సంక్రాంతి బరిలో ఉన్న రవితేజ సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలతో కాస్త హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు ట్రైలర్ రిలీజైంది. ఈ చిత్రం జనవరి 13న అంటే వచ్చే మంగళవారం థియేటర్లలోకి రానుంది.
రవితేజ కెరీర్ చూసుకుంటే గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేదు. ధమాకా, క్రాక్.. కొంతమేర ఆకట్టుకున్నప్పటికీ.. టాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోల్చుకుంటే బాగా వెనకబడిపోయాడు. మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ కాస్త కుదురుకోవాలంటే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో పక్కా హిట్ కొట్టాల్సిందే. మరి ఈసారి రవితేజ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి?


