చిరంజీవి కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్'.. జనవరి 12న థియేటర్లలోకి రానుంది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మూవీలోని మరో పాటని రిలీజ్ చేశారు. 'హుక్ స్టెప్' అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటలో చిరు హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాబా సెహగల్ ఈ గీతాన్ని పాడారు. ఇందులో బంగారు కోడిపెట్టి, ముఠామేస్త్రి, ఖైదీ నం.150 సినిమాల్లోని స్టెప్పులని చూపించారు.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)
ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో తీశారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్. వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా భీమ్స్ సంగీతమందించారు. సాహు గారపాటి, చిరు కూతురు సుస్మిత నిర్మాతలుగా వ్యవహరించారు. 'భోళా శంకర్' లాంటి ఫ్లాప్ తర్వాత దాదాపు రెండున్నరేళ్లు గ్యాప్ తీసుకుని చిరు.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాలూ ఆగిపోయాయి.. ఇది ఎంతమందికి తెలుసు)


