శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం | MVD launches roadside assistance service for vehicles of Sabarimala Devotees | Sakshi
Sakshi News home page

శబరిమల యాత్రికుల వాహనాలకు ఎంవీడీ అత్యవసర సహాయం

Nov 23 2025 1:03 PM | Updated on Nov 23 2025 1:03 PM

MVD launches roadside assistance service for vehicles of Sabarimala Devotees

సాక్షి పథనంతిట్ట: మండల మకరవిళక్కు(మండల దీక్ష) మహోత్సవం సందర్భంగా శబరిమల యాత్రికులు ప్రయాణించే వాహనాలకు మోటారు వాహనాల శాఖ(MVD) అత్యవసర సహాయం అందించనుంది. ఆ నిమిత్తమైన ఎంవీడీ రహదారుల పక్కనే సేవను ప్రారంభించింది కూడా. పథనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల ద్వారా శబరిమలకు ప్రయాణించే యాత్రికుల వాహనం చెడిపోయినా లేదా ప్రమాదం/ఇంకేదైన అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవను పొందవచ్చునని ఎంవీడీ పేర్కొంది. 

అంతేగాతు 24 గలంటల హైల్ప్‌లైన్‌ నంబర్లను ప్రారంభించింది. ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్ర మార్గంలో భక్తులకు ఎలాంటి అవాంతరాలు ఎదుర్వకుండా ఉండేలా సహాయం చేయడానికి ఎంవీడీ సదా సన్నద్ధంగా ఉంటుందని వెల్లడించింది. దీంతోపాటు ఎంవీడీ 24 గంటల శబరిమల సేఫ్‌ జోన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా ప్రారంభించింది. ఇలవుంకల్, ఎరుమేలి, కుట్టిక్కనం వంటి ప్రాంతాల్లో MVD కంట్రోల్ రూమ్‌ల నుంచి నిరంత అత్యవసర సహాయం అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. 

అలాగే వాహనాల బ్రేక్‌లు విఫలమై ప్రమాదాలు జరిగినప్పుడూ తక్షణ క్రేన్‌ సహాయం, అంబులెన్స​ సేవలు అన్నివేళలా అందుబాటులో ఉంటాయని తెలిపింది. పైగా ఈ తీర్థయాత్ర సీజన్‌ను సజావుగా సురక్షితంగా చేయడానికి అందరం కలిసి పనిచేయడమే గాక, సురక్షితమైన తీర్థయాత్రగా సిద్ధం చేద్దాం అంటూ పిలుపునిచ్చింది కూడా. 

ఇక శబరిమలలో ఆయా సేప్‌జోన్ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు... ఇలవుంకల్: 9400044991, 95623181, ఎరుమెలి: 9496367974, 8547639173 కుట్టిక్కనం: 9446037100, 8547639176'. అలాగే యాత్రికుల సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం..మెయిల్ఐడీ safezonesabarimala@gmail.comని సంప్రదించవచ్చు.

(చదవండి: శబరిమల యాత్రికుల భద్రతపై..కేరళ ప్రధాన కార్యదర్శికి లేఖ..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement