ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు | Chiranjeevi Konidela Praises Sushmita at Mana Shankara Vara Prasad Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

Chiranjeevi: నాకు భుజం కాస్తూ, తోడుగా ఉన్నందుకు థాంక్యూ పాప!

Jan 8 2026 7:22 AM | Updated on Jan 8 2026 11:36 AM

Chiranjeevi Konidela Praises Sushmita at Mana Shankara Vara Prasad Movie Pre Release Event

మెగాస్టార్‌ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా రాణిస్తున్నాడు. పెద్ద కూతురు సుష్మిత చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, తండ్రికి స్టైలిస్ట్‌గా పని చేస్తోంది. అలాగే గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను స్థాపించి నిర్మాతగానూ మారింది. చిరు ప్రధాన పాత్రలో నటించిన 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీని సాహు గారపాటితో పాటు మెగాస్టార్‌ కూతురు సుష్మిత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కూతురిపై ప్రశంసలు కురిపించాడు చిరంజీవి.

ఇదంతా అవసరమా?
'నా బిడ్డ సుష్మిత సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఈ పరిశ్రమ కచ్చితంగా ఆదరిస్తుందని చెప్పాను. మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారన్నాను. నేనయితే కష్టాలు చిన్నప్పుడే చూశాను. ​కానీ, నా కూతురు కష్టపడుతుంటే ఒక తండ్రిగా ఇదంతా అవసరమా? అనిపించేది. తను మాత్రం ఒక బిడ్డగా మా నాన్నను ఇంప్రెస్‌ చేయాలి, నిర్మాతగా హీరోకు ది బెస్ట్‌ ఇవ్వాలి అని మామూలు టెక్నీషియన్‌లా ప్రయత్నించింది.

నన్ను ఆదర్శంగా తీసుకుని
తనకు అన్నిరకాలుగా కంఫర్ట్స్‌ ఉన్నాయి. అసలు ఈ సినిమా చేయాల్సిన అవసరమే లేదు. తన కుటుంబాన్ని చూసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. కానీ తను అలా ఆలోచించలేదు, ఏదో సాధించాలనుకుంది. నువ్వు సాధించి చూపించావ్‌.. ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నావు. అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఎంతో కొంత కృషి చేస్తాం అని ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలాగో హిట్టవుతుంది. ఇలాంటి గర్వకారణమైన సినిమాను నాకు గిఫ్ట్‌ ఇచ్చినందుకు తనెంతో సంతోషపడుతుందని నాకు తెలుసు.

థాంక్యూ పాప
ఈ పరిశ్రమలో నాకు చేదోడువాదోడుగా ఉంటూ, నాకు భుజం కాస్తూ, అన్ని రకాలుగా అండదండలందిస్తూ.. ఇంటికి పెద్దదైనందుకు పెద్దరికాన్ని సొంతం చేసుకుంటూ తోడుగా ఉన్నందుకు థాంక్యూ పాప.. అన్నాడు. ఆయన స్పీచ్‌ విని సుష్మిత వెంటనే తండ్రి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. కాగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వరప్రసాద్‌ మూవీ జనవరి 12న విడుదల కానుంది.

చదవండి: హుక్‌ స్టెప్‌.. వింటేజ్‌ చిరంజీవి ఈజ్‌ బ్యాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement