చిరంజీవి లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'.. సంక్రాంతి కానుకగా ఈనెల 12వ తేదీన అంటే సోమవారం నుంచి థియేటర్లలోకి రానుంది. అయితే ఈయన గత చిత్రం 'భోళా శంకర్'.. దాదాపు రెండున్నరేళ్ల క్రితం రిలీజైంది. ఇది చిరు కెరీర్‍లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత అనిల్ సుంకర మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వల్లే సినిమా ఫ్లాప్ అయిందన్నట్లు చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?)
'భోళా శంకర్ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యింది ఏంటంటే.. సోషల్ మీడియాలో కొందరు డెకాయిట్లు ఉంటారు కొందరు. వీళ్లు ఏంటంటే టైమ్ చూసి దెబ్బ కొట్టారు. ముందే మీమ్స్ తయారు చేసుకున్నారు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది. చేసినోడే నాకు ఇదంతా చెప్పాడు. చివరకు ఏమైంది ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తున్నారు' అని అనిల్ సుంకర అన్నారు.
ఫ్లాప్ అవ్వడానికి ఇతర కారణాలు కూడా చెబుతూ.. 'మొదటగా అది రీమేక్. కొవిడ్ కంటే ముందే మొదలుపెట్టాం. కానీ కొవిడ్ టైంలో ఒరిజినల్ సినిమాని అందరూ చూసేశారు. ఏదైతే బిగ్గెస్ట్ పాయింట్ అనుకున్నామో అది రిలీజ్ టైంకి వచ్చేసరికి మైనస్ అయింది. మాకు బ్యాడ్ లక్ ఏంటంటే చిరంజీవి ఒకేసారి మూడు మూవీస్ మొదలుపెట్టారు. వాటిలో మాది చివరగా రిలీజైంది. లాస్ట్ అయ్యేసరికి ఈలోపు ఒరిజినల్ అందరూ చూసేశారు. ఆ ప్రభావం కూడా ఫలితంపై పడింది. అలానే విడుదలకు ముందే ఫ్లాప్ అనేది ముందే క్రియేట్ చేశారు' అని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్)
'భోళా శంకర్' విషయానికొస్తే.. తమిళంలో అజిత్ చేసిన 'వేదాళం' రీమేక్‌గా దీన్ని తీశారు. చిరంజీవి హీరోగా, చెల్లి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. మెహర్ రమేశ్ దర్శకుడు. తమన్నా హీరోయిన్. అయితే తొలిరోజు తొలి ఆటకే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి థియేటర్లలో జనాలు కనిపించలేదు.
ఇకపోతే అనిల్ సుంకర్ నిర్మించిన లేటెస్ట్ మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. శర్వానంద్ హీరోగా నటించగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. జనవరి 14న ప్రీమియర్లతో ఇది థియేటర్లలోకి వస్తోంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనే 'భోళా శంకర్' ఫ్లాప్ గురించి అనిల్ సుంకర స్పందించారు.
(ఇదీ చదవండి: హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట)


