులకు బాధ్యత వహిస్తారు. 'మేల్శాంతి' అంటే ప్రధాన పూజారి సహాయకుడు లేదా ముఖ్య పూజారి అని అర్థం. ఈయన ప్రధాన పూజారి సమక్షంలో రోజువారీ పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.
Source: manorama news


